For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గురువారం మీ రాశిఫలాలు (30-01-2020)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, మాఘమాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈరోజు అధిక పని భారం కారణంగా మీరు కొంచెం ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో అన్ని సాఫీగా సాగుతాయి. మీ కుటుంబంతో సంబంధాలు బాగా ఉంటాయి. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి రాత్రి 7 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు పనిలో మంచి అవకాశాలు పొందుతారు. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. అకస్మాత్తుగా కొన్ని ఖర్చులు పెరగొచ్చు. కుటుంబ జీవితంలో కొంత అసమ్మతి ఉంటుంది. ఇది మిమ్మల్ని బాగా నిరాశకు గురి చేస్తుంది. ఈ రాశి విద్యార్థులకు ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. పెద్దలకు ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు మానసిక శాంతి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రయోజనం చేకూరుతుంది. మీరు వ్యాపార పరంగా ఈరోజు పెద్ద ప్రయోజనాలన పొందవచ్చు. ప్రజలలో మీ మంచి ప్రవర్తన వల్ల మీకు ప్రశంసలు లభిస్తాయి. ఈరోజు కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మంచిగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య పరంగా మీరు రిలాక్స్ అవుతారు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు పెద్ద సమస్యలలో చిక్కుకోవచ్చు. అయితే మీరు నిరాశ చెందకూడదు. ఎలాంటి పరిస్థితిలో అయినా ప్రశాంతమైన మనసుతో ఆలోచించాలి. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. అయితే కొంత పొదుపుపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ కుటుంబంతో మీ సంబంధాలు బలంగా ఉంటాయి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 25

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 7:45 గంటల వరకు

2020లో కర్కాటక రాశి ఫలాలు : ఈ ఏడాది ఎలాంటి పరిస్థితుల్లో అయినా విజయం మీదే...

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు ఈరోజు సహోద్యోగుల సహాయంతో కార్యాలయంలో పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా నిర్ణయాలను ఆచి తూచి తీసుకోవాలి. అదనపు ఆదాయం కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఈరోజు మీ కుటుంబ వాతావరణం మిమ్మల్ని ఆనంద పరుస్తుంది. మీరు చాలా అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు

కన్య ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు కష్టంగా ఉంటుంది. మీ ప్లాన్ ప్రకారం ఈరోజు ఎలాంటి పనులు జరగవు. దీంతో మీరు నిరుత్సాహ పడతారు. అయితే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు. మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే మీరు ఎలాంటి రిస్కులు తీసుకోకుండా ఉండండి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా బలహీనంగా ఉంటారు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి రాత్రి 7 గంటల వరకు

మేష రాశి జాతకం 2020 : ఆ విషయంలో అనేక మలుపులు ఉంటాయట...!

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు మాత్రం ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబానికి మరింత ఆప్యాయత లభిస్తుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపలేరు. ఈ రోజు వారు చాలా బిజీగా ఉంటారు.

ఆరోగ్యం పరంగా అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : సాయంత్రం 6:30 నుండి రాత్రి 10 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. మీరు స్నేహితులు లేదా కుటుంబసభ్యులతో కలిసి పిక్నిక్ కోసం వెళ్ళవచ్చు. మీ ప్రియమైనవారితో కలిసి ఉండటం చాలా సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మీకు విజయాలు దక్కుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. వివాహ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మీ పనులు ఈరోజు సకాలంలో పూర్తి కావు. పనులన్నీ చాలా నెమ్మదిగా సాగుతాయి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 8:20 నుండి మధ్యాహ్నం 3:40 గంటల వరకు

2020లో వృషభ రాశి ఫలితాలు : ఈ రెండు నెలల్లో మీకు అత్యంత అనుకూలంగా సమయం...!

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు మంచి మూడ్ లో ఉంటారు. ఈరోజు ఆర్థిక పరంగా కూడా అనేక లాభాలు పొందుతారు. మీకు ఈరోజు కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు మద్దతు ఇస్తారు. మీ వివాహ జీవితంలో కూడా ఎలాంటి సమస్య ఉండదు. మీ జీవిత భాగస్వామి కారణంగా మీ జీవితంలో ఏదైనా సానుకూల మార్పు వచ్చే అవకాశం ఉంది. కార్యాలయంలో, మీరు పనిపై పూర్తి శ్రద్ధ చూపుతారు. మీరు మీ అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేయగలరు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీకు ఈరోజు కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి. మీరు ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అదనపు డబ్బు సంపాదించడానికి బలమైన అవకాశం ఉంది. మరోవైపు, మీ జీవిత భాగస్వామికి కూడా ఆనందం లభిస్తుంది. ఈ రోజు కష్టతరమైన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. ఉన్నతాధికారులు మరియు సహోద్యోగులతో మీ సంబంధం బాగుంటుంది.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 5:50 నుండి మధ్యాహ్నం 2:15 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో అనుకూలంగా ఉంటుంది. పనిలోనూ వేగం ఉంటుంది. మీ సీనియర్లు దీని వల్ల బాగా ప్రభావితమవుతారు. ఆర్థిక పరంగా అనుకూలంగానే ఉంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. ప్రయాణానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:25 నుండి రాత్రి 10:10 గంటల వరకు

English summary

Daily Horoscope January 30, 2020

Today, for some zodiac signs there will be a lot of challenges and for others luck will favour them. It is better to understand what the stars have in store for you so that you tackle your problems beautifully. Read your daily horoscope to know more.
Story first published: Thursday, January 30, 2020, 6:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more