Latest Updates
-
తెలంగాణలో నిప్పుల కొలిమి: పీరియడ్స్ సమయంలో ఎండల నుంచి తప్పించుకోవడం ఎలా? -
క్రేజీ రెసిపీ..ఎప్పుడైనా క్రిస్పీ గుమ్మడికాయ పూరీ రుచి చూశారా? అదిరిపోయే టేస్ట్ తో పాటు హెల్తీ కూడా.. -
మే 5: ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే! -
నేటి ధన యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు, జాక్ పాట్ పక్కా! -
అంగారక సంకష్ట చతుర్థి: ఈ రోజు ఉపవాసం ఉంటే కష్టాలన్నీ తీరిపోతాయా? చంద్రోదయ సమయాలు, పూజా విధానం ఇదే! -
2026 మే 5 గ్రహ సంచారం: మీ జాతకంలో కొత్త ఉత్తేజం.. ఆ మార్పులు మీ కోసమే! -
మేషం, వృశ్చికం, ధనుస్సు రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? – మంగళవారం, 05 మే 2026 -
మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉందని చెప్పే 5 ముఖ్యమైన సంకేతాలివే! -
డీప్‌ఫేక్ సెక్స్టార్షన్ ఉచ్చులో పడ్డారా? మీ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే! -
కిడ్నీ రాళ్లను ఇట్టే కరిగించే ఉలవలతో టేస్టీ వడలు..తయారీ విధానం ఇదే!
సోమవారం మీ రాశిఫలాలు (02-03-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం బాగా ఉంటుంది. అయితే మీరు ఈరోజు ఓ విషయంలో ఆందోళన చెందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. రుణాలు ఇవ్వడం వంటి వాటిని మానుకోవాలి.మీరు ఈరోజు వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. ఈరోజు మీరు మీ భాగస్వామితో బాగా ఆనందంగా గడుపుతారు.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి సాయంత్రం 7 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. అయితే ఇదంతా మీ ప్రేమ స్వభావంతోనే సాధ్యమవుతుంది. వ్యాపారులు ఈరోజు చాలా బద్ధకంగా ఉంటారు. ఆర్థిక లావాదేవీల పట్ల ఈరోజు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు కార్యాలయంలో ఈరోజు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ : 6
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు పనిలో చాలా బాగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు చాలా చురుకుగా ఉంటారు. మీకు ఈరోజు మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈరోజు మీ భాగస్వామితో కలిసి ఏదైనా యాత్రకు వెళ్లొచ్చు. అలాగే మీరు వారిని ఆకట్టుకుంటారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు చదువుపై ఆసక్తి తగ్గిపోతుంది. ఈరోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 25
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 7:45 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈ రోజు మీరు కుటుంబంతో ఎక్కువ సమయం గడపగలుగుతారు. ఈ రోజు మీరు తోబుట్టువులు మరియు ఇంటి ఇతర సభ్యులతో సరదాగా గడుపుతారు. ఈ రోజు మీరు మానసికంగా చాలా మంచి అనుభూతి చెందుతారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఆర్థికంగా కచ్చితమైన ఫలితాలను పొందుతారు. మీ వివాహ జీవితంలో ఆనందం ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈరోజు చాలా ముఖ్యమైనది. ఈరోజు మీరు పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తారు. మీ జీవిత భాగస్వామికి పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు ప్రతి నిర్ణయాన్ని ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు బలంగా ఉంటుంది. ఈరోజు మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే సమయం అనుకూలంగానే ఉంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు రిలేషన్ షిప్ విషయంలో గందరగోళంలో పడతారు. మీ మనసులో ఈరోజు ప్రతికూల భావన ఉంటుంది. మీరు ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు. ఆర్థిక పరంగా ఈరోజు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ రోజు మీరు ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంది. ఈ రోజు ఉపాధి ప్రజలకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మీరు అకస్మాత్తుగా కార్యాలయంలో ఒకేసారి ఎక్కువ పనులను ఎదుర్కోవలసి ఉంటుంది.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:25 నుండి రాత్రి 10:10 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారు ఈరోజు ఒక క్రమ పద్ధతిలో పని చేయాలి. ఇలా చేస్తే మీపై ఒత్తిడి అనేది ఉండదు. ఈరోజు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ, ఎక్కువగా ఖర్చులు చేయకూడదు. వివాహ జీవితంలో అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ : 21
లక్కీ టైమ్ : ఉదయం 5:50 నుండి మధ్యాహ్నం 2:15 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు ప్రేమ విషయంలో తొందరపడకూడదు. ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడుతున్నారని, మీతో ప్రేమ జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటే, మీరు ఓపిక పట్టాలి. మీరు త్వరగా ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. అది మీ పనిపై చెడు ప్రభావం చూపుతుంది. ఈరోజు ఆర్థిక పరంగా అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. ఈ రోజు, మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపలేరు.
లక్కీ కలర్ : లైట్ ఎల్లో
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి రాత్రి 7 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు ఈరోజు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. వ్యాపారులు ఈరోజు లాభం పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు, మీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన చాలా సానుకూలంగా మరియు ప్రేమగా ఉంటుంది. అయితే ప్రేమ వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో సమయం అనుకూలంగా ఉంటుంది. మనస్సు సంతోషంగా ఉంటుంది. మీరు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 18
లక్కీ టైమ్ : సాయంత్రం 6:30 నుండి రాత్రి 10 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారు ఈరోజు సానుకూలంగా ఆలోచిస్తారు. దీని ప్రభావం వల్ల మీకు సానుకూల ఫలితాలే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే వివాహ జీవితంలో కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయితే కొత్త ఆదాయ వనరులను పొందే అవకాశం ఉంది. పని విషయంలో కొంత కష్టంగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 6
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారు ఈరోజు వివాహ జీవితంలో లేదా ప్రేమ జీవితంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటారు. అయితే దానిని సకాంలో పరిష్కరించేందుకు మీ వంతు ప్రయత్నం చేస్తారు. ఈ రాశి వారు ఈరోజు విజయం సాధించకపోవచ్చు. అయితే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పక గెలుపు లభిస్తుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : ఉదయం 8:20 నుండి మధ్యాహ్నం 3:40 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మీరు శుభవార్తలను వినే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగ ఆఫర్ ను కూడా పొందవచ్చు. మీరు మీ నిర్ణయాన్ని ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. మీరు మీ వివాహ జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. ఆరోగ్య పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 17
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు



Click it and Unblock the Notifications