For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దినఫలాలు : గురువారం మీ రాశిఫలాలు (12-09-2019)

|

జ్యోతిష్యం, సెప్టెంబర్ 12వ తేదీ

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, భాద్రపదమాసం, ద్వాదశి బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి..

మేషరాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేషరాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మీరు రోజు చేసే పనుల తర్వాత విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారు. ముఖ్యంగా వ్యక్తిగతంగా మీరు మీ జీవితానికి సంబంధించిన కొన్ని సమస్యలను క్రమబద్ధీకరిస్తారు. తల్లిదండ్రులు మీరు తీసుకునే నిర్ణయాలలో మీకు సహకరిస్తారు. అకాడమీ రంగంలో మీ పిల్లవాడి పనితీరు గురించి మీరు కొంచెం ఆందోళన చెందుతారు. పనిలో ఒత్తిడి మీకు తలనొప్పి తెప్పిస్తుంది. వ్యాపారవేత్తలు ఎక్కువ ప్రయాణం చేయడం వల్ల అలసిపోతారు. అయితే భారీ లాభం మాత్రం పొందుతారు. ఫైనాన్షియల్ గా మెరుగుదల కావాలంటే అదనపు సాధన అవసరమవుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి. లాభదాయకమైన రాబడిని ఇస్తాయి. మీ స్నేహితుడితో గడపడం వల్ల మీలో చైతన్యం వస్తుంది. ఆరోగ్యం మెరుగుపడటం కూడా ప్రేరేపించే అంశంగా మారుతుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 25

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

మీరు షాపింగ్ మరియు ఒకరోజు విహార యాత్ర కోసం ప్లాన్ చేసినందుకు ఇదొక సంతోషకరమైన రోజుగా నిలిచిపోతుంది. ఆర్థిక పరంగా మెరుగుదల అదనపు ప్రయోజనంగా ఉంటుంది. మీరు మీ ఖర్చులను గమనిస్తూ సేవ్ చేయడం కూడా ప్రారంభించాలి. పెద్దలతో మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. మీరు మీ తల్లిదండ్రుల నిరీక్షణకు అనుగుణంగా జీవించకపోవచ్చు. అది వారిని బాధపెడుతుంది. మొత్తంగా మీరు మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. పనిలో నిర్లక్ష్యం వహించకూడదు మరియు నిరాశ చెందకూడదు. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. ముఖ్యంగా కొత్త జంటలకు ఊహించని కొత్త ప్రయాణం జరుగుతుంది. పనిలో ఉన్నప్పుడు గాసిప్ లో భాగం కావడం మానుకోండి. ఇది మిమ్మల్ని నిరాశ పరుస్తుంది. మీరు మంచి ఉద్దేశ్యంతో ఎవరైనా సహాయం చేస్తారు. మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడం ద్వరా మీ రిలేషన్ షిప్ ను బలోపేతం చేస్తుంది. మొత్తంగా ఈరోజు సానుకూల రోజు కావాలని ప్రార్థనలతో ప్రారంభించండి.

లక్కీ కలర్ : డీప్ బ్లూ

లక్కీ నెంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 5.20 నుండి రాత్రి 8.20 గంటల వరకు

మిధున రాశి మే 21 - జూన్ 20

మిధున రాశి మే 21 - జూన్ 20

మీ షెడ్యూల్ కొన్నిరోజులుగా బిజీగా ఉంటుంది. కానీ మీకు విరామం అవసరమయ్యే అధిక సమయం ఇదే. ఒక చిన్న యాత్రను ప్లాన్ చేయడం ద్వారా మీలో చైతన్యం నింపుతుంది. ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు అదనపు డబ్బును పొందవచ్చు. మీ సానుకూల వైఖరి పనిలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఒత్తిడిని అధిగమించగలుగుతారు. ముఖ్యంగా కార్పొరేట్ రంగంలో పనిచేసేవారు కొందరు పరధ్యానంలో ఉండవచ్చు. మీరు పరిపక్వతతో సవాళ్లను ఎదుర్కోవాలి మరియు అనుభవం ఉన్న వారి సలహా తీసుకోవాలి. మీ ఆర్థిక వ్యవస్థ లేదా జీవన ప్రమాణాల గురించి మాట్లాడటం మానేయండి. తండ్రి ఆరోగ్యంలో మెరుగుదల మీకుటుంబ సభ్యులందరికీ ఉపశమనం కలిగిస్తుంది. మీ భాగస్వామి మీకు సహాయకారిగా ఉంటారు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నెంబర్ : 17

లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు

కర్కాటకరాశి జూన్ 21 - జూలై 22

కర్కాటకరాశి జూన్ 21 - జూలై 22

మీ భాగస్వామి మీకు సహకరించని కారణంగా మీకు ప్రతికూలంగా ఉంటుంది. మీరు మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోలేనందున పెద్ద అల్లకల్లోలం జరిగి అది మీకు కలత కలిగిస్తుంది. మీరు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇది త్వరలో పరిస్థితిని చక్కదిద్దుతుంది. పనిలో ఒత్తిడి వల్ల పరిస్థితులు క్లిష్టంగా మారతాయి. కానీ మీరు దానిని అనుభవించాలి. మీరు ద్విచక్ర లేదా నాలుగు చక్రాల వాహనాన్ని కొనుక్కునే అవకాశం ఉంది. పిల్లలతో విలువైన సమయాన్ని గడపడం చాలా అవసరం. ఆర్థరైటిస్ తో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : వైట్ (తెలుపు)

లక్కీ కలర్ : 4

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:25 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

సింహరాశి : జులై 23-ఆగస్టు 22

సింహరాశి : జులై 23-ఆగస్టు 22

ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు సరైన నిర్ణయం తీసుకుంటారు. దీని తర్వాత ఫలితం వస్తుంది. దగ్గరి బంధువు/స్నేహితుడి నుండి ఆర్థిక సహాయం పొందుతారు. మీ ప్రియమైన వారి సంక్షేమం గురించి ఆలోచిస్తే మీరు మరింత కష్టాల్లో పడతారు. మీ భాగస్వామితో రహస్యాలను పంచుకోండి. పాత స్నేహితులను కలుసుకోవడం ద్వారా ప్రత్యేకంగా అనిపిస్తుంది. బిజీగా ఉన్న ఈరోజులో సాయంత్రం కాస్త మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు కొంత సమయం లభిస్తుంది. వ్యాపార విషయాలు సాధారణంగా ఉంటాయి. రిలేషన్ షిప్ లో ఉన్నవారికి శృంగార సాయంత్రం అవుతుంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నెంబర్ : 24

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 3:45 గంటల వరకు

కన్యా రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్యా రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

మీ ప్రయత్నానికి పనిలో ప్రతిఫలం వస్తుంది. మీ యజమాని మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. మీ సహోద్యోగులు మీ సలహా తీసుకుంటారు. దీంతో మీకు ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి వస్తాయి. కాబట్టి భయపడాల్సిన పని లేదు. మీ వ్యాపారంలో కొత్త ఒప్పందం వస్తుందని మీరు ఊహించినందున ఇది సహకార రోజుగా మారుతుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రణాళిక వేసేవారు విజయవంతమవుతారు. ఎందుకంటే మీ అనుభవం అడుగడుగునా మీకు సహాయపడుతుంది. ఫైనాన్షియల్ గా సాధారణ పరిస్థితులుంటాయి. డబ్బు కోసం పరుగెత్తకండి. అనవసరమైన విషయాల గురించి చింతించడం మానేసి, మంచి జీవితం గడపడానికి ప్రశాంతంగా ఉండండి.

లక్కీ కలర్ : మెజెంటా

లక్కీ నెంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 11.20 వరకు

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఆఫీసులకు వెళ్లే వారికి ఈరోజు లక్కీ డే అవుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. పని వద్ద పరిస్థితులు గందరగోళంగా ఉంటాయి. పబ్లిక్ లో ఉన్నప్పుడు మీ భాషను సరి చేసుకోండి. మీ భాగస్వామిని అపార్థం చేసుకోవడం వల్ల కుటుంబంలో ఒక తప్పు జరుగుతుంది. ప్రజలు మీ సహనాన్ని పరీక్షిస్తారు. మీ సహోద్యోగులతో ప్రధాన సామరస్యానికి రావాలి. వారు ఏమి చెప్పాలనుకుంటున్నారో మీరు అర్థం చేసుకోవాలి. మీ ప్రియమైన వారితో గడపడానికి అద్భుతమైన క్షణాలు లభిస్తాయి. రక్తపోటు(బిపి)తో బాధపడేవారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి.

లక్కీ కలర్ : రెడ్ (ఎరుపు)

లక్కీ నెంబర్ : 19

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు

వృశ్చికరాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చికరాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన రోజు కాదు. మీ ప్రణాళికలను వాయిదా వేసుకోవాలి. మీకు ఊహించని నష్టం వచ్చే అవకాశం ఉన్నందున ఆర్థికంగా ఈరోజు కొంత ఇబ్బందిగా ఉంటుంది. ప్రణాళిక ప్రకారం పనులు కానందున వ్యాపారవేత్తలు అసౌకర్యానికి గురవుతారు. మీరు ఇవన్నీ కుటుంబం ముందు తీసుకెళ్లకూడదు. ఇది పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం కోరడం వల్ల అద్భుతాలు జరుగుతాయి. సమస్య నుండి బయటపడటానికి మీకు సహాయపడతాయి. సాయంత్రం నాటికి శుభవార్త వినిపిస్తుంది. మీ ప్రియమైన వారితో విహారయాత్ర మిమ్మల్ని ఒత్తిడి నుండి బయటపడటానికి సహాయపడుతుంది. ఆరోగ్యం మెరుగుదల వల్ల మీకు మంచి అనుభూతి కలుగుతుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నెంబర్ : 6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:50 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

ధనస్సు రాశి నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి నవంబర్ 22 - డిసెంబర్ 21

