For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంగళవారం మీ రాశిఫలాలు (5-11-2019)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, కార్తీక మాసం, మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి..

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలలో అంతా అనుకూలంగా ఉంటుంది. స్థిరమైన ఆర్థిక పరిస్థితి కారణంగా ఆందోళన లేకుండా ఉంటారు. మీరు రుణం తీసుకుని కొత్త ఇల్లు లేదా వాహనాన్ని కొనాలని ఆలోచిస్తుంటే, దాని కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజు అనుకూలమైన సమయం. అదే విధంగా ఈరోజు మీ పనిలో గొప్ప రోజు అవుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో బోనస్ పొందాలని భావిస్తారు. మీ కృషికి యజమాని నుండి ప్రశంసలను అందుకుంటారు. అదే సమయంలో, వ్యాపారవేత్తలు కొన్ని కొత్త ఒప్పందాలను చేసుకోవచ్చు. ప్రేమ విషయాలలో మీరు ఈ రోజు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ కుటుంబం మీ సంబంధాన్ని ఆమోదించకపోవచ్చు, కానీ చింతించకండి. సరైన సమయం కోసం వేచి ఉండండి. ఆరోగ్యం విషయంలో రోజు సాధారణం అవుతుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 1

లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు జీవితంలో పెద్ద మార్పు రావచ్చు. ఈ మార్పు వల్ల మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీ ప్రణాళికలను కొనసాగించడానికి కృషి చేయండి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంతో ప్రేమ మరియు పరస్పర సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో సంబంధం కూడా సామరస్యంగా ఉంటుంది. అన్ని బాధ్యతలను నెరవేర్చడంలో మీరిద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటారు. ఆర్థిక విషయానికొస్తే మీకు చాలా ఇబ్బందుల తర్వాత డబ్బు వస్తుంది, కానీ మీరు కష్టపడి సంపాదించిన సొమ్మును సరిగ్గా వినియోగించుకోవడం మంచిది. దీని వల్ల భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు అవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు డబ్బు పరంగా మంచి ఫలితాలు ఉంటాయి. మీ డబ్బు చాలా కాలం నుండి ఎక్కడో ఇరుక్కుపోయి ఉంటే, ఈ రోజు దానిని పొందే బలమైన అవకాశం ఉంది. మీరు ఈ రోజు ఆస్తిని అమ్మవచ్చు లేదా కొనవచ్చు. పనిలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలను చాలా ఆలోచనాత్మకంగా ఉపయోగించాలి. మీ సీనియర్లు మీ పనిలో పొరపాటును ఎత్తి చూపినట్లయితే, వాదించడానికి బదులుగా, వారి మాటలపై దృష్టి పెట్టండి మరియు వారి నుండి నేర్చుకోండి. అలాగే, మీ తప్పును బహిరంగంగా అంగీకరించండి. కుటుంబంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీరు వారి పూర్తి ప్రేమ మరియు మద్దతును పొందుతారు. మీ జీవిత భాగస్వామితో చిన్న తేడాలు సాధారణమే.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 27

లక్కీ టైమ్ : ఉదయం 7:45 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు మీ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే పొరుగువారితో వాదించకుండా ఉండాలి. మీరు చాలా కాలం పాటు కొన్ని చట్టపరమైన కేసులో చిక్కుకోవచ్చు. మీ దూకుడు స్వభావం మీ జీవిత భాగస్వామితో గొడవకు దారి తీస్తుంది. ఇలాంటి పరిస్థితులను నివారించడానికి ఈ రోజు మీ ప్రవర్తనను సబబుగా ఉంచండి. కార్యాలయంలో, మీ పనిని ప్రభావితం చేసే మానసిక ఒత్తిడి కారణంగా మీరు మీ పనిపై దృష్టి పెట్టలేకపోతారు. ఇది మీ పనికి సంబంధించి మీ సీనియర్లు చాలా కఠినమైన వైఖరిని తీసుకునేలా చేస్తుంది. ఇలాంటి పరిస్థితులలో ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతమైన మనస్సుతో పనిచేయండి. ఈ రోజు ఆర్థిక పరిస్థితులు మంచిగా ఉండవు. ఖర్చుల పెరుగుదల మీ బడ్జెట్‌ను అతలాకుతలం చేస్తుంది. ప్రేమ విషయాలలో ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : సాయంత్రం 5:20 నుండి రాత్రి 9:30 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీరు ఒంటరిగా ఉంటే, మీ భాగస్వామి కోసం చేస్తున్న అన్వేషణ ఈ రోజు ముగియవచ్చు. అలాగే, మీ భాగస్వామిని వివాహం కోసం ప్రతిపాదించడానికి ధైర్యం చేయవచ్చు. వివాహిత జంటలకు కూడా ఈ రోజు మంచిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి ప్రేమ మరియు మద్దతు లభిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ఒక చిన్న పని పూర్తయిన తర్వాత మీకు భారీ ప్రయోజనం లభిస్తుంది. ఈ రోజు వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో సమయం అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : ఉదయం 4:50 నుండి మధ్యాహ్నం 12:05 గంటల వరకు

 కన్యా రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్యా రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు పనికి సంబంధించి మంచి ఫలితాలు వస్తాయి. మీ సీనియర్లు మరియు ఉన్నతాధికారుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వారు మీ మాటలకు శ్రద్ధ చూపుతారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ఉత్తమమైనదాన్ని ఇవ్వడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. కుటుంబానికి సంబంధించిన ఏదైనా సమస్య ఈ రోజు ముగియవచ్చు. మీరు ప్రశాంతంగా మరియు సంతృప్తి చెందుతారు. మీ ప్రియమైనవారితో సంబంధం మెరుగుపడుతుంది. మీ తోబుట్టువుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితులు ఈ రోజు బాగానే ఉంటాయి. కానీ తరువాత ఇబ్బందులు కలిగించే విధంగా ఎక్కువ ఖర్చు చేయకుండా జాగ్రత్త వహించండి. ప్రేమలో ఉన్న జంటలకు ఈరోజు మంచిది కాదు. మూడో వ్యక్తి జోక్యం మీ ఇద్దరి మధ్య అపార్థాలకు కారణం కావచ్చు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి మధ్యాహ్నం 3:15 గంటల వరకు

