శనివారం మీ రాశిఫలాలు (25-07-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, శ్రావణమాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope July 25, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు సమయాన్ని అనవసరంగా వృథా చేయకండి. మీ శక్తిని అర్ధవంతమైన పనిలో ఉంచండి. మీ దృష్టికి అవసరమైన కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. మీ ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వకండి. కష్టపడి పని చేయండి. వ్యాపారులకు ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే, మీ కుటుంబంపై కూడా శ్రద్ధ వహించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : పీచ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : సాయంత్రం 6:20 నుండి రాత్రి 9:30 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో ఉద్యోగులు కార్యాలయంలో పనులపై ఎక్కువ దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. మీరు ఉన్నత స్థానాన్ని సాధించాలనుకుంటే, మీ నిజాయితీ మరియు పని పట్ల అంకితభావం చూపించడానికి ఇది సరైన సమయం. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. ఈ రోజు మీరు కొన్ని శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : ఉదయం 5:55 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు లాభాలు ఎక్కువగా వస్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో గాసిప్స్ లకు దూరంగా ఉండాలి. పని విషయంలో ఈరోజు మీ యజమాని కఠినంగా ఉండొచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో ఈరోజు కొన్ని ఇబ్బందులుంటాయి. మీ ప్రియమైన వారిని అర్థం చేసుకోవడానికి మీరు బాగా ప్రయత్నిస్తారు. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 10 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు మరియు వ్యాపారులు ఈరోజు ఆశించిన విధంగా ఫలితాలు పొందుతారు. మీరు టెలికమ్యూనికేషన్ లేదా మీడియాకు సంబంధించిన ఉద్యోగం చేస్తే, మీరు ఈ రోజు కొన్ని మంచి వార్తలను పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. చిన్న సమస్య ఉన్నప్పటికీ, మీరు మీ అవగాహనతో దాన్ని పరిష్కరించగలుగుతారు. అయితే ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 35

లక్కీ టైమ్ : ఉదయం 8:45 నుండి ఉదయం 9 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. లేదంటే మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా ఈరోజు మీరు కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. మీ పని విషయంలో కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులు ఈరోజు చాలా జాగ్రత్తగా పని చేయాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉండదు. మానసిక ఒత్తిడి వల్ల శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:15 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పనులను పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీకు సీనియర్ అధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మరోవైపు, వ్యాపారులు వ్యాపార సమస్యపై చాలా ఎక్కువగా ఆలోచించాలి. మీ కుటుంబ సభ్యులు ఈ రోజు మీతో అసంతృప్తిగా ఉంటారు. ఈ రోజు, మీ సోదరుడు లేదా సోదరితో మీకు కొన్ని విభేదాలు ఉన్నాయి. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉండదు.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9:25 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో విద్యార్థులు ఈరోజు విద్యపై పూర్తి శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు ఈరోజు పనిని వేగవంతంగా చేయాలి. మీరు మీ పనిని నెమ్మదిగా చేస్తే, మీ పనులు పెండింగులో పడిపోతాయి. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. మీ ఇంట్లో వాతావరణం చక్కగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి ప్రత్యేక ఆశ్చర్యం పొందవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచి అనుభూతి కలుగుతుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. ఈ రోజు మీరు సౌకర్యవంతమైన విషయాల కోసం చాలా ఎక్కువగా ఖర్చు చేయవచ్చు. ఈరోజు మీకు పని ఒత్తిడిగా ఎక్కువగా ఉండటంతో, మీరు మానసిక ఒత్తిడికి లోనవుతారు. వ్యాపారులకు ఈరోజు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో కొన్ని విభేదాలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉండాలంటే, మీరు బయటి ఆహారం తీసుకోకుండా ఉండాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 2:55 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఎలాంటి ఆందోళన లేకుండా ఉంటారు. మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు. ఈరోజు మీ కుటుంబంతో చక్కగా గడుపుతారు. ముఖ్యంగా మీ తండ్రితో మీ సంబంధంలో మెరుగుదల కనబరిచినందుకు మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీరు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే, ఈ రోజు మీరు శుభవార్త వినొచ్చు. వ్యాపారులు ఈరోజు మంచి విజయాన్ని సాధించే అవకాశం ఉంది. వివాహితులకు ఈరోజు రోమాంటిక్ గా ఉంటుంది. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేసినా.. మీ బాధ్యతలను నిజాయితీగా నెరవేర్చడానికి ప్రయత్నించాలి. ఈ సమయంలో మీరు మరింత చురుకుగా ఉంటారు, ఇది మీకు మంచిది. మరోవైపు, వ్యాపారవేత్తలు పెద్ద ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. మీకు పెద్ద క్లయింట్‌తో మంచి సంబంధం ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ తోబుట్టువుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు మీ ఖర్చులు తక్కువగా ఉంటాయి. మీ బడ్జెట్ సమతుల్యమవుతుంది.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో ఈరోజు వ్యాపారులకు చాలా ముఖ్యమైనది. ఈ రోజు మీరు గొప్ప వ్యాపార ఆఫర్‌ను పొందవచ్చు. అదే సమయంలో, ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా మీరు మీ ప్రవర్తనను సరిగ్గా ఉంచుకోవాలి. ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నప్పుడు, మీ మాటలను చాలా ఆలోచనాత్మకంగా వాడండి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం లభించదు. ఆరోగ్యం విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 27

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 8 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు మీ స్నేహితుల్లో ఎవరికైనా ఆర్థికంగా సహాయం చేయడం సాధ్యపడుతుంది. మీకు ఈరోజు పనిభారం ఎక్కువగా ఉంటుంది. అయితే, మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ పనులు సమయానికి పూర్తవుతాయి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంతో సంబంధం బాగుంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 13

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Saturday, July 25, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion