శనివారం మీ రాశిఫలాలు (06-06-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య సమస్యలు తొలగిపోవచ్చు. మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి కొంత గొప్ప విజయాన్ని పొందవచ్చు. ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. ఈ రోజు మీరు మీ ప్రియమైన వారితో కలిసి చాలా ఆనందంగా గడపొచ్చు. ఈరోజు పని విషయంలో మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు ఎలాంటి సమస్యలు ఉండవు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 9:05 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు అకస్మాత్తుగా పెద్ద ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు. మీరు ఏదైనా కొత్త వ్యాపారం చేయాలని, అందులో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, మీరు ఆ దిశగా వెళ్లొచ్చు. ఈరోజు మీరు చేసే పనిలో చాలా ముఖ్యమైన రోజు అవుతుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో చాలా సంతోషకరమైన రోజు అవుతుంది. ఈరోజు మీరు మానసికంగా చాలా మంచి అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు వివాహ జీవితంలో ఆనందం మరియు శాంతి కావాలంటే, మీరు మీ జీవిత భాగస్వామికి ప్రాముఖ్యత ఇవ్వాలి. మీ సంబంధంలో మీరు నిజాయితీగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీకు ఈరోజు ఎక్కువ ఖర్చులు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు పని తేలికగా ఉంటుంది. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9:15 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు వ్యక్తిగత జీవితంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగులు పనిలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే పరిస్థితి త్వరగా అందుబాటులోకి వస్తుంది. నిరుద్యోగులకు ఈరోజు కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. ఆర్థిక పరంగా ఈరోజు బాగుంటుంది. అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు ఆలోచనాత్మకంగా ఖర్చు చేయకపోతే, మీరు రాబోయే రోజుల్లో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. ఆర్థిక పరమైన విషయాలను చక్కగా నిర్వహించాలి.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 25

లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అవుతుంది. ఈరోజు ఎలాంటి ప్రయత్నాలు చేసినా, విజయం సాధించడానికి బలమైన అవకాశం ఉంది. మీ విశ్వాసం పెరుగుతుంది. మీరు అధ్యయనాలలో కూడా మంచి అనుభూతి చెందుతారు. మీ కుటుంబ జీవితంలో మీకు చాలా ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగులకు ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. మీరు ఈరోజు కొంత అదనపు పని చేయాల్సి ఉంటుంది. వ్యాపారులు ఈరోజు పని కోసం ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీరు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:45 నుండి 9:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీకు అదనపు ఆదాయం సులభంగా సంపాదించేందుకు అవకాశం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో శృంగార సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ సంబంధం మరింతగా పెరుగుతుంది. మీ ఇద్దరిలో ఒకరిపై ఒకరికి నమ్మకం కూడా పెరుగుతుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులుంటాయి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 11 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ పనిని నిజాయితీతో పూర్తి చేయడానికి ప్రయత్నించడం మంచిది. మీరు మీ సహోద్యోగులను అధికంగా విశ్వసిస్తే, వారు దానిని తప్పుగా ఉపయోగించుకోవచ్చు. వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, అలాంటి నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. లేదంటే మీరు ఆర్థికంగా భారీగా నష్టపోవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి చాలా బాగుంటుంది. అయితే మీకు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం రాకపోవచ్చు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి 9 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఆదాయాన్ని కోల్పేయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరంగా మీరు మీ నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవడం మంచిది. మీరు పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. లేకపోతే మీ సీనియర్లు మీపై కోపం తెచ్చుకోవచ్చు. దీని వల్ల మీ పురోగతి కూడా వాయిదా పడొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు బాగుంటాయి. మీకు భావోద్వేగ మద్దతు కూడా లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మంచి రోజు అవుతుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పనిలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఈ రోజు మీరు కొన్ని పెద్ద సవాళ్లను ఎదుర్కొంటారు. మీకు ఏవైనా అదనపు బాధ్యతలను అప్పగిస్తే, మీరు వాటిని విస్మరించకూడదు. వ్యాపారులు ప్రస్తుత పరిస్థితిని బట్టి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. మీ కుటుంబ జీవితంలో మీ తండ్రితో కొన్ని విభేదాలు ఎదురుకావచ్చు. మీరు శాంతి మరియు అవగాహనతో ముందుకు సాగాలి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. అనవసరంగా డబ్బును ఖర్చు చేయకుండా ఉండాలి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 7 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో మంచి ఫలితాలను పొందుతారు. అయితే మీరు తొందరపడకూడదు. తొందలరో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యాపారులకు కూడా ఈరోజు చిన్న లాభాలు రావచ్చు. అయితే మీరు మరింత లాభాలను కావాలనుకుంటే, మీరు మరింత కష్టపడాలి. మరోవైపు మీకు స్టాక్ మార్కెట్ లాటరీ లేదా బెట్టింగులు వేసే అలవాటు ఉంటే మీరు వాటికి దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీ వివాహ జీవితంలో మీరు ఊహించని ట్విస్ట్ ఎదురుకావచ్చు. మీ జీవిత భాగస్వామి నుండి మీకు కొన్ని శుభవార్తలు ఇవ్వగలరు. ఆరోగ్య పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2:05 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీరు దాని నుండి తక్కువ ప్రయోజనం పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. మీకు కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఈ రోజు వారితో కొంత సమయం గడపడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి యొక్క మానసిక స్థితి సరిగ్గా ఉండదు. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉధయం 7:45 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీకు అనవసరమైన విషయాలు ఇబ్బంది పెట్టొచ్చు. మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మరియు మద్దతు మీకు లభిస్తుంది. మీరు మీ ప్రియురాలితో చాలా ఆనందించబోతున్నారు. ఆర్థిక పరంగా ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం వంటి విషయాల్లో హడావుడిగా నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. ఆరోగ్య పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 8:20 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Saturday, June 6, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion