శనివారం మీ రాశిఫలాలు (11-01-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, పుష్యమాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు శృంగార జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది. పనిలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. మీరు మీ విశ్వాసాన్ని ఉండటం ద్వారా మీరు ప్రతి సమస్యను సులభంగా పరిష్కరిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి రాత్రి 7:30 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో మీకు వాదనలు ఉండవచ్చు. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి యొక్క మానసిక స్థితి సరిగ్గా ఉండదు. మీరు ప్రశాంతంగా ఉండటం మంచిది. ఈ రకమైన విషయాలు మీ ఒత్తిడిని పెంచుతాయి. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే బయటి ఆహారాన్ని తగ్గించాలి. లేకపోతే మీరు ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : ఉదయం 6:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి ఈరోజు వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. ఇది మీ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఈ రోజు ప్రేమలో ఉన్నవారికి గొప్ప రోజు అవుతుంది. పని విషయంలో మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ ఎల్లో

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో ఆనందకరమైన రోజు గడుపుతారు. మీరు మీ జీవిత భాగస్వామితో ప్రేమను పంచుకుంటారు. మీరు ఒకరితో ఒకరు సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు కనబడుతున్నాయి. మీలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావడానికి ఇది సరైన సమయం. కాబట్టి మీ విలువైన సమయాన్ని వృథా చేయకండి.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:15 నుండి రాత్రి 7:20 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో సంతృప్తి చెందకపోవచ్చు. మీరు ఎట్టి పరిస్థితిలో తొందరపడకూడదు. మీరు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు తల్లిదండ్రుల సహాయంతో మీరు పెద్ద ప్రయోజనం పొందవచ్చు. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. మీ శృంగార జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ అలాగే ఉంటుంది. ఈ రోజు వివాహితులకు మంచి రోజు అవుతుంది. మీ వివాహ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారికి అన్నిచోట్ల పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉపాధి పొందిన వారికి వారి సీనియర్ల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా మంచి ఫలితాలు కనబడుతున్నాయి. మీరు వివాహం చేసుకుంటే, మీ జీవిత భాగస్వామితో సమయం గడపడం మంచిది. మీకు చాలా ముఖ్యమైన రోజు అవుతుంది. ఎందుకంటే మీ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:45 నుండి సాయంత్రం 6 గంటల వరకు

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. కార్యాలయంలో నిజాయితీతో మీరు చేస్తున్న కృషిని చూసి మీ సీనియర్లు చాలా సంతోషిస్తారు. మీరు ఈ విధంగా పనిచేస్తూ ఉంటే, మీకు త్వరలో ప్రమోషన్ రావచ్చు. ఈరోజు వివాహిత జంటలకు మంచి రోజు అవుతుంది. ప్రేమ విషయంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : ఉదయం 6:55 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పనికి సంబంధించిన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మీరు అలసిపోతారు. ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి మీరు సరైన దిశలో పనిచేయాలి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉదయం 11:45 నుండి రాత్రి 8:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు అన్ని పరిస్థితులు గందరగోళంగా అనిపించొచ్చు. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటి సమయంలో మీరు మీ పెద్దలతో లేదా సన్నిహితుడితో మాట్లాడితే, ప్రయోజనం పొందుతారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మీ వ్యక్తిగత సంబంధాలు బాగుంటాయి. ఈ రోజు మీ ఇంట్లో బంధువులు మరియు స్నేహితులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : ఉదయం 11:30 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి మనసు ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఎవరితో అయినా వివాదం పెరగొచ్చు. మీ అవగాహనతో మీరు విజయాన్ని సాధించడానికి ప్రయత్నించాలి. మీ కుటుంబంలో ఆనందం ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. కొన్నిపనులు మీ సహోద్యోగుల సహాయంతో సకాలంలో పూర్తవుతాయి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏదైనా పత్రాలపై సంతకం చేయడానికి ముందు మీరు ప్రతిదీ సరిగ్గా చెక్ చేయాలి. తొందరలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఎందుకంటే మీరు మోసపోవచ్చు. ఆర్థిక పరంగా మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే, మీకు ప్రయోజనాలు లభిస్తాయి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి రాత్రి 8:20 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించకుండా మాట్లాడే మీ అలవాటు ఈరోజు మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగస్తులు పనిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలోనూ ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

Story first published: Saturday, January 11, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion