శుక్రవారం మీ రాశిఫలాలు (27-03-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఛైత్ర మాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు ఊహించని ఫలితాలను చూడబోతున్నారు. మీ కుటుంబ జీవితంలో ప్రశాంతత ఉంటుంది. మీకు మీ తోబుట్టువుల పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. దీని వల్ల ఈ రోజు మీకు చాలా మంచి అనుభూతి కలుగుతుంది. ఈ రోజు మీ ధైర్యం మరియు శక్తి పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీకు అదనపు డబ్బు సంపాదించేందుకు అవకాశం కూడా లభిస్తుంది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు చాలా ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరంగా లాభాల కోసం మీరు ఆర్థిక సలహాదారుల నుండి సలహా తీసుకుంటారు. అయితే మీరు పొదుపుపై చాలా శ్రద్ధ వహించాలి. పని విషయంలో ఈరోజు మీరు కొత్త విషయాన్ని పొందొచ్చు. ఈరోజు మీ వైవాహిక జీవితం కూడా సంతోషంగా గడుస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీ ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : రాత్రి 7:55 నుండి 9:40 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు కొంత చిరాకుగా అనిపించవచ్చు. మీరు అనవసరంగా కొందరితో గొడవ పడొచ్చు. అందువల్ల మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ జీవిత భాగస్వామి నుండి మీరు ఊహించిన మద్దతును పొందలేరు. ఆర్థిక పరంగా కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరం కంటే, ఎక్కువ ఖర్చు చేయకపోతేనే మంచిది. లేదంటే పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. పని విషయంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 4:15 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. మీ ప్రియమైన వారు మీపై ప్రేమ మరియు ఆప్యాయతను చూపుతారు. ఈరోజు ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. మీరు ఈరోజు మీ నాలుకను నియంత్రణలో ఉంచుకోవాలి. మీరు ఈరోజు ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో ఈరోజు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:20 నుండి సాయంత్రం 5 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు కొత్త శక్తిని పొందుతారు. దీని వల్ల మీ విశ్వాసం పెరుగుతుంది. మీరు ఆశించిన ఫలితాలు పొందే అవకాశం ఉంది. పని విషయంలో ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఈరోజు మీరు చాలా చురుకుగా పని చేస్తారు. ఈ రోజు మీరు కుటుంబంతో చాలా సమయం గడుపుతారు. ప్రేమ విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా బాగా ఉంటుంది. మీరు మానసిక శాంతిని కూడా అనుభవిస్తారు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 10 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు అకస్మాత్తుగా ప్రయాణించడం వల్ల ఇబ్బందులు పెరుగుతాయి. అయితే మీ గ్రహాల దిశ మరియు స్థానం రెండూ శుభ స్థితిలో ఉండటం వల్ల ఎట్టకేలకు మీ ప్రయాణం విజయవంతమవుతుంది. మీకు సరైన ఫలితాలు వస్తాయి. వ్యాపారులకు కొన్ని సమస్యల నుండి ఈరోజు ఉపశమనం కలుగుతుంది. ఉద్యోగులు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. ఈరోజు కుటుంబ జీవితంలో కూడా ఆనందంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి. మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా లేకుంటే, ఇది మీ పనిపై ప్రభావం ఎక్కువ ప్రభావం చూపుతుంది. మీరు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. వ్యక్తిగత జీవితంలో ఈరోజు కొంత ఇబ్బంది ఉండొచ్చు. వ్యాపారులు ఈరోజు ఆశించిన విధంగా ఫలితాలను పొందలేరు. మీ జీవిత భాగస్వామితో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆర్థిక పరంగా ఈరోజు ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మరోవైపు వ్యాపారవేత్తలు కొన్ని ప్రయోజనాలను ఆశించవచ్చు. మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీరు అనవసరంగా వాదించడం మానుకోవాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు విలువైన వస్తువులపై అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. అయితే తొందరలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. మీరు ప్రశాంతమైన మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఊహించిన విధంగానే మీకు ఆదాయం లభిస్తుంది. జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీ ఇద్దరికీ ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సంబంధాన్ని మెరుగుపరచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగులకు ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా మరియు శక్తివంతంగా ఉంటారు. మీ కుటుంబంలో ప్రేమ మరియు శాంతి ఉంటుంది. మీకు మానసిక శాంతి లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 37

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:15 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మీ ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది. ఉద్యోగులకు ఈరోజు చాలా ముఖ్యమైనది. ఈరోజు మీరు విశ్వాసంతో పని చేస్తారు. వ్యాపారులకు ఈరోజు గందరగోళంగా ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో అద్భుతమైన రోజు అవుతుంది. ఒకరి బాధ్యతలను నెరవేర్చడంలో మీరిద్దరూ మీ పూర్తి మద్దతు ఇస్తారు. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 25

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు పని ఒత్తిడి ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు శాంతియుతంగా పని చేయాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఎలాంటి నిర్లక్ష్యం చేయకండి. మీరు భారీ నష్టాలను చవి చూడాల్సి ఉంటుంది. అందుకే ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ వివాహ జీవితంలో ప్రేమ మరియు శాంతి ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీరు ఈరోజు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి పెద్దవారిని సంప్రదించండి.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 41

లక్కీ టైమ్ : ఉదయం 4:50 నుండి మధ్యాహ్నం 1:15 గంటల వరకు

Story first published: Friday, March 27, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion