Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
బుధవారం మీ రాశిఫలాలు (22-07-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, శ్రావణమాసం, బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారు ఈరోజు స్వార్థపరులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగులు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు పెట్టుకోవాలి. వ్యాపారులకు ఈరోజు ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు. దీని వల్ల మీ మనసు కలత చెందుతుంది. మరోవైపు ఈరోజు విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఆన్‌లైన్‌లో చదువుతుంటే ఈ రోజు మీరు కొంత గొప్ప విజయాన్ని పొందవచ్చు. మీ జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది. మీ ప్రియమైన వారి నుండి మీకు ప్రేమ మరియు మద్దతు లభిస్తుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉండదు.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా పెద్ద సమస్యను ఎదుర్కొంటారు. ఈ ఇబ్బంది నుండి ఎలా బయటపడాలో మీకు అర్థం కాదు. అయితే, ఈ సమస్య త్వరలోనే ముగుస్తుంది. కాబట్టి మీరు ఈ సమయంలో సహనంగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. పని విషయంలో ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. కాబట్టి, మీరు ఆందోళనలను పక్కనబెట్టి, మీ పనిపై ఎక్కువ శ్రద్ధ చూపాలి.
లక్కీ కలర్ : లైట్ రోజ్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:40 నుండి సాయంత్రం 6:10 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు మనసులో చాలా సందేహాలు వస్తాయి. మీరు చాలా విషయాల పట్ల సందిగ్ధతతో ఉంటారు. ఈ ప్రశ్నలకు మీరే సమాధానం కనుగొనాలి. ఈ సమయంలో మానసికంగా ఒత్తిడిని అధిగమించడానికి ధ్యానం చేయాలి. పని విషయంలో ఈరోజు మంచిగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. మరోవైపు మీ కుటుంబ జీవితంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 15
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 7:40 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారు ఈరోజు వ్యక్తిగత జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీకు పెద్ద గొడవ ఉండొచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. ఇలాంటి వాటిని నివారించడానికి గట్టిగా ప్రయత్నించాలి. పని విషయంలో ఈరోజు మీరు చాలా బిజీగా ఉంటారు. మీరు మీ బాధ్యతలను ఒక భారంగా భావించకూడదు. శ్రద్ధ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారిలో ఉద్యోగులకు కార్యాలయంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో, మీరు మీ పనిపై దృష్టిని కేంద్రీకరించాలి. లేకపోతే మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. మరోవైపు వ్యాపారులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. అయితే, ఆర్థిక పరంగా అస్థిరంగా ఉండే అవకాశం ఉన్నందున, మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, అందుకు సమయం అనుకూలంగా లేదు. ఆరోగ్యంగా ఉండేందుకు సమయం అనుకూలంగా లేదు.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 33
లక్కీ టైమ్ : ఉదయం 8:20 నుండి మధ్యాహ్నం 3:05 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. ఈరోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు ఈరోజు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటారు. మీరు మీ కుటుంబంతో, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. దీని వల్ల మీరు సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఈ రోజు మీరు సన్నిహితుడికి ఆర్థికంగా సహాయం చేయవచ్చు. ఈరోజు మీకు ఆర్థిక పరంగా ఎటువంటి సమస్యా ఉండదు.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు చాలా సాధారణంగా అనిపిస్తాయి. అయితే ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. పెరుగుతున్న ఖర్చులు మీ ఆందోళనకు కారణం కావచ్చు. ఈ సమయంలో మీరు డబ్బు ఆదా చేయడం కష్టం అవుతుంది. కానీ ప్రతికూల పరిస్థితులలో మీకు మీ కుటుంబానికి కొందరి ద్వారా పూర్తి మద్దతు లభిస్తుంది. పనికి సంబంధించి మీరు ఎక్కువగా ఒత్తిడి తీసుకోకండి. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 17
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 3:20 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు చాలా కష్టపడి పని చేయాలి. కొంచెం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. వ్యాపారులకు ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా, మీకు ఏదైనా సమస్య ఉంటే, ఈ రోజు అది పరిష్కరించబడుతుంది. మరోవైపు ఈ రోజు మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీ నిర్ణయాలతో ఇంటి సభ్యులు ఏకీభవించకపోవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 21
లక్కీ టైమ్ : సాయంత్రం 5:20 నుండి రాత్రి 10 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు ఓపికగా ఉండటం మంచిది. ఉద్యోగులకు ఈరోజు ఆర్థిక పరంగా చాలా సానుకూల ఫలితాలు ఉంటాయి. మీ వేతనం కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే వ్యాపారులకు మాత్రం ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉండదు. ఈ రోజు మీరు పెద్ద ఆర్థిక లావాదేవీలు చేయకపోతే మంచిది. ఆరోగ్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ వహించాలి.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారు ఈరోజు ఏదైనా ఒక పెద్ద సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మీరు దేవుడిపై విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవాలి. ఉద్యోగులకు ఈరోజు ఒత్తిడితో కూడిన పని ఉంటుంది. మీరు ఒక ముఖ్యమైన బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారులు ఈరోజు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మరోవైపు ప్రతికూల పరిస్థితులలో మీ జీవిత భాగస్వామి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ప్రియమైన వారిని ప్రేమించడం ద్వారా మీ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఈరోజు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితం ఉంటుంది.
లక్కీ కలర్ : డార్క్ బ్లూ
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు రుణం వంటివి తీసుకోవాల్సి వస్తే, మీరు అవసరం బట్టి తీసుకోవాలి. లేదంటే, ఆర్థిక పరంగా ఈరోజు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు విద్యార్థులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. ఈ రోజు కుటుంబంతో చాలా మంచి రోజు అవుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 6:50 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. మీరు ఈరోజు ఏ పని చేసినా.. కచ్చితంగా సరైన ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగులు ఆఫీసులో చేసే పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అస్సలు తొందరపడకూడదు. వ్యాపారులు కూడా ఈరోజు ప్రత్యర్థులు లేదా శత్రువులను ఓ కంట కనిపెట్టాలి. మీరు మీ కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోవాలి.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 21
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 7:20 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











