Latest Updates
-
ఉగాది స్పెషల్ తమిళనాడు ఫేమస్ వెప్పం పూ రసం..హెల్త్ కి హెల్త్.. టేస్ట్ కి టేస్ట్! -
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ స్వామిని దర్శిస్తే డయాబెటిస్ పూర్తిగా నయం! -
కస్టర్డ్ పౌడర్,చక్కెర లేకుండానే..ఇంట్లోనే క్రీమీ,హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం!
గురువారం మీ రాశిఫలాలు (23-01-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, పుష్యమాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఆలోచనాత్మకంగా గడుపుతారు. ఈ రోజు మీరు చిన్న పెట్టుబడి కూడా పెట్టవచ్చు. ఈరోజు మీ వైవాహిక జీవితంలో ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలి. ప్రేమ విషయంలో చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు మీరు ఒక ప్రత్యేక వ్యక్తిని కలవవచ్చు. తొలి చూపులోనే మీరు వారిని ఆకర్షించవచ్చు. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ : 25
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారు ఈ రోజు శృంగార జీవితంలో మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ రోజు మీ భాగస్వామి యొక్క మానసిక స్థితి చాలా బాగుంటుంది. ఈ రోజు మీరిద్దరూ చాలా ఆనందించబోతున్నారు. ఈ రోజు సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. ఈ రోజు తల్లిదండ్రుల సహాయంతో, కుటుంబానికి సంబంధించిన ఏదైనా పని పూర్తవుతుంది. ఆర్థిక పరంగా ఎలాంటి సమస్య ఉండదు. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 39
లక్కీ టైమ్ : సాయంత్రం 4:55 నుండి రాత్రి 11 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. మీరు ఈ రోజు మీ సామాజిక జీవితంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మీరు ఏదైనా సామాజిక కార్యక్రమంలో కూడా పాల్గొనవచ్చు. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది. మీరు మీ వివాహ జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆనందిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. పనిలో ప్రతికూల పరిస్థితులు ఎదురుకావచ్చు. ఆరోగ్యానికి సంబంధించి చిన్న సమస్యలు ఉండొచ్చు.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : ఉదయం 6:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారు ఈరోజు సరైన ఫలితాలను పొందుతారు. ఈరోజు వైవాహిక జీవితానికి అద్భుతమైన రోజు అవుతుంది. మీ జీవిత భాగస్వామితో మీకు మంచి సంబంధాలుంటాయి. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యం విషయంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోరు.
లక్కీ కలర్ : పసుపు
లక్కీ నంబర్ : 21
లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి రాత్రి 7:40 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక సమస్యల వల్ల చాలా ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఈరోజు సొంత వారితోనే విభేదాలు ఉంటాయి. ఇది సంబంధాలలో దూరాన్నిపెంచుతుంది. పని విషయంలో మీరు చాలా కష్టపడాలి. మీ జీవిత భాగస్వామితోనూ ఈరోజు వివాదాలు ఉండొచ్చు. ఆరోగ్యం విషయంలోనూ ప్రతికూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : డార్క్ గ్రీన్
లక్కీ నంబర్ : 45
లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి రాత్రి 8:20 గంటల వరకు

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22
ఈ రాశి వారు ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు శుభప్రదమైన ఫలితాలను పొందుతారు. మీ వైవాహిక జీవితంలోనూ కొంత మెరుగుదుల కనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన మీ పట్ల మంచిగా ఉంటుంది. ఈ రోజు పిల్లలు మిమ్మల్ని నిరాశపరచగలరు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : ఉదయం 6:30 నుండి సాయంత్రం 3 గంటల వరకు

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో ముఖ్యమైన రోజు అవుతుంది. ఈ రోజు కార్యాలయంలో, మీరు మీ పనులన్నింటినీ సమయానికి పూర్తి చేయగలుగుతారు. అయితే మీ కుటుంబ జీవితం కొంత కఠినంగా ఉంటుంది.అయితే ఓపికగా ఉండాలి. వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. ప్రేమ విషయానికొస్తే ఈరోజు ఒక అద్భుతమైన రోజు అవుతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 30
లక్కీ టైమ్ : ఉదయం 9:35 నుండి సాయంత్రం 5 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు భారీ ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి నుండి కూడా ఆర్థిక ప్రయోజనాన్ని పొందవచ్చు. వ్యాపారస్తులకు ఈరోజు ప్రయోజనం కనిపిస్తుంది. కుటుంబ పరంగా గొప్ప రోజు అవుతుంది. ప్రేమ విషయంలో ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు గొప్పగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీరు స్నేహితులతో కొంత సరదాగా గడుపుతారు. వ్యాపారులకు ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి మధ్యాహ్నం 2:55 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారికి ఉద్యోగంలో బదిలీలు అత్యంత సాధారణమే అని విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈరోజు మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మద్దతు మీకు ఉంటుంది. ప్రేమ విషయంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:40 నుండి రాత్రి 7 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆదాయం తెచ్చుకోవడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కానీ మీరు విజయం సాధించగలరు. మీ వివాహ జీవితంలో కొంత ఆందోళన ఉంటుంది. ఈ రోజు విద్యార్థులకు చాలా పవిత్రంగా ఉంటుంది. ఎంబీఏ, ఆర్ట్స్ రంగానికి సంబంధించిన విద్యార్థులు ఏదైనా పెద్ద విజయాన్ని పొందవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా బాగుంటుంది.
లక్కీ కలర్ : పసుపు
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. అకస్మాత్తుగా ఖర్చులు పెరగడం అనేది మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమ మరియు పరస్పర అవగాహన పెరుగుతుంది. మీ ఆరోగ్యం బాగా ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 10 గంటల వరకు



Click it and Unblock the Notifications











