For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గురువారం దినఫలాలు : ఈరోజు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి...

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, వైశాఖ మాసం గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope May 13, 2021

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Sun Transit in Taurus on 14 May 2021:సూర్యుడు వృషభంలోకి సంచారం.. 12 రాశులపై ఎలాంటి ప్రభావమంటే...!Sun Transit in Taurus on 14 May 2021:సూర్యుడు వృషభంలోకి సంచారం.. 12 రాశులపై ఎలాంటి ప్రభావమంటే...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. టార్గెట్ ఆధారిత శ్రామిక ప్రజలు కొన్ని పెద్ద సవాళ్లను ఎదుర్కొంటారు. ఈరోజు, మీ కొన్ని ముఖ్యమైన పనిలో పెద్ద అడ్డంకులు ఉండొచ్చు. వ్యాపారులు ఈరోజు కొన్ని ముఖ్యమైన పత్రాలను కోల్పోవచ్చు. దీంతో మీకు ఆర్థిక పరంగా నష్టం కలగొచ్చు. మరోవైపు సాధారణ ప్రజలకు ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. అయితే మీరు పొదుపుపై ​​ఎక్కువ శ్రద్ధ వహిస్తే, మీకు మంచిగా ఉంటుంది. మీ కుటుంబంతో సంబంధాలను బలంగా ఉంచాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 23

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 10 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు తక్కువ ప్రయత్నంతో ఎక్కువ ఫలితాన్ని పొందొచ్చు. వ్యాపారులకు ఈరోజు ఊహించిన విధంగా లాభాలొస్తాయి. మీ ఆర్థిక సమస్య కూడా పరిష్కారమవుతుంది. ఉద్యోగులు ఈరోజు చాలా కష్టపడాల్సి వస్తుంది. మీరు మీ పెండింగ్ పనులను నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీరు ఈ విషయాన్ని శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించాలి. మీ ఆర్థిక పరిస్థితి ఈరోజు సంతృప్తికరంగా ఉంటుంది. ఈరోజు మీ ఖర్చులు తక్కువగా ఉంటాయి. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ఎవరికైనా పేదవారికి సహాయం చేసేందుకు అవకాశం వస్తే, మీరు వెనక్కి తగ్గకూడదు. మీరు కొంతకాలంగా మానసిక గందరగోళాన్ని ఎదుర్కొంటుంటే, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి, మీరు మీ మానసిక స్థితిని కూడా బలంగా ఉంచుకోవాలి. మరోవైపు ఈరోజు ఆర్థిక పరంగా మంచి ఫలితాలను పొందొచ్చు. నిరుద్యోగులు ఈరోజు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల పని పట్ల అసంతృప్తిగా కనిపిస్తారు. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5 గంటల వరకు

Venus Transit in Taurus on 04 May 2021:వృషభంలోకి శుక్రుడి రవాణా.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!Venus Transit in Taurus on 04 May 2021:వృషభంలోకి శుక్రుడి రవాణా.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. మీకు పనిభారం పెరుగుతుంది. దీంతో మీ ఆరోగ్యం బలహీనపడుతుంది. వ్యాపారులు ఈరోజు తమ ప్రణాళికల్లో కొన్ని మార్పులు చేయాలి. మీరు ఇటీవల కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే, ప్రచారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. మీ అనవసరమైన ఖర్చులు మీ బడ్జెట్‌ను పాడు చేస్తాయి. మీ ఇంటి వాతావరణం క్షీణించొచ్చు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 36

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2:55 గంటల వరకు

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో మానసికంగా మంచి అనుభూతి చెందుతారు. ఉద్యోగులకు ఈరోజు కొంత పనిభారం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీరు ఎంత కష్టం ఎదురైనా ధైర్యంగా విజయం సాధిస్తారు. వ్యాపారులు ఈరోజు ఎవరితో అయినా ఏదైనా ఒప్పందాలు చేసుకునేటట్టయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారులు ఈరోజు ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణం కంటే మెరుగ్గా ఉంటాయి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగానే ఉంటుంది. ఈరోజు, అకస్మాత్తుగా మీరు పాత స్నేహితుడిని కలవడానికి అవకాశం పొందవచ్చు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : సాయంత్రం 4:35 నుండి రాత్రి 9:20 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారిలో ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అవుతుంది. ఉద్యోగులు ఈరోజు కావాల్సిన బదిలీని పొందొచ్చు. ఈ కాలంలో ప్రైవేట్ ఉద్యోగులు చాలా తెలివిగా వ్యవహరించాలి. వ్యాపారులు ఈరోజు మంచి ఆర్థిక ప్రయోజనం పొందొచ్చు. మీరు మీ వ్యాపారాన్ని మరింతగా పెంచుకోవాలి. మీ మార్గంలో కొన్ని అడ్డంకులు ఉండొచ్చు. త్వరలో మీరు అనేక అడ్డంకులను అధిగమిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీరు ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేయొచ్చు. మీ ఆరోగ్యం మరింత క్షీణించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 10:20 గంటల వరకు