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని అలర్జీలతో బాధపడతారు. కాబట్టి మీరు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. ఈ రోజు ప్రయాణం మీ అలసటను పెంచుతుంది. మీ ఆరోగ్యాన్నికూడా తగ్గిస్తుంది. ఈ రోజు మీరు పొందబోయే ఆర్థిక లాభం మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది. మీ కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి మీరు రుణం తీసుకోవలసి ఉంటుంది. మీరు మీ ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకుంటే, రాబోయే రోజుల్లో మీరు మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ రోజు కుటుంబం అస్థిరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మీ విభేదాలు తీవ్రమవుతాయి. ఓపికపట్టండి మరియు నిజాయితీగా ఉంటే, వారు మీ దృష్టికోణాన్ని అర్థం చేసుకోవచ్చు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పనికి సంబంధించిన కొన్ని పెద్ద సమస్యలను పరిష్కరించవచ్చు. వ్యాపారవేత్తలకు ఈరోజు మంచి ప్రయోజనాలు లభించనున్నాయి. ఉద్యోగులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈ రోజు మీ పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ప్రేమ విషయాలలో ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు అవుతుంది. మీరు ఒంటరిగా ఉంటే ఈ రోజు మీకు ప్రేమ ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది. వివాహిత జంటలకు కూడా ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మీ అనుబంధం పెరుగుతుంది. ఈ రోజు, మీరిద్దరూ కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. విద్యార్థులకు ఈరోజు మంచి రోజు అవుతుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 11:30 నుండి రాత్రి 9 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు అనవసరమైన ఖర్చులు చేస్తారు. దీని వల్ల వారి బడ్జెట్ ను నాశనం చేసుకుంటారు. దీనివల్ల మీరు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే, మీ ఖరీదైన స్వభావం కారణంగా, మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో విభేదాలను ఎదుర్కొంటారు. మీరు ఆలోచించకుండా మీ ఆర్థిక నిర్ణయాలు ఇదే విధంగా తీసుకుంటే, మీ భవిష్యత్ ప్రణాళికలు దెబ్బతినవచ్చు. కుటుంబ సభ్యులతో వివాదం ఉంటుంది. ఇది మీ ఇంటి వాతావరణాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీ మాటలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. కార్యాలయంలో, మీ సహోద్యోగులను విమర్శించడం మానుకోండి ఎందుకంటే ఇది మీ పని మరియు ప్రతిష్టను ప్రభావితం చేస్తుంది. ఇతరుల తప్పులను ఎత్తి చూపే ముందు, ముందు మీరు ఏమిటో తెలుసుకోండి. ఈ రోజు మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. మీ ఆహారం మరియు పానీయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 11:05 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈ రోజు కొంత గందరగోళమైన ఆలోచనలో పడతారు. అటువంటి పరిస్థితిలో, మీకు దగ్గరగా ఉన్న వారితో మాట్లాడండి. అప్పుడే మీ ప్రశ్నలకు సమాధానాలు దొరకవచ్చు, కాబట్టి సలహా తీసుకోండి. మీరు పనికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే, అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి ఒక అభిప్రాయాన్ని తీసుకోండి. కుటుంబంలో శాంతి ఉంటుంది మరియు కుటుంబ సభ్యులతో సంబంధం కూడా మెరుగుపడుతుంది. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీ జీవిత భాగస్వామితో విభేదాలు ముగుస్తాయి. మీ ఇద్దరి మధ్య సంబంధం మరింత తీవ్రమవుతుంది. మీరిద్దరూ కలిసి చిరస్మరణీయమైన రోజు గడుపుతారు. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారి కుటుంబంలో ఈరోజు ఆనందం ఉంటుంది. మీ ఇంట్లో, ఒక మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. ఇది వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. చాలా కాలం తరువాత, మీరు మీ కుటుంబంతో ఆనందంగా గడపగలుగుతారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ ఆర్థిక ప్రయత్నాలన్నీ ఈ రోజు విజయవంతమవుతాయి, ఇది డబ్బుకు సంబంధించిన మీ చింతలను అంతం చేస్తుంది. మీ జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన పెరుగుతుంది. మీరిద్దరూ మీ వివాహ జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆనందిస్తారు. స్నేహితుల నుండి పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. అవసరమైనప్పుడు వారు మీకు సహాయం చేయడానికి ముందుకు రావచ్చు. ప్రేమ జంటలకు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 35

లక్కీ టైమ్ : ఉదయం 5:05 నుండి మధ్యాహ్నం 3:40 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం గురించి నిర్లక్ష్యంగా ఉంటే, భవిష్యత్తులో చింతించాల్సి రావచ్చు. ఈరోజు మీ వాహనాలను ఉపయోగించే సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆఫీసులో పనిభారం మీ ఒత్తిడిని పెంచుతుంది. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచండి. మీ అన్ని పనులను సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రయత్నించండి. పని సకాలంలో పూర్తి కాకపోతే మీ ఉన్నతాధికారులకు కోపం రావచ్చు. వ్యాపారవేత్తలు ఈ రోజు ఆశించిన ఫలితాలను పొందలేరు. మీరు కష్టపడి పనిచేయండి మరియు ఆశాజనకంగా ఉండండి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

English summary

Daily Horoscope November 5, 2019

Which signs are better if they postpone things? Do job efforts result? Can students excel in education? Is it convenient to express love? Travels & Travels Overseas Is it better to postpone? Investing in Business or Not? Read the full details of today's Bold Sky offerings in order to get a detailed look at the legal, court proceedings, property disputes, fortune teller, fortune teller, fate.
Story first published: Tuesday, November 5, 2019, 6:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more