వివాహం చేసుకున్న వారికి ఇదొక అందమైన రోజు. ఒకరితో ఒకరు గడపడానికి విలువైన సమయాన్ని పొందుతారు. ఎటువంటి కారణం లేకుండా మీ సమయాన్ని వృథా చేసే వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. మీ పనిపై దృష్టి పెట్టండి. మీ యజమాని కొంతకాలం మీకు దూరంగా ఉ:టాడు. మీ ప్రియమైన వారితో లాంగ్ డ్రైవ్ మీ చింతలను తగ్గిస్తుంది. ఎందుకంటే మీరు చాలా కాలం నుండి అలాంటి క్షణం కోసం ఎదురుచూస్తున్నారు. వ్యాపారవేత్తలకు వారి అంచనాలు ఎక్కువగా ఉన్నందున పరిస్థితులు కఠినంగా ఉంటాయి. అధిక ఖర్చు చేయడం మీ భవిష్యత్తుకు హానికరం. మీ బిజీ షెడ్యూల్ కారణంగా రోజు చివర్లో అసౌకర్యంగా అనిపించడం సాధారణం.

లక్కీ కలర్ : లేత గోధుమ రంగు

లక్కీ నెంబర్ : 30

లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి ఉదయం 10:25 గంటల వరకు

మకర రాశి డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి డిసెంబర్ 22 - జనవరి 19

పనిలో ఉన్నప్పుడు వచ్చే గాసిప్ లు మరియు వాదనలకు దూరంగా ఉండండి. మీ సహచరులు మీ పురోగతి పట్ల సంతోషంగా ఉండరు. మిమ్మల్ని వెనక్కి లాగేందుకు ప్రయత్నించవచ్చు. మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రమాదకరంగా మారుతుంది. మీ భాగస్వామితో సాయంత్రం వరకు ఒక చిన్న సమావేశాన్ని నిర్వహించడానికి మీరు ప్లాన్ చేస్తారు. ఇది మీ తల్లిదండ్రులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. పెండింగులో ఉన్న కేసు నుండి మీరు బయటపడతారు. కాబట్టి చట్టపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీ ప్రియమైన వారిని అపార్థం చేసుకోవడం వల్ల మీకు చిరాకు కలుగుతుంది. మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు అనుభవం ఉన్నవారి వ్యక్తుల సలహా తీసుకోండి

లక్కీ కలర్ : ఫేడెడ్ ఎల్లో (క్షీణించిన పసుపు)

లక్కీ నెంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

భవిష్యత్తు కోసం ప్రణాళిక ప్రారంభించే ముందు ఆర్థికంగా బలంగా ఉండాలి. మీరు సవాలు చేసే దశకు వెళ్లొచ్చు. కానీ సహనంతో ఉండటం మంచిది. పిల్లలు మిమ్మల్ని వారి రోల్ మోడల్ గా చూస్తారు. క్రీడల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రకాశవంతమైన రంగులతో వస్తారు. వ్యాపారవేత్తలు భారీ లాభం పొందుతారు. కార్పొరేట్ రంగంలో ఉన్న వారు చిన్న బ్రేక్ లేదా స్నేహితులతో విహారయాత్ర కోసం చూస్తారు. ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉండండి. వారు మీ సమయాన్ని వృధా చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడటం వల్ల మీకు మంచి అనుభూతి కలుగుతుంది.

లక్కీ కలర్: గ్రీన్

అదృష్ట సంఖ్య: 9

అదృష్ట సమయం: ఉదయం 5:55 నుండి 9:30 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

జీవితంలో అల్లకల్లోలం అనిశ్చితి ఉంటుంది. కాబట్టి దానికి అలవాటు పడటానికి వేచి ఉండండి. మీరు కష్టపడి, మీ పనులలో నిజాయితీగా ఉంటే విజయం మిమ్మల్నే వరిస్తుంది. మీ జీవిత భాగస్వామి మీకు మద్దతు ఇవ్వడం ద్వారా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీ దూకుడు ప్రవర్తనపై మీరు తప్పక పని చేయాలి. మీ ప్రియమైన వారితో విలువైన సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒక విదేశీ పర్యటన మీ మార్గంలోకి వస్తుంది. ఇది మీ బిజీ షెడ్యూల్ నుండి విరామం లభించేలా చేస్తుంది. వ్యాపారవేత్తలకు సాధారణ పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నవారు తమ పనితో పోరాడతారు. మీరు మీ తోబుట్టువులతో పాత సమస్యన పరిష్కరిస్తారు. ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నెంబర్ : 28

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9.25 గంటల వరకు

Read more about: astrology horoscope zodiac signs
English summary

Daily Horoscope September 12, 2019

Which signs are better if they postpone things? Do job efforts result? Can students excel in education? Is it convenient to express love? Travels & Travels Overseas Is it better to postpone? Investing in Business or Not? Read the full details of today's Bold Sky offerings in order to get a detailed look at the legal, court proceedings, property disputes, fortune teller, fortune teller, fate.
Story first published: Thursday, September 12, 2019, 6:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more