బుధవారం దినఫలాలు : ఉద్యోగులకు ఆఫీసులో సహోద్యోగులతో పోటీ పెరగొచ్చు...!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, పుష్యమాసం బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope Febuary 03, 2021

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు స్నేహితులతో సరదాగా గడుపుతారు. మీకు ఈరోజు పనిభారం చాలా తక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు మీ కోసం అదనపు సమయాన్ని పొందుతారు. ఈరోజు రిటైల్ వ్యాపారులు మంచి ప్రయోజనం పొందవచ్చు. మరోవైపు, చమురుకు సంబంధించిన వ్యాపారం చేసే వ్యక్తులు కూడా విపరీతమైన ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. అయితే ఈరోజు ఆర్థిక పరంగా చాలా ఖరీదైనది. ఇతరులను ఆకట్టుకోవడానికి ఎక్కువ ఖర్చు చేయడం మానుకోండి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 8:40 నుండి మధ్యాహ్నం 3:45 గంటల వరకు

 వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు ప్రయాణం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు దూరప్రాంతాలకు ప్రయాణం మంచిది కాదు. మీ స్వభావంలో కొంత ఉత్సుకత ఉండవచ్చు. ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో తమ సీనియర్ అధికారులతో సమన్వయాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించాలి. ఈరోజు వారు ఇచ్చిన ఏ బాధ్యత అయినా పారదర్శకతతో నెరవేర్చేందుకు ప్రయత్నించాలి. వ్యాపారులు ఈరోజు చిన్న ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చు. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 7 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పని విషయంలో ఈరోజు మిశ్రమ ఫలితాలు అవుతాయి. మీరు చాలా ఒత్తిడిని అనుభవించవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. తల్లిదండ్రులతో మీ సంబంధం మరింత బలంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి అందమైన బహుమతిని పొందవచ్చు. శృంగార జీవితంలో మీ భాగస్వామికి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, ఈరోజు మీరు ఒత్తిడి కారణంగా మంచి అనుభూతి చెందరు.

లక్కీ కలర్ : డార్క్ పింక్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యాన్ని విస్మరిస్తూ ఉంటే, భవిష్యత్తులో చాలా ఇబ్బందుల్లో పడవచ్చు. ఇంట్లో అందరితో మంచిగా ప్రవర్తించండి. పెద్దలను గౌరవించండి మరియు చిన్నవారిని ప్రేమతో చూసుకోండి. మీ భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీరు మీ కోసం కొన్ని వస్తువులు, డ్రస్సులను షాపింగ్ కూడా చేయవచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగులతో పోటీ పెరుగుతుంది. వ్యాపారులకు ఈరోజు లాభం రావచ్చు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగులు చేసిన తప్పును మళ్లీ చేయకుండా ఉండాలి. ఎందుకంటే, ఈరోజు సీనియర్ అధికారులు మీపై కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవచ్చు. వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. మరోవైపు మీ జీవిత భాగస్వామితో సంబంధం మంచిగా ఉంటుంది. క్లిష్ట పరిస్థితులలో మీ ప్రియురాలి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మరోవైపు, మీరు అవివాహితులు మరియు ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే, ఈరోజు కొన్ని శుభవార్తలను వింటారు. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు చాలా ఉత్సాహం మరియు శక్తితో నిండి ఉంటారు. ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. మీరు నిరుద్యోగులై, ఉద్యోగం ఎదురుచూస్తుంటే, మీకు మంచి అవకాశం లభిస్తుంది. వ్యాపారులు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీరు రియల్ ఎస్టేట్‌ రంగంలో పని చేస్తుంటే, మీ నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోండి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. తల్లిదండ్రులు మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు మరియు మీరు వారి ఆశీర్వాదం పొందుతారు. మీ వైవాహిక జీవితంలో ఆనందాలు కూడా పెరుగుతాయి. జీవిత భాగస్వామి నుండి ఆర్థిక ప్రయోజనం పొందొచ్చు. ఆరోగ్య పరంగా అంతా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:20 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో ఫ్యాషన్ సంబంధిత వ్యక్తులకు చాలా అదృష్టం కలిసి రానుంది. చిన్న వ్యాపారులు ఈరోజు వివాదస్పద సమస్యలకు దూరంగా ఉండాలి. లేదంటే మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు దూరం కావచ్చు. మీ ప్రియమైన వారికి అబద్ధం చెప్పడం మానుకోండి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది. మీ ఆర్థిక నిర్ణయాలు ఇదే విధంగా తీసుకుంటే, త్వరలో మీరు మీ అన్ని ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. ప్రేమికులకు ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 29

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు అంటువ్యాధుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. కొద్దిగా అజాగ్రత్త ఉన్నా కూడా, మిమ్మల్ని పెద్ద ఇబ్బందుల్లో పడేస్తుంది. మీ జీవిత భాగస్వామితో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రేమ విషయంలో ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఒక చిన్న విషయం గురించి మీరు మీ భాగస్వామితో చర్చించవచ్చు. కార్యాలయంలోని సీనియర్ అధికారులు ఈరోజు మీకు కొంత కష్టమైన పనిని అప్పగించవచ్చు. అయితే, మీరు మీ తరపున కష్టపడి పనిచేస్తారు మరియు మీకు ఉన్నతాధికారుల మద్దతు కూడా లభిస్తుంది. ఔషధ వ్యాపారులు ఈరోజు లాభం పొందుతారు.

లక్కీ కలర్ : లైట్ రోజ్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 6 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో విద్యార్థులు ఈరోజు శ్రద్ధగా అధ్యయనం చేయాలి. తద్వారా మీరు ఉజ్వలమైన భవిష్యత్తు గురించి మీ కలను నెరవేర్చవచ్చు. ఈ రోజు, మాట్లాడేటప్పుడు, మీ పదాలను చాలా ఆలోచనాత్మకంగా ఉపయోగించాలి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో గొప్ప రోజు కానుంది. మీ ప్రియమైనవారు మీ కోసం ఆశ్చర్యకరమైన ప్రణాళికను రూపొందించవచ్చు. శృంగార జీవితం గురించి మాట్లాడితే, మీ భాగస్వామికి ప్రత్యేక బహుమతి ఇవ్వడం మరువకండి. ఉద్యోగులకు కార్యాలయంలో పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. సహోద్యోగులతో సమన్వయం కూడా మంచిగా ఉంటుంది. అదే సమయంలో, వ్యాపార వ్యక్తులు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు మంచి పుస్తకాలను చదివితే, ప్రయోజనం ఉంటుంది. ఇది మీ మనస్సుకు మంచి అనుభూతి కలిగిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. మీరు మీ ప్రియమైనవారితో కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. పిల్లల విద్యకు సంబంధించిన ఆందోళన పెరగొచ్చు. మరోవైపు, మీరు పిల్లల విద్య కోసం ఈ రోజు చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు శని మహాదేవుని ఆరాధనతో రోజు ప్రారంభించండి. ప్రతి ప్రయత్నంలోనూ మీరు విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో పనితీరు ప్రశంసనీయంగా ఉంటుంది. మీ పనితో సీనియర్ అధికారులు సంతృప్తి చెందుతారు. ఈరోజు వారు మీకు కొన్ని ముఖ్యమైన బాధ్యతలను కూడా అప్పగించవచ్చు. మీ తరపున మీరు కష్టపడాలి ఎందుకంటే మీ యజమాని మీపై నిఘా ఉంచుతారు. స్టాక్ మార్కెట్లో పనిచేసే స్థానికులు మిశ్రమ ఫలితాలను పొందవచ్చు. మరోవైపు, ఆహార ధాన్యాలతో పనిచేసే వ్యక్తులు ఊహించిన విధంగా ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమ విషయంలో, ఈరోజు మీకు ప్రత్యేకమైనదిగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి ఉదయం 8:45 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు ఏదైనా నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. ఈ సమయంలో ఉద్యోగులు తమ ఉద్యోగాలను మార్చకుండా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు సంతృప్తికరంగా ఉంటుంది. ఈరోజు మీరు చాలా ఆలోచనాత్మకంగా ఖర్చు చేస్తారు. మీరు పొదుపుపై ​​కూడా దృష్టి పెట్టగలరు. తల్లిదండ్రులు మంచి ఆరోగ్యంతో ఉంటారు. ఈరోజు మీరు వారితో తగినంత సమయం గడపడానికి అవకాశం పొందుతారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో పెద్ద వాదన చేయవచ్చు. మీరు మీ కోపాన్ని మరియు మాటలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Wednesday, February 3, 2021, 5:00 [IST]
Desktop Bottom Promotion