For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శనివారం మీ రాశిఫలాలు (18-07-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, అషాఢమాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope July 18, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీరు ఏ రంగంలో సెటిల్ అవుతారో తెలుసా?జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీరు ఏ రంగంలో సెటిల్ అవుతారో తెలుసా?

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు ఎవరికైనా సహాయం చేసే అవకాశం రావచ్చు. మీరు మీ సామర్థ్యం ప్రకారం సహాయం చేస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపారులు తమకు అవసరమైన పత్రాలను చెక్కుచెదరకుండా ఉంచాలి. లేదంటే, మీరు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగులకు ఈరోజు ఎలాంటి కష్టమైన పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. ఉన్నతాధికారులు మీ పని పట్ల చాలా సంతోషంగా ఉంటారు. ఈరోజు మీ కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 27

లక్కీ టైమ్ : ఉదయం 7:45 నుండి సాయంత్రం 5:20 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు పనిలో మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు సీనియర్ అధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది కాకుండా, మీరు సహోద్యోగులతో కూడా వేగవంతం చేస్తారు. వ్యాపారులు కొంతకాలంగా మీరు కొన్ని చట్టపరమైన విషయాలతో బాధపడుతుంటే, ఈ రోజు మీరు దాన్ని వదిలించుకోవడానికి బలమైన అవకాశం ఉంది. అయితే భవిష్యత్తులో మీరు మీ పనిని ప్రభావితం చేయకుండా ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు తల్లిదండ్రుల నుండి గొప్ప బహుమతిని పొందవచ్చు. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో కొంత అసమ్మతి ఉంటుంది. దీని కారణంగా మీరు పనిపై సరిగ్గా శ్రద్ధ చూపలేరు. ఇలాంటి సమయంలో మీరు మీ దృష్టిని మళ్లించాలి. ఉద్యోగులకు మరియు వ్యాపారులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఆర్థిక పరంగా ఈరోజు మంచి ఫలాలను పొందవచ్చు. మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. అయితే మీరు రుణాలు ఇవ్వడం మానుకోవాలి. ఆరోగ్య పరంగా ఈరోజు ఒత్తిడి ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : సాయంత్రం 4:45 నుండి రాత్రి 8 గంటల వరకు

Rangam bhavishyavani 2020 : కరోనాపై అమ్మవారు ఏమి చెప్పారంటే...!Rangam bhavishyavani 2020 : కరోనాపై అమ్మవారు ఏమి చెప్పారంటే...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు చట్టపరమైన విషయాలలో జాగ్ర్తగా ఉండాలి. లేకపోతే మీరు తీవ్రంగా నష్టపోవచ్చు. ఉద్యోగులు ఈరోజు సకాలంలో పనులు పూర్తి చేయాలి. మీకు ఏదైనా పనిని అప్పగిస్తే బాధ్యతగా పూర్తి చేయాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఆరోగ్య పరంగా ఈరోజు అప్రమత్తంగా ఉండాలి.మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు లేదా కంప్యూటర్లను ఎక్కువసేపు వాడకుండా ఉండాలి.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 8:45 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు ఏదైనా విషయంలో ఆందోళనగా ఉంటే, మీరు క్రమం తప్పకుండా యోగా చేయాలి. దీని వల్ల మీరు శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా బలంగా ఉంటారు. మీరు ఏదైనా బహుళజాతి కంపెనీలో పనిచేస్తుంటే, మీకు కొన్ని శుభవార్తలు వినొచ్చు. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీరు వైవాహిక జీవితంలో మంచి ఫలితాలను పొందవచ్చు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మెరుగుపడే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8:20 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. మీరు వీలైనంత త్వరగా మీ అప్పులను వదిలించుకోవాలనుకుంటే, అనవసరంగా ఖర్చు చేయకుండా ఉండండి. సాధ్యమైనంతవరకు ఆదా చేయడంపై దృష్టి పెట్టండి. ఈ రోజు ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీ ఇంటి సభ్యులందరూ చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి రాత్రి 7:55 గంటల వరకు

మీ రాశిని బట్టి మీ వివాహ జీవితం రొమాంటిక్ గా ఉండాలంటే...మీ రాశిని బట్టి మీ వివాహ జీవితం రొమాంటిక్ గా ఉండాలంటే...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగులతో ఏదైనా విషయంలో గొడవ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు ఇబ్బందుల్లో పడొచ్చు. కోపం, అహం వంటి ప్రతికూల భావోద్వేగాలకు దూరంగా ఉండండి. ఈ రోజు వ్యాపారులు పెద్ద ఆర్థిక లావాదేవీలు చేయకుండా ఉండాలి. ఆర్థిక పరమైన విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా మంచి అనుభూతి కలుగుతుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈ రోజు సానుకూలంగా ఉంటారు. అంతేకాదు, చాలా విషయాలలో ప్రతికూలతలను ధైర్యంతో ఎదుర్కొంటారు. మీ దృష్టి అంతా మీ పనిపైనే ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు పనులన్నింటినీ చాలా వేగంగా పూర్తి చేస్తారు. వ్యాపారులు ఎక్కువగా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఏదైనా సామాజిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం పొందవచ్చు. ఈ సమయంలో మీరు సామాజిక దూరాన్ని పూర్తిగా అనుసరించడం మంచిది. ఈ రోజు వ్యాపారులకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవాలనుకుంటే మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగులు నిరక్ష్యం వీడి, నిజాయితీగా పని చేయాలి. ఆర్థిక పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీరు వివాహం చేసుకుంటే, మీరు మీ జీవిత భాగస్వామిపై కూడా శ్రద్ధ వహించాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 8 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు అన్ని సానుకూల పరిస్థితులే ఉంటాయి. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. మీకు కొత్త శక్తి కూడా లభిస్తుంది. ఈ రోజు మీరు మీ పనులన్నింటినీ శ్రద్ధగా చేయగలుగుతారు. ఉద్యోగుల ప్రతిభ అందరికీ తెలుస్తుంది. వ్యాపారులు చాలా కష్టపడిన తర్వాత విజయం సాధించవచ్చు. మీ విశ్వాసం కూడా పెరుగుతుంది. ఆర్థిక పరంగా అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. దీని కారణంగా మీ పెండింగ్ పనులను పూర్తి చేయగలుగుతారు.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఎదురుకావచ్చు. మీకు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య ఉంటే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కొంచెం అజాగ్రత్త ఉన్నా కూడా ఇది మీ సమస్యలను పెంచుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : సాయంత్రం 6:15 నుండి రాత్రి 9 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో విజయం సాధించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ వంటి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. మరోవైపు వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య పరంగా ఈరోజు పూర్తి శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : సాయంత్రం 4:05 నుండి రాత్రి 9 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope July 18, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Friday, July 17, 2020, 21:16 [IST]
Desktop Bottom Promotion