మంగళవారం మీ రాశిఫలాలు (02-06-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు పనిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఎక్కువగా ఆలోచించడం మానుకోండి. లేకపోతే, మీ ఆరోగ్యం ఈరోజు మరింత దిగజారిపోతుంది. ముఖ్యంగా మీరు ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ధైర్యం కోల్పోకుండా పని చేస్తే, త్వరలో పరిస్థితులు మెరుగవుతాయి. పని చేసే ప్రజలకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు వ్యాపారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. కుటుంబ జీవితంలో అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సరదాగా గడుపుతారు.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అదే సమయంలో కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు మీ కుటుంబ సమస్యలను అధిగమించడానికి ప్రయత్నించాలి. ఆర్థిక పరంగా ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు. మీరు కష్టపడి పని చేస్తే, మీకు ఆర్థిక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ వివాహ జీవితంలో ఈరోజు ఆహ్లాదకరమైన రోజు అవుతుంది.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ : సాయంత్రం 4:05 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు మీ ఖర్చులను తగ్గించుకోవాలి. అనవసరమైన పనులకు డబ్బును వాడితే, ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యాపారం చేసే వ్యక్తులు కొన్ని సంక్లిష్టమైన వ్యాపార విషయాల గురించి ఆందోళన చెందుతారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఒత్తిడితో కూడుకుని ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర విభేదాలు ఉంటాయి. ఈ కారణంగా ఇంటి వాతావరణం క్షీణిస్తుంది. ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 7:55 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయంలో విధుల గురించి ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదు. బద్ధకాన్ని వదలిపెట్టండి. పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఈరోజు మీరు బాగా కష్టపడాలి.మీ జీవిత భాగస్వామితో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మీ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ పనిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా ఈరోజు కొంత మెరుగ్గా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 4:45 నుండి రాత్రి 10:25 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. మరోవైపు ఆరోగ్య పరంగా ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎక్కువ విశ్రాంతిపై శ్రద్ధ వహిస్తే మంచిది. తద్వారా మీ ముఖ్యమైన పనిని పూర్తి శక్తితో మరియు తాజాదనంతో పూర్తి చేయవచ్చు. వ్యాపారులు ఈరోజు ఒక చిన్న ప్రయాణం చేయవచ్చు. దీని వల్ల మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ ఎల్లో

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 10 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఎంత త్వరగా కోపం తెచ్చుకుంటారో అంత త్వరగా శాంతంగా మారిపోతారు. ఉద్యోగులకు ఈరోజు కెరీర్ లో కొత్త మలుపు ఎదురవుతుంది. మీరు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం మంచిది. మరోవైపు, సీనియర్లు మీకు ఏదైనా సలహా ఇస్తే, మీరు వారి మాటలను విస్మరించకూడదు. ఆర్థిక పరంగా ఈరోజు కొన్ని సంస్కరణలు సహజమే. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. చెవికి సంబంధించి ఏదైనా సమస్య ఎదురుకావచ్చు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 3 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు చాలా పవిత్రమైన రోజు అవుతుంది. ఈ రోజు మీరు గొప్ప విజయాన్ని సాధించవచ్చు. మీ నాణ్యతను పూర్తిగా ఉపయోగించుకోండి. వ్యాపారులకు కూడా ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తి మీకు ఎంత నిజాయితీగా ఉన్నారో మీరు గ్రహిస్తారు. ఆర్థిక పరంగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 44

లక్కీ టైమ్ : ఉదయం 9:45 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు చాలా బాధ్యతతో పని చేయాలి. ఎందుకంటే ఈరోజు మీరు చాలా ఒత్తిడిని అనుభవిస్తారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజు మీకు ఆనందంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. అయితే మీరు ఓపికగా ఉంటే పరిస్థితులు అనుకూలంగా మారతాయి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:15 నుండి రాత్రి 10:10 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి వ్యాపారంలో ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు పెండింగులో ఉన్న పనులను పూర్తి చేసి చాలా ఉపశమనం పొందుతారు. అయితే మీరు ఒత్తిడిని తగ్గించుకోవడానికి సకాలంలో పనిని పూర్తి చేయాలి. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులను చాలా వరకు నియంత్రించుకోవాలి. కుటుంబంలో కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. తెలివితక్కువగా ఆలోచించి మానసిక శాంతికి భంగం కలిగించుకోవద్దు. ఆర్థిక పరంగా ఈరోజు మీకు చాలా కష్టంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పనితీరు చాలా బాగుంటుంది. ఉన్నతాధికారుల మద్దతు కూడా ఉంటుంది. వివాహ జీవితంలో ప్రేమ మరియు శాంతి ఉంటుంది. మీ సంబంధం యొక్క మాధుర్యం పెరుగుతుంది. మీ ఇద్దరి మధ్య పరస్పర అవగాహన కూడా పెరుగుతుంది. ఆరోగ్య విషయాలు బాగుంటాయి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఆర్థిక పరంగా మరింత ఆందోళన పెరగొచ్చు. ఈరోజు మీకు పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులు కూడా ఈరోజు ఎక్కువ ప్రయోజనాలు పొందలేరు. మీ కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. అయితే, ఈ రోజు మీకు కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభించదు. జీవిత భాగస్వామితో సంబంధం బాగా ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:30 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీరు నిరాశకు గురైనప్పటికీ, త్వరలో మీ సమస్య పరిష్కరించబడుతుంది. ఉద్యోగులు కొన్ని విషయాల్లో వ్యతిరేకతను ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఖర్చులు చేయకూడదు. మీ జీవిత భాగస్వామితో ప్రేమ కొనసాగుతుంది. అయితే పని ఒత్తిడి కారణంగా మీ జీవిత భాగస్వామికి తగినంత సమయం ఇవ్వలేకపోవచ్చు, కానీ ఇది మీ మధ్య ఎలాంటి సమస్యలను కలిగించదు. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : సాయంత్రం 4:05 నుండి రాత్రి 9 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Tuesday, June 2, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion