Latest Updates
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు!
ఆదివారం మీ రాశిఫలాలు (05-01-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ధనుర్మాసం, ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారు ఈరోజు వివాహం విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఎందుకంటే పెళ్లి కాని వారికి ఈరోజు వివాహ ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీరు ఉత్సాహంతో ఉంటారు. పని విషయంలో మంచి ఫలితాలను పొందుతారు. మీ నైపుణ్యాల వల్ల మీరు కూడా విజయం సాధించవచ్చు. మీరు మీ శత్రువులకు తగిన సమాధానం ఇస్తారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
లక్కీ కలర్ : పసుపు
లక్కీ నంబర్ : 6
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 4 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా గొప్పగా ఉంటుంది. మరోవైపు మీ జీవిత భాగస్వామితో మీకు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. అందువల్ల మీరు మీ కోపాన్ని నియంత్రించాల్సి ఉంటుంది. ఈ రోజు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడం ద్వారా మీరు సమస్యలను పరిష్కరించుకోవాలి. వచ్చే వారాంతంలో మీరు మీ ప్రియమైన వారితో కొంత సమయం గడపవచ్చు. ఈ రోజు మీకు మీ జీవితంలో సానుకూల మార్పులు తెచ్చే కొన్ని అవకాశాలు లభిస్తాయి.
లక్కీ కలర్ : లైట్ బ్లూ
లక్కీ నంబర్ : 17
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 10:10 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. ఈరోజు మీరు ఆర్థికంగా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు కూడా సమయం అనుకూలంగా లేదు. ఈ రోజు మీ కుటుంబ సభ్యులు మీపై కోపంగా ఉంటారు. ఎందుకంటే మీరు కుటుంబ బాధ్యతలను విస్మరిస్తున్నారని వారు భావిస్తారు. మీరు మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతిని కొనసాగించాలనుకుంటే మీరు దీనిపై శ్రద్ధ పెట్టండి. అలాగే, మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపండి. మీరు వ్యాపారవేత్త అయితే ఈ రోజు మీకు మంచిది. మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 14
లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 8 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారు ఈరోజు చాలా సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉంటారు. అందువల్ల, మీరు ఏదైనా పెద్ద సమస్య నుండి బయటపడవచ్చు. చాలా కాలం తరువాత మీరు శాంతిని అనుభవిస్తారు. మీ జీవిత భాగస్వామితో సంబంధం మెరుగుపడుతుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు పని పెరగడంతో, వ్యాపారవేత్తలకు ఈరోజు కష్టంగా ఉంటుంది. అయితే మీరు ఆశించిన ప్రకారం లాభం పొందుతారు. ఈ రోజు మీరు అవసరమైన వారికి కూడా సహాయం చేయవచ్చు.
లక్కీ కలర్ : డార్క్ ఎల్లో
లక్కీ నంబర్ : 4
లక్కీ టైమ్ : సాయంత్రం 4:05 నుండి రాత్రి 9 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారిలో వ్యాపారవేత్తలు ఈ రోజు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా మీ ఖర్చులు పెరగడం వల్ల మీపై ఒత్తిడి పెరుగుతుంది. మీరు మీ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేయడం కొనసాగిస్తే, మీరు త్వరలోనే తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. అనవసరమైన ఖర్చులను మీరు తప్పకుండా తగ్గించాలి. ఈరోజు మీ శృంగార జీవితం గొప్పగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ భాగస్వామి యొక్క విభిన్న రూపాన్ని చూడవచ్చు. మీ పరస్పర అవగాహన అలాగే ఉంటే, మీకు మరియు మీ భాగస్వామికి మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది.
లక్కీ కలర్ : కుంకుమ
లక్కీ నంబర్ : 27
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:15 నుండి రాత్రి 7:20 గంటల వరకు

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22
ఈ రాశి వారిలో ఈరోజు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వీరు కృషి యొక్క ఫలవంతమైన ఫలితాన్ని పొందవచ్చు, ముఖ్యంగా వారి పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు అయితే గొప్ప విజయాన్ని సాధిస్తారని భావిస్తున్నారు. మీ వివాహ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. పని విషయంలో సాధారణంగా ఉంటుంది. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యంలో ఏదో లోపం ఉన్నట్టు అనిపిస్తుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 18
లక్కీ టైమ్ : ఉదయం 9:45 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణం సరిగ్గా ఉండదు. మీకు ఏదో ఒక విషయం గురించి కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండవచ్చు. మీకు ఎవరితోనైనా వాదన ఉన్నప్పటికీ, మీరు ప్రతీకారం తీర్చుకోకుండా ఉండాలి. ఈ రోజు మీ పనిలో కూడా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనివల్ల మీరు చాలా ఒత్తిడిని అనుభవిస్తారు. ఈరోజు వ్యాపారవేత్తలకు అనుకూలంగా ఉండదు. ఈ రోజు పెద్ద నిర్ణయం తీసుకోకపోవడమే మంచిది. ఆర్థిక పరిస్థితిలో కొంత మెరుగుదల సాధ్యమే కాని మీరు ఖర్చు చేయకూడదనుకున్నా కొన్ని పెద్ద ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం విషయంలో ఈరోజు మంచిది కాదు.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3:25 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు ఏదైనా వివాదంలో చిక్కుకునే అవకాశం ఉంది. అలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వివాహితులకు శుభప్రదమైన రోజు. ఎందుకంటే మీ ప్రేమ మరియు బంధం ఈరోజు పెరుగుతుంది. మీరు ఏ రంగంలో అయినా విజయం సాధించగల సామర్థ్యం కలిగి ఉంటారు. ఈరోజు అన్ని ముఖ్యమైన పనులను పూర్తిచేస్తారు. మీరు మీ కుటుంబంతో కొంత గొప్ప సమయాన్ని గడపగలుగుతారు. వ్యాపార సంబంధిత విషయాల వల్ల ప్రయాణం ఫలవంతమైనదని రుజువు అవుతుంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు బాగుంటాయి.
లక్కీ కలర్ : డార్క్ గ్రీన్
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యానికి సంబంధించిన చాలా సమస్యలను ఎదుర్కొంటారు. దీని వల్ల అలసట అనుభూతి చెందుతారు. ఆరోగ్యంగా ఉండటానికి మీరు ఈరోజు వ్యాయామం చేయడం ప్రారంభించాలి. సరైన ఆహారం తీసుకోవాలి. ఉద్యోగస్తులు ఈరోజు ప్రమోషన్ వంటి వార్తలు వింటారు. వ్యాపారవేత్తలకు ఈరోజు మంచిగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 17
లక్కీ టైమ్ : ఉదయం 5:15 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారు ఈరోజు పనిలో విజయం సాధించాలనుకుంటే ఎక్కువగా కష్టపడాలి. ఆర్థికంగా ఈరోజు మిశ్రమ ఫలితాలను ఎదుర్కొంటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కానీ ఖర్చులు కూడా పెరగొచ్చు. ఈరోజు మీ వివాహ జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించగలుగుతారు. జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మరియు మద్దతు మీ ధైర్యాన్ని పెంచుతాయి. వ్యాపారవేత్తలు ఈరోజు పని కోసం ఎక్కువ దూరం ప్రయాణించాలి.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5:15 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారు ఈరోజు మూడీగా ఉంటారు. ఇది మీ జీవిత భాగస్వామిని ఇబ్బంది పెడుతుంది. మీరు మీ భాగస్వామితో మంచి సంబంధాన్ని కోరుకుంటే వారు ఆశ్చర్యపోయే బహుమతిని వారికి ఇవ్వాలి. వ్యాపారస్తులకు ఈరోజు పెద్ద లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. అయితే మీరు మీ ఖర్చులను నియంత్రించాలి.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 25
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:45 నుండి రాత్రి 7 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఆ ఘట్టం విషయంలో మీరు నిరాశ చెందుతారు. మీరు కొత్త ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ రోజు మీరు కొన్ని శుభవార్తలు పొందవచ్చు. మీరు ఈ రోజు విజయం సాధించే అవకాశం ఉంది.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 16
లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు



Click it and Unblock the Notifications











