For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆదివారం మీ రాశిఫలాలు (01-03-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. వ్యాపారంలో ఉండేవారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీ ఆదాయం బాగానే ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ ప్రియమైన వారి మధ్య మంచి సమన్వయం ఉంటుంది. ఈ రోజు, కుటుంబ సభ్యులతో ఒక చిన్న యాత్ర చేసే అవకాశం ఉంటుంది.. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 42

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు కొన్ని పెద్ద ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. ప్రేమ విషయంలో ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : ఉదయం 8:20 నుండి రాత్రి 8:40 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. మీరు ఈరోజు డబ్బు సంపాదించే మంచి అవకాశాన్ని పొందవచ్చు. ప్రేమ విషయంలో ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీ వివాహ జీవితంలోనూ ఈరోజు సంతోషం ఉండదు. మీ తల్లిదండ్రులతో సంబంధం విషయంలో మద్దతు పొందుతారు. పనిలో ఏకాగ్రత లేకపోవడం వల్ల చాలా పనులు పెండింగులో పడొచ్చు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు

<strong>ఈ 5 రాశి చక్రాల వారికి జోడి ఎప్పటికీ కుదరదని మీకు తెలుసా...!</strong>ఈ 5 రాశి చక్రాల వారికి జోడి ఎప్పటికీ కుదరదని మీకు తెలుసా...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు బాగానే ఉంటుంది. మీరు ఈరోజు అన్ని పనులను పూర్తి చేయగలరు. వ్యాపారులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈరోజు అవకాశం లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.అయితే మీరు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. మీరు ప్రయాణం అకస్మాత్తుగా చేయాల్సి ఉంటుంది. ఇది చాలా వినోదాత్మకంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 5:15 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబంలో శాంతి ఉంటుంది. ఆర్థిక పరంగా మీరు సానుకూల ఫలితాలను పొందుతారు. మీరు ఈరోజు ఎక్కువ ఖర్చులను చేయొచ్చు. అయితే మీ ఆదాయం పెంచేందుకు కొత్త మార్గాన్ని కనుగొంటారు. పనిలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఈరోజు ఆనందం ఉంటుంది. యోగా మరియు ధ్యానం మీకు ప్రయోజనకరంగా ఉంటాయి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 7:30 గంటల వరకు

 కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగులకు ఈరోజు ఉన్నతాధికారుల నుండి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారులు ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకవాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఖర్చులు తగ్గడం వల్ల మీరు చాలా డబ్బును ఆదా చేయగలుగుతారు. కుటుంబ జీవితంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 8:25 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

<strong>గుడ్లగూబ నిజంగా లక్ష్మీదేవి వాహనమేనా? ఆ సమయంలో గుడ్లగూబ మీ ఇంటిపై వాలితే...</strong>గుడ్లగూబ నిజంగా లక్ష్మీదేవి వాహనమేనా? ఆ సమయంలో గుడ్లగూబ మీ ఇంటిపై వాలితే...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు సామాజిక జీవితంపై శ్రద్ధ చూపుతారు. వ్యాపారులులు ఈరోజు పెద్ద ప్రయోజనం పొందవచ్చు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో మంచి మానసిక స్థితిలో ఉంటారు. విద్యార్థుల పనితీరు ఎంతో ప్రశంసించబడుతుంది. మీ కుటుంబంలో పరిస్థితులు బాగానే ఉంటాయి. మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్: బ్రౌన్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:20 నుండి సాయంత్రం 4 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. మీరు కార్యాలయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఉన్నతాధికారుల నుండి మీకు ఈరోజు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4:20 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా తెలివిగా ఆలోచించాలి. ఎందుకంటే మీరు అనవసరమైన ఖర్చులను ఎక్కువగా చేయొచ్చు. పని విషయంలో ఈరోజు గొప్పగా ఉంటుంది. కుటుంబ జీవితం ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. మీ ఆరోగ్యంలో ఈరోజు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు మంచి ఫలితాలు పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. అయితే మీరు ఆలోచించకుండా ఆర్థిక నిర్ణయాలను తీసుకుంటే, మీరు పెద్ద నష్టాన్ని చూడాల్సి ఉంటుంది. వివాహ జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. ఈ రోజు మీ ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్య ఉండదు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు మానసిక స్థితి చాలా బాగా ఉంటుంది. కుటుంబంతో మంచిగా గడుపుతారు. ఈరోజు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు కూడా కార్యాయలంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు ఈరోజు విద్యా రంగంలో మరింత కష్టపడాలి. ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపాలనుకుంటారు. ప్రేమ విషయంలో ఈరోజు గొప్పగా ఉంటుంది. పని విషయంలో ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. మీ యజమాని ఈరోజు మీతో చాలా సంతోషంగా ఉంటారు. మీ పనిని జాగ్రత్తగా పూర్తి చేయాలి. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9:40 గంటల వరకు

English summary

Daily Horoscope March 1, 2020

Today, which zodiac signs will get success and whose fate will not support them. Read your daily horoscope to know what’s written on your stars.
Story first published:Saturday, February 29, 2020, 18:26 [IST]
Desktop Bottom Promotion