Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
శనివారం మీ రాశిఫలాలు (30-05-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...
కరోనా వైరస్ సంచలన విషయం: పురుషులు రింగ్ ఫింగర్ పొడవుగా ఉంటే కరోనా నుండి మరణించే ప్రమాదం తక్కువ..

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారు ఊహించిన విధంగా పరిస్థితులు ఉండవు. మీరు అనుకున్న విధంగా పనులు కాకపోవడంతో మీరు నిరాశ చెందవచ్చు. అయితే మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మీ ప్రయత్నాన్ని మీరు కష్టపడి చేస్తే మీకు కచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు ఏదైనా సమస్యను ఎదుర్కొంటుంటే మీరు ఉన్నతాధికారులతో మాట్లాడాలి. మరోవైపు ఈరోజు మీకు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. పెండింగులో ఉన్న కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి 3 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారు ఈరోజు చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది.మీరు మంచి అవకాశాన్ని పొందడంతో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా కూడా మంచిగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అవివాహితులకు ఈరోజు ఓ వివాహ ప్రతిపాదన రావచ్చు. త్వరలో మీరు వివాహం చేసుకోవచ్చు. ఆరోగ్య పరంగా మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. శారీరకంగా మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 24
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి 10 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈరోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుండి కొన్ని ముఖ్యమైన సలహాలను పొందవచ్చు. వారి సలహాలను పాటించడం మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. అయితే వ్యాపారులు ఈరోజు నిరాశ చెందే అవకాశం ఉంది. విదేశీ కంపెనీల ఉత్పత్తులను కొనుగోలు చేసి, విక్రయిస్తే, ఈరోజు మీరు నిరాశ చెందే అవకాశం ఉంది. కుటుంబ జీవితం అనుకూలంగా ఉండదు. మీరు మీ జీవిత భాగస్వామిని గౌరవించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీరు తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 19
లక్కీ టైమ్ : ఉదయం 9:45 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలి. మీరు అనారోగ్యంతో ఉంటే, మీరు మందులను సకాలంలో తీసుకోవాలి. మీరు విశ్రాంతిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీరు తల్లిదండ్రుల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. అప్పుడే మీరు గౌరవాన్ని పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మీకు ప్రత్యేకంగా ఏమీ ఉండదు. అకస్మాత్తుగా ఎక్కువ ఖర్చులు పెరుగుతాయి.
లక్కీ కలర్ : డార్క్ ఎల్లో
లక్కీ నంబర్ : 30
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారు ఈరోజు సకాలంలో అనేక పనులు పూర్తి చేయాలి. లేదంటే మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు మంచి ప్రణాళిక ప్రకారం పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించడం మంచిది. ఇది మీ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. లేకపోతే మీరు చేసిన పనులన్నీ ఆగిపోయే ప్రమాదం ఉంది. వ్యాపారులకు ఈరోజు ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. మీరు భారీ నష్టాన్ని చవి చూడొచ్చు. ఈ సమయంలో మీరు తెలివిగా డబ్బు ఖర్చు పెట్టాలి. వ్యక్తిగత జీవితంలో బిజీగా ఉండటం వల్ల మీరు కుటుంబానికి తగినంత సమయం ఇవ్వలేరు. ఈ విషయం మీ జీవిత భాగస్వామికి కోపం తెప్పిస్తుంది. అయితే వారాంతాల్లో మీ కుటుంబానికి మంచి ఏదైనా ప్లాన్ చేస్తే మంచిది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 4
లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు కావాల్సిన చోటకు ట్రాన్స్ ఫర్ అయ్యే అవకాశాన్ని పొందొచ్చు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగులకు ఈరోజు పర్మినెంట్ వంటి శుభవార్తలు వినిపించవచ్చు. దీని వలన మీ మనసు సంతోషంగా ఉంటుంది. దీని వల్ల మీరు సానుకూలంగా ఉంటారు. మీరు పాల ఉత్పత్తులు, వస్త్రాలు, సౌందర్యం లేదా ఇనుము వ్యాపారం చేస్తే, మీరు ఈ రోజు మంచి లాభాలను ఆశించవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. పెట్టుబడి పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ రోజు మీరు తల్లిదండ్రులతో సమయం గడపడం ద్వారా చాలా మంచి అనుభూతి చెందుతారు. ఆరోగ్యం విషయంలో మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 23
