For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శనివారం మీ రాశిఫలాలు (14-09-2019)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

జ్యోతిష్యం, సెప్టెంబర్ 14వ తేదీ

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, భాద్రపదమాసం, ద్వాదశి బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి..

మేషరాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేషరాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేషరాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మీకు పెండింగ్ పనులు లేదా కట్టుబాట్లు లేనందున ఈరోజు విశ్రాంతిగా ఉంటుంది. మీ యజమానికి మీకు రివార్డ్ ఇస్తారు. మీ భాగస్వామి సహకారంతో భవిష్యత్ పెట్టుబడుల గురించి మీరు ఆలోచిస్తారు. అందుకే, ఈరోజు మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు పని నిమిత్తం ప్రయాణించి భారీ లాభం పొందుతారు. మీ సానుకూల ప్రవర్తన మీ జీవితంలో ఏవైనా మార్పులను తెస్తుంది. మీ ప్రియమైన వారికి ఖరీదైన బహుమతి ఇవ్వడం వల్ల మిమ్మల్ని ఒకరికొకర్ని దగ్గర చేస్తుంది. మీ తండ్రి మీకు మీకు బలమైన సపోర్ట్ గా ఉంటారు. ఈరోజు మీ ప్రియమైన వారితో శృంగార వారం అవుతుంది. మీ సంకల్ప శక్తి తగినంత బలంగా ఉన్నందున మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉదయం నడక లేదా వ్యాయామంతో మీ రోజును ప్రారంభించండి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 8 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

మీ సహచరులు మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తారు. మీరు దానిని తెలివిగా నిర్వహించాలి. కార్పొరేట్ రంగంలో ఉన్న వారు ఉద్యోగ మార్పు కోసం ప్లాన్ వేస్తారు. ఆర్థిక పరంగా సాధారణ రోజుగా ఉంటుంది. మీ దగ్గరి బంధువు ఏదైనా సహాయం కోరవచ్చు. మీరు చేయాల్సిన పనులు షెడ్యూల్ లో ఉన్నప్పటికీ అవి కార్యరూపం దాల్చవు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం ఒడిదుడుకులకు గురవుతుంది. కానీ, మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ ప్రియమైన వారు మిమ్మల్ని శృంగార విందు కోసం తీసుకెళతారు. జిడ్డు గల ఆహారం తీసుకోవడం మానుకోండి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నెంబర్ : 8

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి 7 గంటల వరకు

మిధున రాశి మే 21 - జూన్ 20

మిధున రాశి మే 21 - జూన్ 20

వ్యాపారవేత్తలకు ఇది ఒక అద్భుత రోజుగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని పొందుతారు కాబట్టి, ఇది మీకు రిలాక్స్ గా ఉంటుంది. మీరు బ్లాక్ చేసిన డబ్బును అనుకోకుండా పొందుతారు కాబట్టి ఇది ఆర్థిక పరంగా అనుకూలమైన రోజు అవుతుందని మీరు భావిస్తున్నారు. మీ దగ్గరి బంధువు లేదా స్నేహితుడు ఆర్థిక విషయాలలో మీకు సహాయపడవచ్చు. ఇది దీర్ఘకాలంలో లాభదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ఇంక్రిమెంటుతో పాటు బోనస్ కూడా లభిస్తుంది. బీమా రంగంలో ఉన్నవారికి శుభవార్త అందుతుంది. మీ సోదరి మీ పెళ్లికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబాన్ని ఒప్పించడానికి కూడా సహాయపడుతుంది. డయాబెటిక్ రోగులు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామి సంరక్షణ మరియు అవగాహన కోసం కొంత విలువైన సమయాన్ని గడపాలని భావిస్తారు.సాయంత్రం మీకు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నెంబర్ : 7

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:20 గంటల వరకు

కర్కాటకరాశి జూన్ 21 - జూలై 22

కర్కాటకరాశి జూన్ 21 - జూలై 22

మీరు బ్లాక్ చేసిన డబ్బు అంతా మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మీకు ఆర్థిక పరంగా లాభదాయకమైన రోజు అవుతుంది. మీరు కూడా అవసరమైన వారికి సహాయం చేస్తారు. దగ్గరి బంధువు యొక్క జోక్యం కుటుంబంలో సంఘర్షణకు ప్రధాన కారణం అవుతుంది. విపరీతమైన పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ, మీరు రిలాక్స్ మరియు పాజిటివ్ అవుతారు. పనిలో మీరు శ్రద్ధ చూపేవారు కాబట్టి మీ యజమాని మీకు అనుకూలంగా ఉంటారు. మీరు ఊహించని ఒప్పందాన్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నందున వ్యాపారవేత్తలు బిజీగా ఉంటారు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్ వస్తుంది. మొత్తంగా మీ మానసిక స్థితిని పెంచుతుంది. మీ భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. కొత్త జంటకు శృంగారానికి కలసి వస్తుంది. ఆరోగ్యం పట్ల ర్లక్ష్యం చిన్న సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ కలర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 11:45 నుండి సాయంత్రం 6:30 వరకు

సింహరాశి : జులై 23-ఆగస్టు 22

సింహరాశి : జులై 23-ఆగస్టు 22

మీరు తలనొప్పి లేదా ఇతర కారణాల వల్ల అనారోగ్యంగా ఉండటం వల్ల ఇది ఒత్తిడితో కూడిన రోజు అవుతుంది. మీ సహోద్యోగులు మిమ్మల్ని పనిలో నిర్లక్ష్యం చేస్తారు. మీ యజమాని మీకు వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా, ఇది ఆందోళనకు దారి తీయొచ్చు. త్వరలో విషయాలు మెరుగుపడతాయి. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా మరి ఓపికగా ఉండాలి. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఓ విషయం గురించి అనుమానిస్తారు. ఇది రిలేషన్ షిప్ లో చీలికకు కారణమవుతుంది. మీ తండ్రి ఆరోగ్యం క్షీణిస్తుంది. మీరు వ్యాపారంలో పెద్ద నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది మీ భవిష్యత్తుకు ఆందోళన కలిగిస్తుంది. ఇది ఆర్థిక పరంగా నెమ్మదిగా ఉండే రోజు అవుతుంది. మీ బెస్ట్ ఫ్రెండ్ మిమ్మల్ని ముంచెత్తుతుంది. మీ రహస్యాలను కుటుంబానికి తెలియ జేస్తుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నెంబర్ : 24

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:45 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కన్యా రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్యా రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈరోజు పనిలో సవాలుగా ఉంటుంది. మీ ప్రాజెక్టు కొంతకాలం నుండి టచ్ చేయబడలేదు. దాని గురించి ఆలోచించబడుతుంది. ఇది మీ రోజు కానందున, కొత్త ప్రారంభ లేదా ఏదైనా భాగస్వామ్య వ్యాపారం కోసం చేస్తున్న ప్లాన్ ను మానుకోండి. చిన్నవాదనలు మీ భాగస్వామితో పెద్ద పోరాటానికి దారి తీయవచ్చు. కాబట్టి మీ కుటుంబ జీవితం చాలా సున్నితంగా ఉండదు. మీ పిల్లలు కూడా మీకు మద్దతు ఇవ్వరు. మొత్తంగా కుటుంబంలో సమన్వయ లోపం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో అద్భుతమైన ఫలితాన్ని చూపుతారు. ఇది మీకు గర్వంగా అనిపిస్తుంది. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు, లేదా నడుస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం మెరుగుపడటం వల్ల మీకు మంచి అనుభూతి కలుగుతుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నెంబర్ : 24

లక్కీ టైమ్ : ఉదయం 9:00 నుండి రాత్రి 8:20 వరకు

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

మీరు ఈరోజు ఎక్కువగా కష్టపడతారు. వర్క్ హాలిక్ కావడానికి ఇది ఒక మంచి సమయం. వ్యాపారవేత్తలు బిజీగా మరియు లాభదాయకమైన రోజును కలిగి ఉంటారు. ఉమ్మడి వ్యాపారంలో ఉన్నవారు మీ పనిని త్వరలో విస్తరించాలని యోచిస్తారు. మీరు మీ డబ్బును సమయానికి అందుకున్నందున ఈరోజు ఆర్థిక పరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి చాలా సహాయకారిగా మరియు శ్రద్ధగా ఉంటారు. మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుందని మీరు రిలాక్స్ అవుతారు. మీ ప్రియమైన వారు శృంగార విందును ప్లాన్ చేస్తారు. మరియు మీకు కూడా ప్రతిపాదించే అవకాశం ఉంది. వేడిని తగ్గించేందుకు హైడ్రేటెడ్ గా ఉండండి.

