For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుధవారం దినఫలాలు : ఓ రాశి నిరుద్యోగులకు మంచి జాబ్ ఆఫర్ రావొచ్చు...!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, వైశాఖ మాసం బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope June 09, 2021

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Solar Eclipse 2021: తొలి సూర్యగ్రహణం.. ఈ రాశులపై తీవ్ర ప్రభావం...!Solar Eclipse 2021: తొలి సూర్యగ్రహణం.. ఈ రాశులపై తీవ్ర ప్రభావం...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో సీనియర్ల నుండి మద్దతు లభిస్తుంది. వారు మీకు కొన్ని విషయాల్లో దిశానిర్దేశం చేస్తారు. వ్యాపారులు ఈరోజు ఆశించిన ఫలితాలను పొందొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. మీరు కష్టపడి పని చేయాలి. వ్యాపారులకు ఈరోజు కొత్త మలుపు వస్తుంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ఇంటి సభ్యులతో మీ సంబంధం బలంగా ఉంటుంది. వివాహితులకు ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. వ్యాపారులకు సకాలంలో డబ్బు అందుతుంది. మీ వ్యక్తిగత జీవితంలో ఈరోజు అంతా మంచిగా ఉంటుంది. మీరు కుటుంబానికి సంబంధించి తెలివిగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఆర్థిక పరంగా ఈరోజు చాలా ఖరీదైనది. మీ ఖర్చులు విపరీతంగా పెరగొచ్చు. మీరు మీ బడ్జెట్ ప్రకారం ఖర్చు చేస్తే మంచిది. ఇతరుల ఆదేశాల మేరకు మీ ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, మీకు కిడ్నీకి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, ఈరోజు చాలా అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో విద్యార్థులకు కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. అడ్డంకులను అధిగమించేందుకు మీరు రోజూ ధ్యానం చేయాలి. వ్యాపారులు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే.. ముందే అన్ని పనుల గురించి తెలుసుకోవాలి. మీ నిర్ణయాలు తెలివిగా తీసుకుంటే, త్వరలో మీకు మంచి లాభం వస్తుంది. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం రాకపోవచ్చు. అయితే, పనితో పాటు, మీ కుటుంబం మీకు సమానంగా ముఖ్యమైనది, కాబట్టి మీరు మీ వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితాల మధ్య బ్యాలెన్స్ పాటించాలి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 3:40 గంటల వరకు

గ్రహణం తరువాత స్నానం చేయండి.. వీటిని తినకండి.. వీటన్నిటికీ శాస్త్రీయ కారణం ఇక్కడ ఉంది.గ్రహణం తరువాత స్నానం చేయండి.. వీటిని తినకండి.. వీటన్నిటికీ శాస్త్రీయ కారణం ఇక్కడ ఉంది.

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు ఏదైనా మార్పు గురించి ఆలోచిస్తుంటే, మీరు మీ శ్రేయోభిలాషులు మరియు కొందరు అనుభవం ఉన్న వారి సలహా తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు సరైనవి కావు. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6:15 గంటల వరకు

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీరు అలసట మరియు నిద్రలేమితో వంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మీ పనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఉద్యోగులు సీనియర్ అధికారుల సలహాలను ఫాలో అవ్వాలి. మరోవైపు వ్యాపారులు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీరు చాలా ఓపికగా ఉండాలి. త్వరలో మీరు లాభం పొందడానికి గొప్ప అవకాశాన్ని పొందవచ్చు. మీ వివాహ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే, ఈ రోజు మీరు దాన్ని పరిష్కరించడానికి అవకాశం పొందవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. మీ ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : సాయంత్రం 5:15 నుండి రాత్రి 9:20 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి పని విషయంలో మంచిగా ఉంటుంది. మీరు ఈరోజు పని రంగంలో పురోగతి కూడా పొందొచ్చు. నిరుద్యోగులకు ఈరోజు కూడా చాలా ముఖ్యమైన రోజు కానుంది. మీరు మంచి సంస్థ నుండి ఇంటర్వ్యూ పొందవచ్చు. వ్యాపారులకు ఈరోజు చాలా విషయాల్లో లాభాలొస్తాయి. మీరు ఆర్థిక ప్రయోజనాలుపొందొచ్చు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుతారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక శృంగార సాయంత్రం గడపడానికి పిక్నిక్ కోసం వెళ్ళవచ్చు. అయితే మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10:15 గంటల వరకు

