Latest Updates
-
జీడిమెట్లలో దారుణం: సహజీవనం చేస్తున్న వ్యక్తిని చంపిన తల్లి, కొడుకు… అసలు కారణం తెలిస్తే షాక్! -
తెలంగాణలో నిప్పుల కొలిమి: పీరియడ్స్ సమయంలో ఎండల నుంచి తప్పించుకోవడం ఎలా? -
క్రేజీ రెసిపీ..ఎప్పుడైనా క్రిస్పీ గుమ్మడికాయ పూరీ రుచి చూశారా? అదిరిపోయే టేస్ట్ తో పాటు హెల్తీ కూడా.. -
మే 5: ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే! -
నేటి ధన యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు, జాక్ పాట్ పక్కా! -
అంగారక సంకష్ట చతుర్థి: ఈ రోజు ఉపవాసం ఉంటే కష్టాలన్నీ తీరిపోతాయా? చంద్రోదయ సమయాలు, పూజా విధానం ఇదే! -
2026 మే 5 గ్రహ సంచారం: మీ జాతకంలో కొత్త ఉత్తేజం.. ఆ మార్పులు మీ కోసమే! -
మేషం, వృశ్చికం, ధనుస్సు రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? – మంగళవారం, 05 మే 2026 -
మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉందని చెప్పే 5 ముఖ్యమైన సంకేతాలివే! -
డీప్‌ఫేక్ సెక్స్టార్షన్ ఉచ్చులో పడ్డారా? మీ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే!
గురువారం మీ రాశిఫలాలు (27-02-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారు ఈరోజు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. లేకపోతే మీ ప్రియమైన వారితో సమస్యలను ఎదుర్కొంటారు. పని విషయంలో మీ సహోద్యోగులతో అనవసరమైన చర్చలను చేయకండి. వ్యాపారవేత్తలకు ఈరోజు ప్రతికూలంగా ఉండొచ్చు. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. ఈరోజు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మానసిక ఒత్తిడి వల్ల ఈరోజు మీ ఆరోగ్యంపై చాలా ప్రభావం ఉంటుంది.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 8 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారు ఈరోజు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోరాదు. ముఖ్యంగా మీరు ఏదైనా పాత ఆస్తిని విక్రయించాలనుకుంటే మీకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ నిర్ణయాన్ని మీరు కొంత కాలం వాయిదా వేయడం మంచిది. మీరు ఈరోజు మరింత భావోద్వేగానికి గురవుతారు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య విషయాలపై ఈరోజు జాగ్రత్తలు వహించాలి.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 27
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈరోజు చాలా ఆనందంగా ఉంటారు. మీరు ఈరోజు ఎంత పెద్ద సవాలునైనా ధైర్యంగా.. సానుకూలంగా ఎదుర్కొంటారు. ఈరోజు మీకు మీ కుటుంబసభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయంలో ఎక్కువ శ్రద్ధ చూపుతారు. అయితే, కొంతమంది మీ దృష్టిని అనవసరమైన విషయాల వైపు మళ్లించడానికి ప్రయత్నించవచ్చు. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆలోచనాత్మకంగా ఖర్చు చేయాలి.
లక్కీ కలర్ : కుంకుమ
లక్కీ నంబర్ : 38
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:15 నుండి రాత్రి 7:20 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు కొత్త వ్యాపారంతో చాలా బిజీగా ఉంటారు. మీకు ఏదైనా ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తితే, మీకు సహాయం చేయడానికి మీ తండ్రి సిద్ధంగా ఉంటారు. త్వరలో మీకు సరైన ఫలితాలు వస్తాయి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : ఉదయం 6:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈరోజు పనిలో బాగా ఉంటుంది. ఈరోజు మీకు ఇంక్రిమెంట్ లేదా ప్రమోషన్ వచ్చే బలమైన అవకాశం ఉంటుంది. మీ సహోద్యోగితో సంబంధం బాగా మెరుగుపడొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు శాంతియుతంగా మాట్లాడాల్సి వస్తుంది. ఇది మీ జీవిత భాగస్వామికి కోపం తెప్పిస్తుంది.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 6
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2:15 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులపై శ్రద్ధ వహించాలి. ఈరోజు మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. ఈ రోజు మీకు కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. మీ విజయాల గురించి మీ తల్లిదండ్రులు గర్వపడతారు. ప్రేమ విషయంలో ఈరోజు మీరు నిరుత్సాహ పడొచ్చు. మీరు కోరుకున్న భాగస్వామి కోసం అన్వేషణ సరైన సమయంలో ముగియవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.ఈ రోజు మీరు మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 16
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:40 నుండి రాత్రి 7:15 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారిలో ఈరోజు విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఇటీవల రాసిన పరీక్షలలో మంచి విజయాన్ని సాధించవచ్చు. మీరు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే, ఈరోజు మీరు కొన్ని శుభవార్తలను వింటారు. ఉద్యోగులకు ఈరోజు ప్రమోషన్ లభించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈరోజు కుటుంబంలో కొన్ని వివాదాలు ఏర్పడవచ్చు. మీ జీవిత భాగస్వామి మీ కొన్ని విషయాలతో ఏకీభవించకపోవచ్చు. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6:15 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీరు విశ్రాంతి తీసుకోవాలి. ఆర్థిక పరమైన సమస్యలు ఈరోజు పరిష్కరించబడతాయి. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు ముఖ్యమైన ఆర్థిక విషయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈరోజు కార్యాలయ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బాగా ఉంటుంది.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 15
లక్కీ టైమ్ : ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు పని విషయాలపై శ్రద్ధ పెట్టాలి. మీరు కొన్ని వ్యక్తిగత సమస్యల కారణంగా మీరు పనులపై శ్రద్ధ చూపలేరు. అందువల్ల మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచండి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు కొన్ని ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చు. శృంగార జీవితం ఈరోజు బాగుంటుంది. మీకు మీ భాగస్వామి యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : డార్క్ ఎల్లో
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : సాయంత్రం 5:15 నుండి రాత్రి 10:20 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారు ఈరోజు మీ వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కొంటుంటే, మీరు మీ మొండి స్వభావాన్ని వదిలి, రాజీపడాలి. మీ మొండితనం మీ సంబంధానికి ఏ విధంగానూ మంచిది కాదు. ప్రేమ విషయంలో ఈరోజు చాలా సవాళ్లు ఎదురవుతాయి. వ్యాపారవేత్తలకు ఈరోజు నష్టాలు రావచ్చు. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 14
లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో మీకు సానుకూల ఫలితాలు లభిస్తాయి.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబంలో శుభప్రదంగా ఉంటుంది. మీరు కొన్ని శుభవార్తలు వినొచ్చు. ఇది మీ కుటుంబ సభ్యులను సంతోషపరుస్తుంది. ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగ్గా ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు



Click it and Unblock the Notifications