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 10 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారు ఇటీవల కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే, ఈ రోజు మీరు కొత్త సవాలును ఎదుర్కోవచ్చు. కొన్ని చట్టపరమైన అడ్డంకులు మీ పనికి ఇబ్బంది కలిగిస్తాయి. మీరు ఓపికపట్టడం మంచిది. మరోవైపు, ఈ రోజు పనిచేసే వ్యక్తులు వారి ప్రవర్తనలో సాధారణంగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. చిన్న చిన్న ఖర్చులున్నప్పటికీ ఎలాంటి సమస్యలు ఉండవు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 19
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 11 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు పనిలో అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు మీరు అన్ని ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టాలి. లేకపోతే మీరు ఈ రోజు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది మీ నష్టానికి కూడా కారణం కావచ్చు. పనికి సంబంధించి మీరు ఈ రోజు ప్రయాణించవలసి వస్తే, మీరు పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అయితే, గ్రహాల కదలిక మీ ప్రయాణం శుభప్రదంగా ఉంటుందని సూచిస్తుంది. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. కుటుంబంతో సమన్వయం బాగా ఉంటుంది. ఆరోగ్య పరంగా సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 36
లక్కీ టైమ్ : ఉదయం 9:55 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారు ఉద్యోగాన్ని వదిలేసి, సొంత వ్యాపారం చేయాలనుకుంటే, మీరు మంచి ప్రణాళికను రూపొందించుకోవాలి. ఆర్థిక పరంగా కొన్ని సంస్కరణలు సాధ్యమే. మీరు బ్యాంకు నుండి రుణం తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే, ఈ రోజు మీరు కొన్ని మంచి వార్తలను పొందవచ్చు. మరోవైపు, కుటుంబ జీవితంలో ఒత్తిడి ఉంటుంది. మీ తల్లిదండ్రులు ఈ రోజు మీతో సంతోషంగా ఉండరు. మీ నిర్ణయాలతో వారు ఏకీభవించకపోతే, మీరు వాటిని ప్రశాంతంగా వివరించడానికి ప్రయత్నించాలి. వారు ఖచ్చితంగా మీ వైపు అర్థం చేసుకుంటారు. ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది.
లక్కీ కలర్ : డార్క్ గ్రీన్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 8 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారికి ఈరోజు ఒక విషయంలో గొప్ప ఉపశమనం లభిస్తుంది. పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. పరిస్థితులు అనుకూలంగా మారతాయి. మీకు ఉన్నతాధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారులు ఈరోజు ఊహించినదానికంటే ఎక్కువ లాభాలను పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీ వైవాహిక జీవితంలో కొనసాగుతున్న సమస్య ఈరోజుతో ముగుస్తుంది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 16
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు పని భారం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. ఈ రోజు మీరు సహోద్యోగితో అనవసరమైన చర్చలో పాల్గొని, మీరు మీ విలువైన సమయాన్ని వృథా చేయకపోవడమే మంచిది. వ్యాపారులు తమ నిర్ణయాలన్నింటినీ ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. మరోవైపు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. మీ వైవాహిక జీవితంలో చాలా గందరగోళాలు జరుగుతుంటే, మీరు ఒకరినొకరు మళ్ళీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. ఈ రోజు ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులను నివారించడానికి ప్రయత్నించండి.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు చాలా పవిత్రంగా ఉంటుంది. మీరు కొంత పెద్ద లాభం పొందవచ్చు. ఉద్యోగులు ఈరోజు కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీ జీతాల పెంపు నెరవేరే అవకాశం ఉంది. మీకు కొత్త ప్రాజెక్టులో పని చేయడానికి అవకాశం కూడా లభిస్తుంది. అయితే ముందుగా పెండింగ్ పనులను పూర్తి చేయడం మంచిది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు తినడం మరియు తాగడంలో అప్రమత్తంగా ఉండాలి.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











