సోమవారం మీ రాశిఫలాలు (09-03-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరిక

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు వ్యాపారంలో లేదా ఉద్యోగంలో కొంత ప్రయోజనం పొందవచ్చు. మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు మీ ఆర్థిక ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ కుటుంబంతో కూడా మీరు ఈరోజు మంచి సమయాన్ని గడుపుతారు. ప్రేమలో ఉన్న జంటలకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2:15 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. ఆదాయ పరంగా మీకు ఎవరితో అయినా విభేదాలు కూడా రావచ్చు. మీరు కోపంతో ఏ పని చేయకూడదు. మీ మనసులో ఏవైనా ప్రతికూల ఆలోచనలు ఉంటే, వాటిని తొలగించి మీ శ్రద్ధను పనిపై చూపించాలి. ఈరోజు మీరు కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవచ్చు. ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది.

లక్కీ కలర్ : బూడిద

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు పని ఎక్కువగా ఉంటుంది. ఇది మిమ్మల్ని కొంచెం బాధపెడుతుంది. ఈరోజు అనేక బాధ్యతలను నెరవేర్చడానికి మీపై ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త బట్టలను మరియు జ్యువెలరీ కోసం షాపింగ్ చేయవచ్చు. ఇది మీ మనసును చాలా ప్రశాంతంగా ఉంచుతుంది. జీవిత భాగస్వామి యొక్క అభిప్రాయం ఒక ముఖ్యమైన విషయంలో మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు చేస్తుంది. ఆరోగ్యం గురించి ఎక్కువగా చింతించకండి ఈ రోజు మీరు మీకు ఇష్టమైన వంటకాలను పూర్తిస్థాయిలో ఆనందిస్తారు.

లక్కీ కలర్ : లైట్ రోజ్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 6:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు వివాహ జీవితంలో అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు ఓ అందమైన బహుమతిని ఇస్తారు. ఉద్యోగులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం సాధారణంగా ఉంటుంది. తల్లిదండ్రుల సహాయంతో, మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండండి.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:15 నుండి రాత్రి 7:20 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు పెండింగులో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. లేకపోతే మీపై ఒత్తిడి పెరగవచ్చు. మరోవైపు ఈ రోజు మీరు మీ పిల్లలతో ఆనంద సమయాన్ని గడుపుతారు. ఇది మీకు గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. వివాహితులలో ఒకరినొకరు అర్థం చేసుకోవడం మంచిది. ఈ రోజు, తల్లిదండ్రులు మీ కఠినమైన వైఖరిని కూడా విమర్శించవచ్చు. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండండి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 7 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులను ప్రారంభించడానికి ఈరోజు అనుకూలమైన సమయమే. మీరు మీ పనిని ఆత్మవిశ్వాసంతో చేస్తే, కచ్చితంగా మీకు విజయం లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆదాయం కూడా బాగానే ఉంటుంది. మీరు అనేక లాభాలను కూడా పొందవచ్చు. ఉద్యోగస్తులు ఈరోజు పని విషయంలో సంతృప్తి చెందుతారు. వ్యాపారులు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. వివాహితులు ఈరోజు సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు సమయం కొంచెం కష్టంగా ఉండవచ్చు, కొన్ని కారణాల వల్ల మీరు చదువుపై దృష్టి పెట్టలేరు. మరోవైపు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి రాత్రి 8:20 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. మీ పనులన్నీ విజయవంతమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు ఎలాంటి కష్టమైన పనిని అయినా పూర్తి చేయగలరు. అయితే వ్యక్తిగత జీవితంలో కొంత సమస్యగా ఉండొచ్చు. వ్యాపారులు ఏదైనా పెద్ద మార్పును చూడొచ్చు. కొత్త వ్యాపారాన్ని ఒంటరిగా ప్రారంభించకూడదని నిర్ణయించుకుంటారు. మీరు అవివాహితులైతే, ఈ రోజు మీ కోసం మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 8 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు అకస్మాత్తుగా ఒక పెద్ద సమస్య సంభవించవచ్చు. మీకు బిపి ఎక్కువగా ఉంటే, ఈరోజు విశ్రాంతిపై శ్రద్ధ చూపాలి. మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీ పని విషయంలో మంచి ఫలితాలను పొందవచ్చు. వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలిసిన వారే మిమ్మల్ని మోసం చేయవచ్చు. ఈరోజు మీకు మరింత కష్టంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి 3:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఈరోజు పనిలో విరామం తీసుకుని, ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈరోజు ఉద్యోగులకు బదిలీ వంటి వార్తలు వినిపించవచ్చు. విద్యార్థులు విద్యలో ఈరోజు పెద్ద విజయాన్ని సాధించవచ్చు. ఈరోజు వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ప్రశాంతత ఉంటుంది. ఈ రోజు, మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మరియు సహవాసం ద్వారా మీ ఒత్తిడి బాగా తగ్గుతుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:45 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని చాలా కలవరపెడుతుంది. ఆర్థిక పరంగా కూడా ఈరోజు ఎక్కువ ఖర్చయ్యే అవకాశం ఉంది. వ్యాపారులు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఈరోజు మీరు చేసే ఏ పని అయినా మధ్యలోనే ఆగిపోవచ్చు. అయితే నిరుత్సాహపడకుండా ఆత్మవిశ్వాసంతో చేసే పనులన్నీ మీకు మంచి ఫలితాల్ని ఇస్తాయి. మీరు ప్రతికూల భావోద్వేగాలతో చుట్టుముట్టబడతారు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:20 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు ప్రశాంతంగా మరియు అవగాహన వల్ల చాలా సమస్యలను పరిష్కరిస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగులతో మీ సంబంధాన్ని మెరుగుపర్చేందుకు ప్రయత్నించండి. మీరు సీనియర్ అధికారులతో చర్చకు దూరంగా ఉండాలి. ఈరోజు మీరు చాలా శక్తివంతంగా ఉంటారు. మీరు ఒకేసారి అనేక పనులను చేయగలుగుతారు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 32

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 8 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు ప్రశాంతంగా ఉండాలి. ముఖ్యంగా నాలుకను అదుపులో పెట్టుకోవాలి. లేదంటే మీ ప్రతిష్ట దెబ్బ తింటుంది. మీరు ఈరోజు కొత్త వ్యక్తులను కలవవచ్చు. ఆ పరిచయాల నుండి కొంత ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు అనేక బిల్లులను చెల్లించగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి.ప్రేమ విషయంలో అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు మీ జీవిత బాగస్వామితో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : ఉదయం 11:45 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

Story first published: Monday, March 9, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion