For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుధవారం మీ రాశిఫలాలు (20-11-2019)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, కార్తీక మాసం, బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి..

1) మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

1) మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబానికి సంబంధించిన సమస్యలపై ఎక్కువ దృష్టి పెడతారు. మీకు, మీ కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా వివాదం ఉంటే వాటిని తెలివిగా పరిష్కరించడం మంచిది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు ఊహించని విధంగా మీకు డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీ వైవాహిక జీవితం సామరస్యంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో ప్రేమ మరియు సమైక్యత ఉంటుంది. ప్రేమ విషయాలలో ఈరోజు చాలా ముఖ్యమైనది.ఈరోజు మీకు ప్రత్యేకమైన వారిని కలవడం లేదా వారి ప్రేమ ప్రతిపాదన పొందడం సాధ్యమవుతుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

2) వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

2) వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి ఈరోజు కెరీర్ కు సంబంధించిన సలహాలను స్వీకరించడానికి ఇది సరైన సమయం. దీని వల్ల మీరు సరైన దిశలో ఒక అడుగు ముందుకు వేయవచ్చు. మీరు ఏదైనా ఇబ్బందులను ఎదుర్కొంటుంటే మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మీకు సహాయం చేయడానికి కచ్చితంగా ముందుకు వస్తారు. ఈరోజు మీరు కోపాన్ని నియంత్రించాల్సి ఉంటుంది. అలాగే మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీ ఇద్దరి మధ్య గొడవ జరగొచ్చు. ప్రేమలో ఉన్న వారికి ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి ఈరోజు బాగానే ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : రాత్రి 7:55 నుండి రాత్రి 9:40 గంటల వరకు

3) మిధున రాశి : మే 21 - జూన్ 20

3) మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు వారి జీవిత భాగస్వామి యొక్క డిమాండ్ ను విజయవంతంగా తీర్చవచ్చు. అది మీ సంబంధాన్ని బలపరుస్తుంది. ఈరోజు ఆర్థిక పరంగా మీరు మీ తండ్రి సలహా మేరకు నిర్ణయం తీసుకుంటే మీకు భారీ ప్రయోజనాలు లభిస్తాయి. ఆరోగ్య పరంగా మీ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవాలి. మీరు ఆరోగ్యంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు కొంత వ్యాయామం చేయండి. ఈరోజు మీరు పనికి సంబంధించిన ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవవచ్చు. మీరు ఉద్యోగం చేస్తుంటే మీ యజమాని ఈరోజు మీతో చాలా సానుకూలంగా వ్యవహరిస్తారు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 37

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

4) కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

4) కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలలో అదృష్టం కలసి వస్తుంది. మీకు పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. దీని వల్ల మీకు పెద్ద ఆర్థిక లాభాలు వస్తాయి. ఈరోజు మీరు కూడా ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. చాలా కాలంగా మీరు ఆందోళన చెందుతున్న సమస్యలు ఈరోజు పరిష్కారమవుతాయి. ఈరోజు ఆఫీసు వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. మీ యజమాని మీరు పెండింగులో ఉంచిన పనుల వల్ల కోపంగా ఉండొచ్చు. అందుకే మీరు మీ పనిని సకాలంలో పూర్తి చేయడం మంచిది. మీరు ఈరోజు ఎలాంటి కొత్త పనిని ప్రారంభించవద్దు. ఎందుకంటే సమయం ప్రతికూలంగా ఉంది. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నిరంతరం పని చేయడం మానుకోండి. ఎక్కువ ఒత్తిడిగా ఫీలై పని చేయవద్దు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:55 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

5) సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

5) సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు దూకుడు స్వభావం కారణంగా ఇబ్బందుల్లో పడొచ్చు. అందుకే అనవసరమైన చర్చల్లో పాల్గొనడం మానుకోండి. వేరొకరి విషయంలో తల దూర్చకండి. కార్యాలయంలో ఉన్నతాధికారుల మీకు ఎక్కువ పని చెప్పడం వల్ల మీరు ఈరోజు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారు ఈరోజు చాలా కఠినంగా వ్యవహరించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. వ్యాపారానికి సంబంధించి ఈరోజు చేసే ప్రయాణం వల్ల మంచిగా ఉంటుంది. దాని వల్ల మీ వ్యాపారం పెరుగుతుంది. అలాగే మీకు త్వరలో పెద్ద పురోగతి లభిస్తుంది. ఈరోజు మీరు మీ పిల్లలతో గొప్పగా గడిపేందుకు సమయం కేటాయిస్తారు.ప్రేమలో ఉన్న జంటలకు ఈరోజు ప్రత్యేకమైన రోజు అవుతుంది. మీరు ఈరోజు శారీరకంగా మరియు మానసికంగా, బలంగా ఉంటారు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 7:30 గంటల వరకు

6) కన్యా రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

6) కన్యా రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులను పొందడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తుంది. ఈరోజు మీరు కొంత ఓదార్పు వంటి విషయాల కోసం డబ్బును ఖర్చు చేయవచ్చు. ఈరోజు మీ కుటుంబంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు తోబుట్టువుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. అలాగే మానసిక శాంతిని అనుభవిస్తారు. ఈరోజు, మీరు మీ జీవిత భాగస్వామి మరియు పిల్లలతో కొంత సమయాన్ని గడపగలుగుతారు. ఇది మీ ఆనందాన్ని పెంచుతుంది. ప్రేమ విషయాలలో ఈరోజు చాలా ఆనందంగా ఉంటుంది. మీ భాగస్వాములు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆశ్చర్యపరచగలరు. వ్యాపారస్తులకు ఈరోజు పురోగతి కనిపిస్తుంది. మీరు ఉద్యోగం చేస్తుంటే, ఈరోజు మీ పని నైపుణ్యంతో మీరు సీనియర్ల మనసులను గెలుచుకుంటారు. ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు

7) తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

7) తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

మీ ఆర్థిక పరిస్థిని మెరుగుపరుచుకునేందుకు ఈరోజు మీరు అనుభవం ఉన్న వ్యక్తి లేదా మంచి ఆర్థిక సలహాదారుల నుండి సహాయం పొందవచ్చు. ఈరోజు మీరు కార్యాలయంలో కొత్త అవకాశాన్ని కూడా పొందవచ్చు. మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో రిలేషన్ షిప్ బలంగా ఉంటుంది. మీ తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. లేకపోతే వారు నిర్లక్ష్యం చేయబడినట్లు భావిస్తారు. ఈరోజు మీరు మీ భాగస్వామి యొక్క వాగ్దానాన్ని నెరవేర్చగలరు. ఈరోజు మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. కానీ విశ్రాంతి కోసం తగిన సమయం కేటాయించాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

8) వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

8) వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

పని ప్రదేశంలో రోజు హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. బహుశా, రోజు ప్రారంభం సరిగ్గా ఉండదు, కానీ త్వరలో విషయాలు మీకు అనుకూలంగా వస్తాయి. మీ కృషికి సీనియర్లు సంతోషించవచ్చు. ఈ రోజు, మీరు చర్చకు దూరంగా ఉండాలని మరియు మంచి ప్రవర్తనను కలిగి ఉండాలని సలహా ఇస్తారు, ఇతరులలో మీ ప్రతిష్ట క్షీణిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామి పట్ల అధికంగా సున్నితంగా ఉంటారు, ఇది మీ ఇద్దరి మధ్య కొన్ని తేడాలను కలిగిస్తుంది. ఎకనామిక్ ఫ్రంట్‌లో రోజు ప్రయోజనకరంగా లేదు. షాపింగ్ కోసం ఎక్కువ ఖర్చు చేయవద్దని మీకు సలహా ఇస్తారు, కానీ పొదుపుపై ​​దృష్టి పెట్టండి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

9) ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

9) ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు కార్యాలయంలో మంచి ఫలితాలను పొందవచ్చనే వాస్తవాన్ని గ్రహాల స్థానం మరియు దిశలు సూచిస్తున్నాయి. మీరు మీ ఊరికి దూరంగా పనిచేస్తే, మీరు మీ నగరానికి బదిలీ చేయబడవచ్చు. అలాగే ఒక పెద్ద అవకాశం మీ తలుపు తట్టుతుంది. కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధంగా ఉండండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీతో ఎక్కువ సమయం కోరితే, అలాంటి వాటిని విస్మరించొద్దు. ఆరోగ్యం విషయంలో ఈరోజు ఇబ్బందులు తప్పువు. బిపి ఉన్నవారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : సాయంత్రం 4:20 నుండి రాత్రి 8:45 గంటల వరకు

10) మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

10) మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

కొన్ని రోజుల నుండి ఒత్తిడికి లోనైన మీరు ఈరోజు ఉపశమనం పొందుతారు. ఈరోజు ఈ రాశి వారికి అన్ని విషయాలు అనుకూలంగా ఉండొచ్చు. మీరు వ్యాపారం చేస్తే, మీ శత్రువులు మీ పనులను అడ్డుకునే అవకాశం ఉంది. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే అప్రమత్తంగా ఉంటూ తెలివిగా వ్యవహరించాలి. ఉద్యోగులకు ఈరోజు కష్టమైన పనులు కేటాయించబడినందున చాలా జాగ్రత్తగా పని చేయాలి. మీ వివాహ జీవితాన్ని మెరుగుపరచడానికి మీ ప్రయత్నాలను కొనసాగించండి. త్వరలో మీ జంటల మధ్య తేడాలు మాయమవుతాయి. ఆర్థిక పరంగా ఈరోజు చాలా బాగుంది. మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడం మీకు లాభదాయకంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:20 నుండి సాయంత్రం 5 గంటల వరకు

11) కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

11) కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు చాలా ముఖ్యమైనది. మీరు ఈరోజు అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. కుటుంబానికి సంబంధించిన సమస్యలపైనా దృష్టి పెడతారు. ఈ ప్రక్రియలో, ఈరోజు మీరు కొన్ని ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవచ్చు. కొంతమంది ఇంటి సభ్యులు మీ నిర్ణయాన్ని వ్యతిరేకించొచ్చు. కానీ మీరు దానికే కట్టుబడి ఉండాలి. ఆర్థిక రంగంలో ఈరోజు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీ బడ్జెట్ పై శ్రద్ధ చూపకపోతే, మీరు ఇబ్బందుల్లో పడొచ్చు. వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం గురించి ప్రస్తావిస్తే, మీరు ఆహార అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రోడ్డుపైన నూనె వస్తువులను తినడం మానుకోవాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 10 గంటల వరకు

12) మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

12) మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. మీ కోపాన్ని నియంత్రించుకోమని పెద్దలు మీకు సలహా ఇస్తారు. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా చాలా మంచి రోజు అవుతుంది. మీరు అనవసరమైన విషయాల గురించి చింతించటం మానేయాలి, అప్పుడే మీ జీవితంలో ముందుకు సాగగలరు. మీరు ఏదైనా ప్రాజెక్టులో పని చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడకుండా ఉండాలి. ఈరోజు మీ జీవితంలో సానుకూల మార్పులు వచ్చే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 4:15 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

English summary

Daily Horoscope November 20, 2019

Will you be lucky today so that your unfinished tasks will be completed without any hindrance? If you are eager to know then read your daily horoscope. While it is a good day in terms of health for Aries and Taurus, Gemini has to take good care of their health. Overall, it will be a mixed day for all the zodiacs.
Story first published: Wednesday, November 20, 2019, 6:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more