For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుక్రవారం మీ రాశిఫలాలు (22-11-2019)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, కార్తీక మాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి..

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసే అనేక ప్రయోజనాలను మీరు పొందుతారు. ఈరోజు ఆరోగ్యం బాగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కూాడా ఆనందంగా ఉంటుంది. మరోసారి మీరు మీ జీవిత భాగస్వామితో ప్రేమలో పడతారు. మీరిద్దరూ ఈ రోజు కొన్ని శృంగార క్షణాలను అనుభవించవచ్చు. ఇంకోవైపు పిల్లలు ఉన్న వారికి కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. వారు మీ అంచనాలకు అనుగుణంగా జీవించలేరు. మీ ప్రవర్తన వల్ల మీ సన్నిహితులను మీరు నిరాశపరచవచ్చు. అందుకే సక్రమంగా ప్రవర్తించండి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:45 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు గొప్ప అవకాశాలు వస్తాయి. మీకు ఈరోజు ఎలాంటి అడ్డంకులు ఉండవు. మీ పురోగతికి సంబంధించి ముందడుగు పడుతుంది. కానీ తొందరలో ఉత్సాహపడుతూ ఎటువంటి నిర్ణయం తీసుకోకండి. ఆర్థిక రంగంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామి కోసం ఒక విలువైన బహుమతిని కొనుగోలు చేయవచ్చు. శృంగార జీవితంలో కూడా ఈరోజు మంచి ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీకు మరియు మీ భాగస్వామికి మధ్య ఉన్న గొడవలు సద్దుమణిగే అవకాశం ఉంది.

మీరు ఇద్దరూ కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. ఈ రోజు, మీ పని ప్రణాళిక ప్రకారం పూర్తవుతుంది. కాబట్టి మీరు రిలాక్స్ అవుతారు. కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. అది ఇంట్లో ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ఏదైనా కోర్టుకు సంబంధించిన కేసు ఉంటే ఈరోజు మీరు విజయం సాధించవచ్చు. ఆర్థిక రంగంలోనూ ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపారం లేదా పెట్టుబడి మీకు మంచి రాబడిని ఇస్తుంది. కార్యాలయంలో పెద్ద విజయాన్ని సాధించడానికి స్పష్టమైన అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు వైవాహిక జంటలకు ఉత్సాహంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి పట్ల మరింత భావోద్వేగానికి లోనవుతారు. కుటుంబంలో ప్రేమ మరియు శాంతిని చూడటం ద్వారా మీరు మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. మతపరమైన పనులపైనా ఆసక్తి పెరుగుతుంది. కొంత వినోదం కోసం మీరు సాయంత్రం మీ పిల్లలతో కలిసి బయటకు వెళ్లొచ్చు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : ఉదయం 6:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు పనికి సంబంధించి మరింత కష్టపడాల్సి ఉంటుంది. మీరు ఎక్కువగా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. మంచి ఫలితాల కోసం అదనపు ప్రయత్నం చేయాలి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులలో కూడా మీ జీవిత భాగస్వామి మీకు అండగా నిలుస్తారు. మరోవైపు, కొన్ని కుటుంబ విషయాలు ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీ పెద్దలను సంప్రదించిన తర్వాతే మీరు నిర్ణయం తీసుకోవడం మంచిది. మీరు ఆలోచించకుండా ఒక అడుగు ముందుకు వేస్తే, అది మీ సంబంధాలపై చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. ఈ రోజు ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్య ఉండదు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి రాత్రి 10 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. భూమికి సంబంధించిన లావాదేవీలు ఉండవచ్చు. అయితే అందుకు సంబంధించిన పత్రాలకు సరిగ్గా తనిఖీ చేయడం మంచిది. పనిలో ఈరోజు మీకు ఒత్తిడి ఉంటుంది. కార్యాలయంలో అసంపూర్తిగా ఉన్న కొన్ని పనులను పూర్తి చేయడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారవేత్తలు వారి పనికి సంబంధించి కొన్ని సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు. కానీ ఫలితం ఊహించిన విధంగానే ఉంటుంది. మీరు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ రోజు మీరు విశ్రాంతి తీసుకోవడానికి తగినంత అవకాశం రాకపోవచ్చు.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 12 నుండి రాత్రి 10:30 గంటల వరకు

