For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుధవారం మీ రాశిఫలాలు (11-03-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో అదృష్టం లభిస్తుంది. మీకు సానుకూల ఫలితాలు కూడా వస్తాయి. మీకు విశ్వాసం పెరగడంతో మీరు లక్ష్యం సాధించడంలో విజయవంతం అవుతారు. ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ రోజు మీరు మీ భాగస్వామితో లాంగ్ డ్రైవ్‌ను ఆనందిస్తారు. మరోవైపు, మీరు ఒంటరిగా ఉంటే మరియు మీకు ప్రేమ ప్రతిపాదన వస్తే, మీరు వాటిని విస్మరించకూడదు. కానీ వారికి అవకాశం ఇవ్వండి. ఈ రోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంది.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో కొందరు ఈరోజు పిల్లల నుండి ఆనందం పొందవచ్చు. పని విషయంలో ఈరోజు సానుకూల ఫలితాలను పొందుతారు. మీకు జీతం పెరుగుతుందని ఆశిస్తుంటే, మీకు శుభవార్త వినిపిస్తుంది. వ్యాపారస్తులు ఈరోజు తమ ప్రత్యర్థులపై అధిపత్యం చెలాయిస్తారు. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. అవసరమైతే మీ కుటుంబసభ్యుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. వివాహిత జీవితంలో కూడా ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బాగుంటుంది. ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు. ఆరోగ్యానికి సంబంధించిన సమస్య ఉండదు.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 27

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:15 నుండి రాత్రి 7:20 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఈరోజు నిరాశ ఎదరుకావచ్చు. ఆర్థిక పరిమితుల కారణంగా, ఈరోజు కొన్ని సమస్యలు కూడా ఎదురుకావచ్చు. అయితే మీరు చింతించకండి. మీ భవిష్యత్తును మెరుగ్గా ఉంచుకోవడానికి మీరు ప్రణాళికలను రూపొందించుకోవాలి. అలా ప్లాన్ చేసుకుంటే కచ్చితంగా విజయం సాధిస్తారు. పని విషయంలో సాధారణంగా ఉంటుంది. మీరు మీ ఉన్నతాధికారుల ప్రశంసలు మరియు మద్దతు పొందాలనుకుంటే, మీరు మరింత కష్టపడాలి. మీ శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:30 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు అనవసరమైన వాటి గురించి చర్చించకపోవడం మంచిది. మీకు దక్కని వాటి గురించి విస్మరించండి. మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయంలో ఈరోజు సంతోషంగా ఉంటుంది. మీ ఉన్నతాధికారులు మీ పని గురించి చాలా సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంటారు. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీకు ఈరోజు కొంచెం ఎక్కువ ఖర్చులు ఉంటాయి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ :16

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మీపై ఒత్తిడి పెరుగుతుంది. అయితే మీరు ప్రశాంతమైన మనసుతో చేయడానికి ప్రయత్నిస్తే, మీకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి. మీరు ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల నుండి కూడా సహాయం ఆశించవచ్చు. ఈరోజు వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు మిశ్రమంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్న సమస్య వచ్చినా, వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. ఈరోజు మీరు కొన్ని ప్రమాదకర నిర్ణయాలు తీసుకోవచ్చు. వ్యాపారులు ఈరోజు తమ వ్యాపారం మెరుగుపరచుకోవడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు సౌకర్యవంతమైన విషయాల కోసం చాలా ఎక్కువ ఖర్చు చేయవచ్చు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:45 నుండి సాయంత్రం 6 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో కొందరికి శృంగార జీవితంలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ఈరోజు మీ భాగస్వామితో ప్రేమగా మరియు శాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. మీ ముఖ్యమైన పనులపై మీరు ఎక్కువ శ్రద్ధ చూపాలి. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడి విషయాల్లో మీరు ఊహించిన దాని కంటే ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 23

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5:15 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. మీరు ఈరోజు ఎక్కువగా ఖర్చు చేస్తే, మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు ఉన్నతాధికారుల నుండి ప్రయోజనం పొందవచ్చు. మీరు ఈరోజు ఎంతటి కష్టమైన పనిని అయినా సులభంగా పూర్తి చేసే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈరోజు మంచి అవకాశాలు రావచ్చు. ఈ రోజు మీరు వైవాహిక జీవితంలో మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ రోజు, జీవిత భాగస్వామితో సంబంధం మెరుగుపడుతుంది.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 10:20 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఏదైనా కొనాలని ఆలోచిస్తుంటే, ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వ్యాపారంలో ఈరోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే, ఈరోజు ఓ ముఖ్యమైన వ్యక్తితో చర్చలు జరపవచ్చు. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీకు మీ కుటుంబం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది, ముఖ్యంగా ఈ రోజు మీ తండ్రి మీతో చాలా సంతోషంగా ఉంటారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఈ రోజు మానసికంగా మంచి అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : సాయంత్రం 4:35 నుండి రాత్రి 7:20 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు చాలా ప్రశాంతంగా ఉండాలి. పరిస్థితులు మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా, మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. పని విషయంలోనూ ఈరోజు జాగ్రత్తగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు మంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉందదిొ. మీ వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి గురించి పూర్తి మద్దతు పొందుతారు. మీరు కొన్ని ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టగలుగుతారు. ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4:20 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు మాటలపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్నేహితుల గురించి హాస్యాస్పదంగా ఎలాంటి మాటలను మాట్లాడకండి. ఆర్థిక పరంగా ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. దీని వల్ల మీకు చాలా ప్రయోజనం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సమన్వయం క్షీణిస్తుంది. మీరు పని విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీ సహోద్యోగులను ఎక్కువగా నమ్మకండి. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో వ్యాపారస్తులు ఈరోజు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. ఎందుకంటే మీ ప్రత్యర్థులు మీకు కఠినమైన పోటీ ఇవ్వచ్చు. అయితే మీరు కష్టపడి పని చేస్తే మీకు విజయం లభిస్తుంది. ఆర్థిక పరంగా ఖర్చులు పెరగడం వల్ల మీ ఒత్తిడి పెరుగుతుంది. మీకు ఈరోజు శృంగార జీవితం గొప్పగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 5:05 నుండి మధ్యాహ్నం 3:10 గంటల వరకు

English summary

Daily Horoscope March 11, 2020

Daily horoscope gets you all the information related to your financial situation, business, job, health etc. of the day. Let's find out what is in your fortune today.
Story first published:Wednesday, March 11, 2020, 0:08 [IST]
Desktop Bottom Promotion