Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
శుక్రవారం మీ రాశిఫలాలు (15-05-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, వైశాఖ మాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారు ఈరోజు సంతోషంగా ఉంటారు. మీ మనసులో చాలా కాలంగా ఉన్న కోరిక నెరవేరుతుంది. మీ పని విషయంలో సానుకూలంగా ఉంటుంది. అయితే ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి తప్పులు చేయకుండా ఉండండి. మీ యజమాని ఏవైనా సలహాలు ఇస్తే, వాటిని కచ్చితంగా పాటించాలి. వ్యాపారులు మంచి లాభాలను పొందవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 15
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈ రోజు ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. కుటుంబంతో గడపడం ద్వారా మీరు చాలా ఆనందం పొందుతారు. ముఖ్యంగా మీరు మీ పిల్లలతో చాలా ఆనందిస్తారు. ఉద్యోగులకు ఆఫీసు పని తేలికగా ఉంటుంది. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు ప్రయోజనాలు లభిస్తాయి. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 23
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి రాత్రి 8 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. మీరు పెట్టుబడి యొక్క ఫలితాలను పొందవచ్చు. ఆర్థిక పరంగా బలపడతారు. అయితే, మీరు ఈ సమయాన్ని ఆలోచనాత్మకంగా గడపాలి. మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగులకు ఈరోజు చాలా ముఖ్యమైనది. మీ యజమాని మీ కృషిని చూసి చాలా సంతోషంగా ఉంటారు. మీరు వారి నుండి కొన్ని శుభవార్తలను కూడా వినొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు మీ నిర్ణయానికి మద్దతు ఇస్తారు. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 7:20 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచి ఫలితాలు దక్కవచ్చు. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి. అయినా కూడా మీరు సహోద్యోగులతో సక్రమంగా వ్యవహరించాలి. లేకపోతే మీరు ఇబ్బందులకు గురవుతారు. వ్యాపారులు కూడా ఈరోజు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ సమయం చాలా ముఖ్యమైనది. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : సాయంత్రం 4:35 నుండి రాత్రి 10 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈరోజు సన్నిహితుల ద్వారా మంచి అనుభూతి లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు ఇబ్బంది పడుతుంటే, ఈరోజు అది తొలగిపోవచ్చు. మీరు మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచాలి. మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి అందరూ అందరితో కలిసి ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 31
లక్కీ టైమ్ : ఉదయం 4:05 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు పని భారం ఎక్కువగా ఉంటుంది. మీరు ఒత్తిడికి గురవుతారు. ఇలాంటి సమయంలో ఓపికగా ఉండాలి. మీరు ప్రశాంతమైన మనసుతో మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది. వ్యాపారులు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో మీ తండ్రి మరియు సోదరునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి.
వారు మీ మంచినే కోరుకుంటున్నారని అర్థం చేసుకోవాలి.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ : 26
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి రాత్రి 8 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారు ఈరోజు చాలా కష్టపడి పని చేయాలి. అయితే నిరంతరం పని చేయడం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు తీవ్రంగా కృషి చేస్తారు. సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల సహాయంతో, మీరు కష్టమైన పనిని సులభంగా చేస్తారు. వ్యాపారులు ఈ రోజు మంచి లాభం కోసం కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు చేయవచ్చు. మీరు మీ వ్యాపారాన్ని మరింత విస్తరించే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మీరు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నప్పటికీ, మీ వైవాహిక జీవితంపై కూడా శ్రద్ధ చూపడానికి ప్రయత్నించండి.
లక్కీ కలర్ : గ్రే
లక్కీ నంబర్ : 4
లక్కీ టైమ్ : ఉదయం 8:55 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారు ఈ రోజు మీ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు. మీ ప్రియమైన వారి అవసరాలను మీరు పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఈ రోజు మీరు పిల్లలకు ఎక్కువ సమయం ఇస్తారు. మీరు వారి అధ్యయనాల విషయంలో సహాయం చేస్తారు. వారికి సరైన మార్గనిర్దేశం చేస్తారు. మీ పని విషయంలో మీరే నిర్ణయాలు తీసుకోవాలి. ఇతరుల సలహాలను పట్టించుకోకూడదు. ఆర్థిక పరంగా మెరుగయ్యేందుకు మీరు మరి కొంత సమయం వేచి ఉండాలి. ఆరోగ్య పరంగా ఈరోజు బాగా ఉంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 10:20 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు చాలా కష్టపడి పని చేయాలి. వ్యాపారులకు ఈరోజు నిరాశ ఎదురవుతుంది. మీరు ఊహించని విధంగా ఫలితాలు రాకపోవడంతో మీరు ఆందోళనకు గురవుతారు. మరోవైపు ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. మీ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి. మీరు మీ అప్పుల గురించి కూడా ఆందోళన చెందుతారు. మీ మానసిక ఒత్తిడి పెరగడం వల్ల శారీరక ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశం ఉంటుంది.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 16
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారు ఈరోజు ఓ పెద్ద పని పూర్తి చేస్తారు. అయితే మీ సహోద్యోగులు మీకు కఠినమైన పోటీని ఇవ్వవచ్చు. మీరు ఉన్నతాధికారుల ముందు మీ ఇమేజ్ ని కొనసాగించాలనుకుంటే, మీరు నిర్లక్ష్యాన్ని నివారించాలి. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు అధ్యయనాలపై ఎక్కువ శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. మీరు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటే, మీ గురువులతో పాటు మీ పెద్దల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు ఆరోగ్య పరంగా మంచి ఫలితాలను పొందుతారు. ఈ రోజు కొంత దీర్ఘకాలిక నొప్పి నుండి కొంత ఉపశమనం ఉంటుంది.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 24
లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి మధ్యాహ్నం 3:05 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా పవిత్రంగా ఉంటుంది. మీరు కొత్త ఆదాయ వనరులను పొందవచ్చు. మీకు పిల్లల వైపు నుండి కొంత ఇబ్బందిగా ఉంటుంది. మీరు శారీరకంగా మరియు మానసికంగా బాగా అనుభూతి చెందరు. మీ అలసట మరియు ఒత్తిడి పెరుగుతుంది. మీరు మీ మనశ్శాంతిని కాపాడుకోవాలనుకుంటే, అధికంగా ఆలోచించకుండా ఉండండి.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. అయితే మీ వైవాహిక జీవితంలో ఒక చిన్న సమస్య ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామికి మీ నుండి కొన్ని ఫిర్యాదులు ఉంటాయి. మీ కుటుంబ సభ్యుల మద్దతు లేకపోవడం వల్ల మీరు చాలా బాధపడతారు. మీ మనస్సులో అనేక రకాల చింతలు ఉంటాయి. అది మీకు చిరాకు కలిగిస్తుంది. మీ పని విషయంలో సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9:20 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