Mercury Transit in Taurus on 1st May : వృషభంలోకి బుధుడి సంచారం... ఈ రాశులకు ప్రత్యేకం...!Mercury Transit in Taurus on 1st May : వృషభంలోకి బుధుడి సంచారం... ఈ రాశులకు ప్రత్యేకం...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కానీ, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. గుండె సంబంధిత రోగులు, అధిక రక్తపోటు ఉండే వారు ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు మీ ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నిస్తుంటే కష్టపడాలి. మీరు నిరుద్యోగులై ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈరోజు మీకు ఉపశమనం కలగొచ్చు. మీకు ఉపాధి లభించే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే, చిన్న విషయాలపై జీవిత భాగస్వామితో గొడవ మీ సంబంధాన్ని బలహీనపరుస్తుంది. మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం మంచిది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు చాలా గొప్ప రోజు అవుతుంది. మీ వినయపూర్వకమైన స్వభావం మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. మీరు వివాహం చేసుకుంటే మీ వివాహ జీవితంలో ఆనందం పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో మీ ప్రియురాలి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మరోవైపు ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో ఏ పనిని పెండింగులో పెట్టొద్దు. లేకపోతే మీరు బాస్ నుండి కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 9:40 నుండి మధ్యాహ్నం 12:25 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానుకోండి. లేకపోతే మీరే ఇబ్బందులను ఎదుర్కొంటారు. మరోవైపు ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో పెండింగ్ పనులు పూర్తి కావడం వల్ల పెద్ద ఉపశమనం కలుగుతుంది. వ్యాపారులు ఈరోజు ఊహించిన విధంగా ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. మీ ఇంట్లో ఏదైనా విషయంలో తగాదాలు జరగొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు ఏదైనా మానసిక ఆందోళన నుండి బయటడొచ్చు. చాలా కాలం తరువాత మీరు మంచి మానసిక స్థితిలో ఉంటారు. పని విషయంలో ఈరోజు నిర్లక్ష్యంగా ఉండకండి. వ్యాపారులు ఈరోజు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పెట్టుబడికి సంబంధించిన విషయాలలో, మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు, ఉద్యోగులు కార్యాలయంలోని అధికారులతో తమ సంబంధాన్ని మెరుగుపర్చడానికి ప్రయత్నించాలి. మీ పనిలో పొరపాటు ఉంటే, దానిని బహిరంగంగా ఒప్పుకోవాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు మంచి ఫలితాలను పొందొచ్చు. ఔషధ వ్యాపారులకు ఈరోజు వ్యాపారం పెరిగే అవకాశం ఉంది. పని విషయంలో ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో సిబ్బంది కొరత వల్ల అదనపు పని చేయాల్సి వస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు చాలా ఖరీదైనది. మీ ఆదాయం బాగుంటుంది. కానీ ఆలోచించకుండా ఖర్చు చేసే మీ అలవాటు మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. మీ ఇంటి వాతావరణం సరిగ్గా ఉండదు. మీ అజాగ్రత్త వైఖరి మీ ప్రియమైన వారిని అసంతృప్తికి గురి చేస్తుంది. మీ ప్రియమైన వారి మనోభావాలను దెబ్బతీసే పని ఏదైనా చేయవద్దు. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:55 నుండి సాయంత్రం 7 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు భగవంతుని ఆరాధనతో ప్రారంభిస్తే, మంచి ఫలితాలు వస్తాయి. పెండింగ్ పనులను ఈరోజు మీరు పూర్తి చేయొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఈరోజు ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుతారు. మీ ప్రియురాలి గురించి మీరు చాలా గర్వంగా భావిస్తారు. మీరు విద్యార్థి అయితే, మీ చదువుల గురించి అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మొబైల్, టివి నుండి దూరంగా ఉండాలి. ఉద్యోగులకు ఈరోజు కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. వ్యాపారులు ఈరోజు మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఈరోజు మీరు మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:20 నుండి సాయంత్రం 4 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope May 13, 2021

Reading your daily horoscope is the easiest way to get all the important information related to your life. Let's see what's in your fate. The position of planets and stars will have an impact on your life and therefore, there will be success and well as challenges. Know what lies in your fate today!
Story first published:Thursday, May 13, 2021, 0:07 [IST]
Desktop Bottom Promotion