శని తిరోగమనం వల్ల 12 రాశుల వారిపై ఎలాంటి ప్రభావమంటే..!శని తిరోగమనం వల్ల 12 రాశుల వారిపై ఎలాంటి ప్రభావమంటే..!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు మరింత కష్టపడాలి. అప్పుడే మీరు పురోగతి సాధిస్తారు. మీరు శ్రద్ధగా పనిచేయడం మంచిది. వ్యాపారులు ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు పెద్ద ఆర్థిక నష్టాన్ని చూడొచ్చు. మీ ఇంటి వాతావరణం మెరుగ్గా ఉంటుది. ఇంటి పెద్దలతో సంబంధంలో మంచి సామరస్యం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో తగినంత సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీరు అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండండి. ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో ప్రతికూలంగా ఉంటుంది. మీరు కొన్ని పెద్ద సవాళ్లను ఎదుర్కొంటారు. అయితే, మీరు ఈ సవాళ్లకు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంతో, వివేకంతో వ్యవహరిస్తారు. రవాణాతో సంబంధం ఉన్న ప్రజలు చట్టపరమైన విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ నష్టాలు రావొచ్చు. మీరు కోపాన్ని నియంత్రించాలి. లేదంటే మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు మీ కోపాన్ని నియంత్రించాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు పెరుగుతాయి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఆఫీసులో సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించండి. ఇది కాకుండా, సీనియర్ అధికారుల సలహాను విస్మరించవద్దు. అందరితో కలిసి పనిచేయండి. మీరు వ్యాపారవేత్త అయితే ఈరోజు మీకు కొంతమంది పెద్ద కస్టమర్లతో కనెక్ట్ అయ్యే అవకాశం లభిస్తుంది. ఇది కాకుండా, ఈరోజు మీరు మీ ప్రణాళికలలో కూడా కొన్ని మార్పులు చేయవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఈరోజు మీరు పొదుపుపై ​​ఎక్కువ దృష్టి పెట్టగలుగుతారు. మీ ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. మీ తోబుట్టువులతో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి కారణంగా కొంత టెన్షన్ సాధ్యమే. కానీ త్వరలో మీ సమస్య ముగుస్తుంది. ఆరోగ్య పరంగా ఏ సమస్య ఉన్నా, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో ఉద్యోగులకు కార్యాలయంలో కొంత గౌరవం లభిస్తుంది. మీరు ఉన్నత స్థానం పొందొచ్చు. ఇవన్నీ మీ కృషి ఫలితమే. మరోవైపు, ఈరోజు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకు మంచి రోజు అవుతుంది. మీ పని స్టాక్ మార్కెట్, బంగారం, వెండి మొదలైన వాటికి సంబంధించినది అయితే ఈరోజు మీరు మిశ్రమ ఫలితాలను పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో సమస్యలు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. మీ వివాహ జీవితంలో ప్రేమ మరియు ఉత్సాహం ఉండకపోవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి సాయంత్రం 3 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు చాలా ముఖ్యమైనది. కొత్త బాధ్యతలతో, పురోగతి యొక్క మార్గాలు మీ కోసం తెరుచుకుంటాయి, ప్రత్యేకించి మీరు బ్యాంకింగ్ రంగంతో సంబంధం కలిగి ఉంటే, మీరు మీ కృషి యొక్క మంచి ఫలితాలను పొందవచ్చు. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే, భాగస్వామితో విడిపోవటం సాధ్యమే. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. మీ ఆర్థిక ప్రయత్నం విజయవంతమయ్యే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల అభిమానం మరియు మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో తీపి పెరుగుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 9:05 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. డబ్బు విషయంలో చాలా అజాగ్రత్తగా ఉండకపోవడమే మంచిది. మరోవైపు మీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తనలో మీరు కొన్ని మార్పులు చూడొచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు మీ ప్రియమైనవారి మనస్సును తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఉద్యోగులకు కార్యాలయంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు సమయాన్ని ట్రాక్ చేయాలి. మీ అన్ని పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఇది కాకుండా, ఈరోజు ఏ పనిని అసంపూర్తిగా ఉంచొద్దు. దుస్తుల వ్యాపారులు ఈ రోజు మంచి లాభాలను ఆర్జించగలరు. మీరు పెద్ద ఆర్డర్ పొందే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : ఉదయం 10:30 నుండి సాయంత్రం 4:50 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope June 09, 2021

Reading your daily horoscope is the easiest way to get all the important information related to your life. Let's see what's in your fate. The position of planets and stars will have an impact on your life and therefore, there will be success and well as challenges. Know what lies in your fate today!
Story first published:Tuesday, June 8, 2021, 19:14 [IST]
Desktop Bottom Promotion