శుక్రవారం దినఫలాలు : ఈరోజు మీ డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలి...

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, నిజ అశ్వీయుజమాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope November 06, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. మీరు పూర్తి శక్తి మరియు సానుకూలతతో మీ పనిని పూర్తి చేస్తారు. మీ ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఈరోజు మీరు మానసికంగా బలంగా ఉంటారు. మీ కుటుంబం మరియు స్నేహితులతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. మీ వివాహ జీవితంలో ఆనందం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు చాలా ఆలోచనాత్మకంగా ఖర్చు చేయాలి. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 41

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీకు పేదవారికి సహాయం చేసేందుకు అవకాశం లభిస్తే, మీరు దేవునితో ఆశీర్వదించబడతారు. పని విషయంలో ఈరోజు మీకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు ఊహించిన ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీ పని ఆస్తికి సంబంధించినది అయితే, మీరు మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:15 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు తక్కువ శ్రమకు ఎక్కువ ఫలితాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగం గురించి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. మీరు వైద్య రంగంతో సంబంధం కలిగి ఉంటే, ఈరోజు మీకు చాలా ముఖ్యమైన రోజు అవుతుంది. మరోవైపు వ్యాపారులు ఈరోజు ఒక పెద్ద ఒప్పందాన్ని పొందే అవకాశం ఉంది. మీ ఇంటి వాతావరణం కొంత అల్లకల్లోలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి రాత్రి 7 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సంయమనం పాటించాలి. లేదంటే మీరు ఇబ్బందుల్లో పడొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. అయితే మీకు ఈరోజు వారితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభించదు. అయితే మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ ప్రేమ కూడా పెరుగుతుంది. మీ పిల్లలను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించాలి. ఆరోగ్యంగా ఉండేందుకు ఈరోజు ఆహారంపై శ్రద్ధ వహించాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో ముఖ్యమైన రోజు అవుతుంది. ప్రత్యేకించి ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీ ఉన్నతాధికారులు మీ చర్యలను తనిఖీ చేయవచ్చు. వ్యాపారులు ఈరోజు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వస్తుంది. అప్పుడే మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. మీ కుటుంబ వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు బలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కొంత సమస్య ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3:45 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది. మీకు ఆరోగ్య పరంగా ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఉద్యోగులకు ఈరోజు జీవితంలో పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకోవాలి. ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు ఉంటాయి. మీకు తల్లిదండ్రుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 7:35 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో నిరాశ చెందుతారు. ఇలాంటి సమయంలో మీరు సానుకూలంగా ఆలోచించాలి మరియు ధైర్యంగా, ఓపికగా ఉండాలి. అప్పుడే మీ సమస్యలు పరిష్కరించబడతాయి. ఉద్యోగులు ఆఫీసులో పనిని త్వరగా ముగించేందుకు ప్రయత్నించాలి. ఈరోజు మీకు చాలా ముఖ్యమైన పనులుంటాయి. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు రాకపోతే, మీరు కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. మీరు మీ నెట్ వర్క్ పై కూడా శ్రద్ధ వహించాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది. మీకు వారితో గడిపేందుకు తగిన సమయం కూడా లభిస్తుంది. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజూ మీరు ధ్యానం మరియు యోగా చేయాలి.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 29

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 8:45 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు ఆర్థిక సమస్యల కారణంగా కొంత ఒత్తిడి ఉంటుంది. మీకు కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. అయితే త్వరలోనే మీకు సానుకూల ఫలితాలొస్తాయి. మరోవైపు మీ జీవిత భాగస్వామితో కొంత కఠినంగా ఉంటుంది. వారి మాటలు మిమ్మల్ని చాలా బాధిస్తాయి. ఈరోజు మీ ఇంటికి అకస్మాత్తుగా కొంతమంది అతిథులు రావచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు అధిక ఒత్తిడి మరియు కోపాన్ని నివారించాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 36

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి రాత్రి 7 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో ఉపాధి ప్రజలకు ఈరోజు చాలా పవిత్రంగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు ప్రమోషన్ పొందొచ్చు. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీ కుటుంబంతో పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా శక్తివంతంగా ఉంటారు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 4:05 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. అయితే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ ప్రియమైన వారికి ఈ సమయంలో మీతో సరైన సంరక్షణ మరియు మద్దతు అవసరమవుతుంది. పని విషయంలో ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీకు వచ్చిన మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. అయితే ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 8:35 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ప్రత్యేకంగా ఏమీ ఉండదు. మీరు ఈరోజు సోషల్ మీడియాలో మాత్రం చురుకుగా ఉంటారు. మీ వైవాహిక జీవితంలో పరిస్థితులు ఒత్తిడితో కూడుకుని ఉంటాయి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : సాయంత్రం 5:15 నుండి రాత్రి 10:10 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు కుటుంబ జీవితంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే, మీరు దాన్ని సంపాదించవచ్చు. మరోవైపు మీరు మీ ప్రియమైన వారి కోసం కొన్ని బహుమతులు కూడా కొనుగోలు చేయొచ్చు. ఉద్యోగులు యజమానులతో మంచి సంబంధాలు పెట్టుకోవాలి. ఆరోగ్య పరంగా ఈరోజు దంతాలకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8:30 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Friday, November 6, 2020, 5:00 [IST]
Desktop Bottom Promotion