For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంగళవారం మీ రాశిఫలాలు (10-03-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శత్రువులు మీ పనికి ఆటంకం కలిగించవ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈరోజు ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. విద్యార్థులు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కళాశాలలో ప్రవేశానికి సంబంధించిన కొంత సమస్య ఏర్పడవచ్చు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో తెలివిగా వ్యవహరించాలి. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2:05 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా కొన్ని మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు మీరుపెట్టుబడికి సంబంధించిన ప్రయోజనాన్ని పొందొచ్చు. మీరు ఇటీవల ఒక వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే, మీరు ఊహించిన ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈరోజు ముఖ్యమైన పనుల్లో కొన్ని ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితం బాగానే ఉంటుంది. ఈ రోజు మీరు మీ సోదరులు మరియు సోదరీమణుల పూర్తి మద్దతు పొందుతారు. వారితో మీ సంబంధం మరింత బలపడుతుంది. ఈ రోజు మీరు మీ వివాహ జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ ప్రియమైనవారు మీకు అందమైన బహుమతి ఇవ్వడం ద్వారా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు మంచి శక్తివంతమైన అనుభూతిని పొందుతారు. ఆరోగ్య పరంగా కూడా మంచి ఫలితాలను పొందుతారు. కుటుంబ జీవితంలోనూ ఈరోజు గొప్పగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగా ఉంటుంది. మీ ప్రేమ కూడా పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 29

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు

ఈ వారం మీ రాశి ఫలాలు మార్చి 8 నుండి 14వ తేదీ వరకు...ఈ వారం మీ రాశి ఫలాలు మార్చి 8 నుండి 14వ తేదీ వరకు...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే ప్రశాంతంగాతీసుకోండి. మీరు భావోద్వేగంలో లేదా కోపంలో నిర్ణయం తీసుకోకండి. లేదంటే భవిష్యత్తులో మీరే దాని ఫలితాన్ని అనుభవిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు సానుకూల ఫలితం వచ్చే అవకాశం ఉంది. మీరు మీ చిన్న అప్పులను కూడా తిరిగి చెల్లించవచ్చు. మీరు మీ కుటుంబ జీవితాన్నిప్రశాంతంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది. మీరు మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండటం మంచింది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:25 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు అకస్మాత్తుగా ఖర్చులు పెరుగుతాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలహీనపరుస్తుంది. అయితే మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలను తీసుకోకండి. మీ వైవాహిక జీవితంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. మీకు ఈరోజు పని భారం ఎక్కువగా ఉంటే, మీరు ముందు రోజే ప్లాన్ చేసుకోవాలి. దీని నుండి మీకు చాలా ప్రయోజనం లభిస్తుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు మనసులో ఏవేవో ఆలోచనలు వస్తాయి. మీరు పాత విషయాలను మరచిపోయి, మీ వర్తమానంపై శ్రద్ధ పెట్టడం మంచిది. మీ వివాహ జీవితంలో సమస్యలు మీ పనిపై ప్రభావితం చేస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు అదనపు ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3:40 గంటల వరకు

ఈ రాశుల వారికి రొమాన్స్ పై ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుందట...! మీ రాశి కూడా ఉందేమో చూడండి...ఈ రాశుల వారికి రొమాన్స్ పై ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుందట...! మీ రాశి కూడా ఉందేమో చూడండి...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎలాంటి నిర్లక్ష్యాన్ని చేయకూడదు. సాధ్యమైనంత వరకు ఇంట్లో విశ్రాంతి తీసుకోండి. మరోవైపు మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఉండొచ్చు. మీ వ్యక్తిగత వ్యవహారాల్లో బయటి వ్యక్తులను జోక్యం చేసుకోనివ్వవద్దు. ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రేమ విషయంలో ఈరోజు మంచిగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9:20 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు వ్యక్తిగతంగా మంచిగా ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. త్వరలో మీకు పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి. ఉద్యోగులు ఈరోజు చాలా బిజీగా ఉంటాయి. ఏదైనా ముఖ్యమైన పనిలో చాలా కష్టపడతారు. మీ జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. ఈ రోజు మీ ప్రియమైనవారు మీ నుండి ప్రత్యేక బహుమతిని కూడా ఆశించవచ్చు. మీరు వారిని నిరాశపరచకపోవడమే మంచిది. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఈ రోజు మీరు మీ అన్ని పనులను రెండు రెట్లు వేగంగా పూర్తి చేస్తారు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక సమస్యల కారణంగా ప్రతికూల ఆలోచనలు గుర్తుకొస్తాయి. అయితే మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈరోజు చెడుగా ఉన్నప్పటికీ, రేపు మంచి జరుగుతుందని భావించాలి. అప్పుడే ధైర్యంగా పని చేయగలరు. మరోవైపు మీరు వివాహ జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు కోపంతో వ్యవహరిస్తే, దానితో మీ సంబంధం క్షీణిస్తుంది. మీరు పరిస్థితిని సకాలంలో నిర్వహిస్తే, అప్పుడు విషయాలు మీకు అనుకూలంగా మారతాయి. ఆరోగ్యంలో కొంత మెరుగుదల ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు వివాహిత జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో నిశ్శబ్ద రోజును ఆనందిస్తారు. మీ ప్రియమైన వారు ఏదైనా ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉంటే, ఈ రోజు వారు మంచి విజయాన్ని పొందే అవకాశం ఉంది. ఈ రోజు మీరిద్దరూ ఈ విజయాన్ని తీవ్రంగా జరుపుకుంటారు. ప్రతికూల పరిస్థితులు ఏవైనా ఉంటే ఈరోజు మీ సన్నిహితులు మీకు పూర్తి మద్దతు ఇస్తారు. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు పని మరియు కుటుంబ జీవితాన్ని సమతుల్యం చేసుకోవాలి. ఎందుకంటే పని ఒత్తిడి కారణంగా మీరు మీ కుటుంబ సభ్యులతో సమయం గడపలేరు. అటువంటి పరిస్థితిలో, కుటుంబ సభ్యులు మీ పట్ల చాలా అసంతృప్తితో ఉంటారు. మీరు మీ ప్రియమైనవారి కోసం కూడా సమయం తీసుకుంటే మంచిది. ఆర్థిక పరంగా ఈరోజు ఖర్చులు పెరుగుతాయి. కానీ కొత్త ఆదాయ వనరులను పొందే బలమైన అవకాశం ఉంది. నిరుద్యోగులు తప్పుడు దిశలో వెళ్లొచ్చు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 4:50 నుండి మధ్యాహ్నం 1:15 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. అకస్మాత్తుగా సంపద పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. ఈ రోజు మీ తల్లిదండ్రులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. ఈ రోజు వారు మీకు కొంత బాధ్యత ఇచ్చే అవకాశం ఉంది. మీరు ఉద్యోగం చేస్తే, ఈ రోజు ఆఫీసులో పని ఎక్కువ అవుతుంది, కానీ మీరు అన్ని పనులను సకాలంలో పూర్తి చేయగలరు. మీరు ఈ రోజు సీనియర్ల నుండి కొన్ని ముఖ్యమైన సలహాలను కూడా పొందవచ్చు. వైవాహిక జీవితంలో ప్రేమ మరియు ఆనందం ఉంటుంది. అయితే ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి 5 గంటల వరకు

English summary

Daily Horoscope March 10, 2020

Daily horoscope gets you all the information related to your financial situation, business, job, health etc. of the day. Let's find out what is in your fortune today.
Desktop Bottom Promotion