Just In
- 30 min ago చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- 41 min ago తీర్చుకోలేని రుణం అమ్మ ప్రేమ..! అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు..
- 1 hr ago ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- 3 hrs ago మీనరాశిలో కుజుడు-రాహువు కలయిక వల్ల అంగారక యోగం ఏర్పడుతుంది..జూన్ 1 వరకు ఈ రాశులకు కష్టాలు తప్పవు..జాగ్రత్త
సోమవారం దినఫలాలు : ఓ రాశి వారికి అకస్మాత్తుగా ఖర్చులు పెరగొచ్చు...!
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.
ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...
మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారు ఈరోజు తమ ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీరు సమతుల్యంగా ప్రవర్తించకపోతే, ఈరోజు మీరు ఇష్టపడకపోయినా మీ ప్రియమైన వారిని కోపగించవచ్చు. పని విషయంలో ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు ఈరోజు పనిని చాలా వేగంగా పూర్తి చేస్తారు. వ్యాపారులు ఈరోజు ఏదైనా నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే త్వరలో మీ నష్టాన్ని పూడ్చుకోవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:25 నుండి రాత్రి 10:10 గంటల వరకు
వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. ఈరోజు ఏదైనా అవకాశం వస్తే, మీరు దాన్ని పూర్తిగా వినియోగించుకునేందుకు ప్రయత్నించాలి. దీని వల్ల మీ కెరీర్ పుంజుకుంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీ ఆదాయం పెరుగుతుంది. అకస్మాత్తుగా ఈరోజు మీ ఖర్చులు కూడా పెరగొచ్చు. విద్యార్థులకు ఈరోజు విద్యారంగంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. మీ ఆరోగ్యం మంచిగానే ఉంటుంది. అయినప్పటికీ మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా ఉండాలి.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 21
లక్కీ టైమ్ : ఉదయం 4:50 నుండి మధ్యాహ్నం 2:15 గంటల వరకు
మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈరోజు పనిభారం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ఆర్థిక ప్రణాళికలను పునరాలోచించాలి. రాబోయే రోజుల్లో దీని పూర్తి ప్రయోజనం మీకు లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మరోవైపు మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. తోబుట్టువులతో సంబంధం మంచిగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 17
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు
ఈ రాశుల వారు ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు చేస్తూ.. ఇతరులను మోసం చేస్తారట...! వీరితో జర జాగ్రత్త..!
కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో నిరాశ ఎదురవుతుంది. ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. తొందరపాటు నిర్ణయం వల్ల ఆర్థికంగా మీరు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. మీ వివాహ జీవితంలో కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మీరు చాలా బాధ్యతగా ప్రవర్తించాలి. మీ ప్రియమైన వారికి తగిన సమయం ఇవ్వడం మంచిది. ఉద్యోగులకు ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురుకావొచ్చు. మీ పని చాలా వరకు పెండింగులో ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : ఉదయం 8:20 నుండి మధ్యాహ్నం 3:40 గంటల వరకు
సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. ఈరోజు లభించిన అవకాశాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోవాలి. వస్త్ర వ్యాపారులకు ఈరోజు ఆశించిన ఫలితాలు రావొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో అసమ్మతి పెరుగుతుంది. విద్యార్థులకు ఈరోజు విద్యా రంగంలో కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. ఆరోగ్య పరంగా ఈరోజు మీరు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండాలి.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 6
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు
కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీ మానసిక స్థితి చాలా బాగుంటుంది. మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరంగా ఈరోజు మీరు అదృష్టం పొందొచ్చు. మీ కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు సంతోషంగా గడుపుతారు. మరోవైపు, మీరు మీ జీవిత భాగస్వామి నుండి ఆనందం పొందుతారు. మరోవైపు శృంగార జీవితంలో కొంత ఉద్రిక్తత సాధ్యమవుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూలత ఉంటుంది. నేడు చాలా కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. మీకు ఉన్నతాధికారులు మరియు సహోద్యోగులతో మంచి సంబంధం ఉంటుంది. మీ ప్రతిభను చూపించే అవకాశం కూడా మీకు లభిస్తుంది. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 18
లక్కీ టైమ్ : సాయంత్రం 6:30 నుండి రాత్రి 10 గంటల వరకు
Solar Eclipse 2021: సూర్యగ్రహణం వల్ల ఈ 5 రాశుల వారికి ఇబ్బందులు...!
తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు చాలా మనశ్శాంతి కలుగుతుంది. ఈరోజు మీరు మీ ప్రియమైనవారితో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. మీరు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి పిక్నిక్ కోసం కూడా వెళ్ళవచ్చు. ఈరోజు మీ ప్రియమైన వారి ప్రేమపూర్వక ప్రవర్తన మీ మనోవేదనలన్నింటినీ తొలగిస్తుంది. పని విషయంలో ఈరోజు మంచిగా ఉంటుంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఈరోజు మంచి ఫలితాలను పొందవచ్చు. కొత్త ఆదాయ వనరును కనుగొనవచ్చు. ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 7 గంటల వరకు
వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఒత్తిడి లేకుండా మరియు మంచి మానసిక స్థితిలో ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి కారణంగా మీ జీవితంలో కొంత సానుకూల మార్పు వచ్చే అవకాశం ఉంది. మీ సంబంధంలో తీపి పెరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో మీ పనిని సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి నుండి మీకు ఉపశమనం లభిస్తుంది.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ : 6
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు
ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు కోపాన్ని నియంత్రించుకోవాలి. లేకపోతే మీరు పెద్ద సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగులు కార్యాలయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈరోజు ప్రశాంతంగా ఉండాలి. వ్యాపారులు ఈరోజు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు మంచిగానే ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు బలంగా ఉంటాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి రోజువారీ పనులలో మీకు సహాయపడుతుంది. పిల్లల వైపు నుండి ఆనందం వస్తుంది. మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 25
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 7:45 గంటల వరకు
మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో పనిభారం తక్కువగా ఉంటుంది. మీ కోసం మీకు తగినంత సమయం లభిస్తుంది. మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేయడానికి ఈరోజు మంచిది కాబట్టి దాన్ని ఎక్కువగా ఉపయోగించుకోండి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో సరదాగా గడుపుతారు. ఈ క్షణాలు మీకు గుర్తుండిపోతాయి. వ్యాపారవేత్తలకు ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. మీరు మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చాలా కష్టపడతారు. ఇలా నిరంతరం ప్రయత్నిస్తూ ఉండండి. త్వరలో మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : సాయంత్రం 7 నుండి రాత్రి 9 గంటల వరకు
కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఉద్యోగులు కార్యాలయంలో సీనియర్ అధికారుల మద్దతు పొందుతారు. మీరు వారి వైపు నుండి కొన్ని మంచి సలహాలను పొందవచ్చు. వ్యాపారులకు ఈరోజు ఆర్థిక పరంగా ఊహించిన లాభాలొస్తాయి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో చాలా మంచి రోజు అవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. అయితే, మీరు సమయానికి ఆహారం తీసుకోవాలి.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి సాయంత్రం 7 గంటల వరకు
మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారిలో వివాహితులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామితో సంబంధంలో లోతైన చీలిక ఉండవచ్చు. అనవసరమైన విషయాలలో పడటం ద్వారా మీ ఏకాగ్రతకు భంగం కలిగించవద్దు. ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా పని చేయాలి. సహోద్యోగుల సహాయంతో, మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఈరోజు మీరు త్వరగా డబ్బు సంపాదించే వ్యవహారంలో కొంత ఇబ్బందుల్లో పడొచ్చు. మీరు జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మీ ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఈ కారణంగా వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారుతుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో చాలా ముఖ్యమైన చర్చ చేయవచ్చు. ఈరోజు మీరు శక్తివంతం మరియు మంచి అనుభూతి చెందుతారు.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.