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు సంతృప్తికరంగా ఉంది. మీరు ఎలాంటి ఆర్థిక సమస్యను ఎదుర్కోరు. కొత్త పని కోసం డబ్బు సంపాదించగలరు. ఈ రోజు కొంత పెద్ద లాభాలు పొందే అవకాశం కూడా ఉంది. మీ పనిలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మీరు మానసిక శాంతిని కూడా అనుభవిస్తారు. మీ కుటుంబానికి తగినంత సమయం ఇవ్వండి. తోబుట్టువులతో కొన్ని సైద్ధాంతిక వ్యత్యాసాలు ఉండవచ్చు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ఈ రోజు, మీరు పూర్తి విశ్వాసంతో ముందుకు సాగుతారు. మీ పని చాలా తేలికగా పూర్తవుతుంది. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ ఉండదు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మీ సమయం అంతా తగాదా మరియు అనవసరమైన విషయాలపై వృథా అవుతుంది. కార్యాలయంలో మీ పనితీరు నిరంతరం క్షీణించడం వల్ల, మీ ఉన్నతాధికారులు మీకు వ్యతిరేకంగా కఠినమైన నిర్ణయం తీసుకోవచ్చు. మీ పనిపై ఎక్కువ దృష్టి పెట్టడం మరియు కష్టపడి పని చేయడం మంచిది. ఆర్థిక విషయాలలో ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈరోజు మీరు ఊహించని విధంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. క్లిష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి మీకు పూర్తి మద్దతు ఇస్తుంది. మీరిద్దరూ కలిసి మీ సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించవచ్చు. ఈ రోజు మీరు మీ ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ వహించాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. గత జ్ఞాపకాల యొక్క అనేక ఆలోచనలు మీ మనస్సును కలవరపెడతాయి. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కానీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో శాంతి ఉంటుంది. కానీ ఈ రోజు మీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. జీవిత భాగస్వామి మీకు ప్రేమ మరియు మద్దతు ఇస్తుంది. మీ కఠినమైన మాటల వల్ల కొన్ని వివాదాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రేమలో ఉన్న జంటలు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం సరిగ్గా ఉండదు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : సాయంత్రం 5:30 నుండి రాత్రి 9 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ప్రతి పనిలో అంతరాయం కలుగుతుంది. కార్యాలయంలో ఉన్నతాధికారులపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ రోజు తొందరలో కొన్ని తప్పులు కూడా చేయవచ్చు. ఈ రోజు నష్టానికి బలమైన అవకాశం ఉన్నందున వ్యాపారవేత్తలు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి. కుటుంబం విషయానికొస్తే పెద్దల సలహాలను పాటించడం మంచిది. మీరు వారికి వ్యతిరేకంగా వెళ్లి ఏదైనా పని చేస్తే, అప్పుడు నష్టం మీకే జరుగుతుంది. మీ సమస్యలను పరిష్కరించడంలో జీవిత భాగస్వామి మీకు పూర్తి మద్దతు ఇస్తుంది. మీ ఇద్దరి మధ్య సంబంధం మరింత బలపడుతుంది. కొన్ని ఆర్థిక సమస్యలు కూడా ఉండవచ్చు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 4:20 నుండి రాత్రి 8:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి ఈరోజు పూర్తిగా ఆనందంగా ఉంటారు. మీ మానసిక స్థితి సంతోషకరంగా ఉంటుంది. మీ చుట్టుపక్కల ప్రజలను కూడా సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. కార్యాలయంలో మీకు అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ ఒక ముఖ్యమైన పనిని మీరు పూర్తి చేయగలరు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి మద్దతుతో భవిష్యత్తు కోసం కొన్ని ప్లాన్ లు వేస్తారు. ఆర్థిక సమస్యలు ఈరోజు ఉండవు. ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పని కోసం అకస్మాత్తుగా ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే ప్రయాణం మీకు శుభంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 12:30 నుండి రాత్రి 10:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు పనిలో బాగుంటుంది. ముఖ్యంగా వ్యాపారవేత్తలు కొన్ని ప్రయోజనాలను పొందుతారని భావిస్తున్నారు. మీరు ఈరోజు కొన్ని ఒప్పందాలను చేసుకోవచ్చు. అలాగే ఆర్థిక పరంగా ఈరోజు మీరు ఎవరితోనైనా వివాదంలో పడవచ్చు. అలాంటి వివాదాలకు దూరంగా ఉండమని పెద్దలు మీకు సలహా ఇస్తారు. చాలా కాలం పాటు చట్టపరమైన విషయాలలో మీరు చిక్కుకోవచ్చు. కార్యాలయంలో మీరు ఈరోజు అన్ని పనులను పూర్తి బాధ్యతతో నిర్వహించగలుగుతారు. ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు సహజమే. ఈరోజు ఆరోగ్యపరంగా బాగుంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 7 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీ మనస్సు ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఈరోజు తాజాదనాన్ని అనుభవిస్తారు. పెండింగులో ఉన్న పనులను పూర్తి చేస్తారు. దీంతో మీకు ఆనందం కలుగుతుంది. మీ కుటుంబంలో ఈరోజు శాంతి మరియు ఆనందం ఉంటుంది. మీ తల్లి లేదా తండ్రి నుండి ప్రత్యేక బహుమతిని ఆశిస్తారు. వైవాహిక జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమపూర్వక ప్రవర్తన మీకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. ఉద్యోగులు ఈ రోజు అదృష్టం కలసి వస్తుంది. ఈ రోజు వ్యాపారవేత్తలు లాభాలను పొందే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి రాత్రి 8 గంటల వరకు

English summary

Daily Horoscope November 22, 2019

What written in your fate today? Read your daily horoscope to know what the movement of planets reveal about you today.
Story first published: Friday, November 22, 2019, 6:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more