For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శనివారం మీ రాశిఫలాలు (09-05-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, వైశాఖ మాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మే నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...మే నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు అనేక సవాళ్లు ఎదురవుతాయి. అయితే మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. త్వరలో పరిస్థితులు మారిపోతాయి. మీ ప్రియమైన వారి నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో మీరు చాలా తెలివిగా వ్యవహరించాలి. ఉద్యోగులు లేదా వ్యాపారులు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వివాహితులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఎక్కువ ఖర్చులు ఉంటాయి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ మనసులో ఏవైనా ప్రతికూల ఆలోచనలను తొలగించండి. మీకు ఏదైనా గందరగోళంగా అనిపిస్తే, వాటి జోలికి వెళ్లకపోవడం మంచిది. ప్రేమికులకు ఈరోజు చాలా ముఖ్యమైనది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఖర్చులు పెరిగినా, మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. వివాహ జీవితంలో కలహాలు ఉంటాయి. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి మధ్యాహ్నం 3:05 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు పనిలో మంచి ఫలితాల కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ పనిని వేగంగా చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. రిటైల్ వ్యాపారులకు ఈరోజు కొన్ని లాభాలు ఉండొచ్చు. కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. ఈ రోజు మీరు వివాదాస్పద సమస్యలను లేవనెత్తకుండా ఉండాలి. జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు నష్టాలు రాకుండా, మీరు తెలివిగా ఖర్చు చేయాలి. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:05 నుండి సాయంత్రం 4 గంటల వరకు

ఈ రాశిచక్రాల వారు డబ్బు ఆదా చేయడంలో ఎందుకు ఫెయిల్ అవుతారో తెలుసా...ఈ రాశిచక్రాల వారు డబ్బు ఆదా చేయడంలో ఎందుకు ఫెయిల్ అవుతారో తెలుసా...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈ రోజు శృంగార పరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ప్రియుడు/ప్రియురాలిని కలవచ్చు. మీ ఇద్దరి మధ్య పరస్పర అవగాహన, సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు పవిత్రంగా ఉంటుంది. ఈ రోజు కొత్త ఆదాయ వనరులను పొందే అవకాశం కూడా ఉంది. ఈరోజు ఓ ముఖ్యమైన పని మీద ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు మీ లక్ష్యం నుండి తప్పుకునే అవకాశం ఉంది. మీరు తెలివితక్కువ నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఉద్యోగులకు ఈరోజు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీ పనిపై నిఘా ఉంటుంది. మీ పనిని ప్రశాంతమైన మనసుతో పూర్తి చేయాలి. వ్యాపారులకు ఈరోజు ఎలాంటి చర్చలకైనా దూరంగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు అప్పులు చేసే పరిస్థితి ఉండొచ్చు. మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పని ఒత్తిడి పెరగకుండా, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగులకు ఈరోజు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు ఏది మంచి.. ఏది చెడు అనే దానిపై బాగా ఆలోచించాలి. ఆర్థిక పరంగా ఈరోజు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామి స్వభావంలో చిరాకు ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 8 గంటల వరకు

డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే రాశిచక్రాల వారు: పూర్తి ఖర్చుతో కూడిన రాశిచక్రాలు..డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే రాశిచక్రాల వారు: పూర్తి ఖర్చుతో కూడిన రాశిచక్రాలు..

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు కలల ప్రపంచం నుండి వాస్తవ ప్రపంచంలోకి రావాలి. మరోవైపు వ్యాపారులకు ఈరోజు ఆందోళనలు పెరుగుతాయి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈ రోజు మీరు విలువైనదాన్ని కొనడానికి మీ మనస్సును పెంచుకోవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు బాగుంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు సంతోషంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈ రోజు, మీ జీవిత భాగస్వామితో గడిపిన మంచి క్షణాలు గుర్తుకు వస్తాయి. ఈ రోజు మీ మానసిక స్థితి చాలా బాగుంటుంది. మీకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇందులో, మీ కుటుంబసభ్యుల పూర్తి మద్దతు కూడా మీకు లభిస్తుంది. మీ భాగస్వామితో సంబంధాలు బాగుంటాయి. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3:45 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఉద్యోగులకు ఆర్థిక పరమైన సమస్యలను ఎదుర్కొంటారు. కుటుంబ జీవితంలో ఉద్రిక్తత ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ అధ్యయనాలపై దృష్టి పెట్టగలుగుతారు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు వివాహ జీవితంలో మంచిగా ఉంటుంది. అయితే మీ జీవిత భాగస్వామి మీపై కోపంగా ఉంటే, ఈ రోజు వారి కోపం పూర్తిగా తగ్గదు. అటువంటి పరిస్థితిలో, మీరు వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలి. మీరు ఒంటరిగా ఉంటే ఈ రోజు స్నేహ సంబంధం ప్రేమగా మారుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఎక్కువ ఆందోళన ఉంటుంది. మీ పనిలో ఎక్కువ అంతరాలు ఉంటాయి. కుటుంబంలో ఈరోజు మీ ప్రాధాన్యత పెరుగుతుంది. మీరు వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నించాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:45 నుండి రాత్రి 7 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీ పాత శత్రువులలో ఒకరు మీకు హాని కలిగించడానికి ప్రయత్నించవచ్చు. మీ ముఖ్యమైన పనిని మీ స్వంతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఇతరులపై ఆధారపడకండి. ఆర్థిక పరంగా ఈరోజు సంపాదించగలుగుతారు. మీ వైవాహిక జీవితంలో, మీ జీవిత భాగస్వామి పట్ల మీ ప్రవర్తన కూడా కొంత మారుతుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:15 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు మానసిక క్షోభను ఎదుర్కొంటుంటే, మీరు మతపరమైన పనులలో శ్రద్ధ వహించాలి. మీరు పూజల నుండి సానుకూల శక్తిని పొందుతారు. మీరు పని చేసి, మీ ప్రమోషన్ కావాలని కలలుకంటున్నట్లయితే, మీరు దీనికి సంబంధించిన కొన్ని శుభవార్తలను కూడా పొందవచ్చు. ఆర్థిక రంగంలో ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయితే అకస్మాత్తుగా ఖర్చులు మీ ఖర్చులు పెరుగుతాయి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 41

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope May 9, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Saturday, May 9, 2020, 2:08 [IST]
Desktop Bottom Promotion