లక్కీ కలర్ : మెజెంటా

లక్కీ నెంబర్ : 2

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 8 గంటల వరకు

వృశ్చికరాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చికరాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఆరోగ్యం మెరుగుపడటం వల్ల మీరు మంచి అనుభూతి చెందుతారు. మీరు పనిలో ఉత్సాహంగా ఉంటారు. మీ సహచరులు మరియు మీ యజమానితో మీ సంబంధాలను మెరుగుపరుస్తుంది. వ్యక్తిగతంగా అంతరాన్ని తగ్గించండంలో ఫలప్రదంగా ఉంటుంది. గతంలో మీరు మొరటుగా ప్రవర్తించినందుకు మీరు మీ ప్రియమైన వారికి క్షమాపణలు చెబుతారు. మీ తల్లిదండ్రులు మీ కృషిని అభినందిస్తారు. ఆర్థికంగా మీకు సహాయం చేస్తారు. కొన్ని నిర్ణయాలు తీసుకోవటానికి మీ పిల్లలు మీకు సహాయం చేస్తారు. మంచి ఫలితాల కోసం అవసరమైన వారికి బట్టలు దానం చేయండి.

లక్కీ కలర్ : ఇండిగో

లక్కీ నెంబర్ : 16

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి 3:30 వరకు

ధనస్సు రాశి నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి నవంబర్ 22 - డిసెంబర్ 21

మీరు మొరటుగా ప్రవర్తించడం వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారని భావిస్తారు. మీ సహోద్యోగులు పనిలో వారి మధ్య విభేదాలకు

మీరు ఓ కారణం అయినందున మీకు వ్యతిరేకంగా ఉంటారు. ఆఫీస్ పాలిటిక్స్ మీకు అనుకూలంగా ఉండవు. మీ భాగస్వామి మీపై కోపం తెచ్చుకుంటారు. మీ పిల్లలు మీ ప్రవర్తనను సహించరు. దూకుడుగా ఉంటారు. మీరు మీ తండ్రితో వాదనకు దిగే అవకాశం ఉంది. అది అతని ఆరోగ్యాన్ని క్షీణిస్తుంది.

లక్కీ కలర్ : వైన్

లక్కీ నెంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2:15 గంటల వరకు

మకర రాశి డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి డిసెంబర్ 22 - జనవరి 19

వ్యాపారవేత్తలకు లాభదాయకమైన రోజు అవుతుంది. ఆర్థిక పరంగా ఒక సాధారణ రోజు మీకు రిలాక్స్ గా అనిపిస్తుంది. తల్లిదండ్రులు గర్వంగా భావించేలా విద్యార్థులు విద్యాపరంగా అనూహ్యంగా రాణిస్తారు. మీరు ఒక చిన్న కుటుంబంలో కలిసి ఉండటానికి ఒక భాగం కావచ్చు. ఇది మీకు విశ్రాంతిని ఇస్తుంది. ఇది మీకు ఆరోగ్యకరమైన రోజు అవుతుంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నెంబర్ : 27

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కొంచెం ఓపిక అద్భుతాలు చేయగలదు. మీరు ఆహ్లాదకరమైన మానసిక స్థితిలో ఉంటారు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఆర్థిక పరంగా మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు పనికి సంబంధించిన యాత్రను ప్లాన్ చేస్తారు. వైద్య నేపథ్యం నుండి వచ్చిన విద్యార్థులు చాలా అద్భుత ప్రద్శనలు చేస్తారు. వారి తల్లిదండ్రులను గర్వించేలా చేస్తారు. మీరు మీ ఆలోచనలను దగ్గరి బంధువుతో పంచుకుంటారు. కొన్ని విషయాలపై మార్గదర్శకత్వం కోసం కూడా ప్రయత్నిస్తారు. మీ యజమాని మద్దతుగా ఉంటాడు. పని గురించి మీ సలహాలను పరిశీలిస్తాడు. దంపతుల మధ్య అవగాహన వికసిస్తుంది. మీ కోసం ఒక శృంగార విందు రోజు అవుతుంది. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. లాంగ్ డ్రైవ్ మానుకోండి.

లక్కీ కలర్: కుంకుమ

అదృష్ట సంఖ్య: 38

అదృష్ట సమయం: మధ్యాహ్నం 2:15 నుండి రాత్రి 7:20 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీ భాగస్వామి మద్దతుతో మీ స్థలం యొక్క ఇంటీరియర్లను మార్చడానికి మీరు ప్లాన్ చేస్తారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం ఒడిదుడుకులకు గురవుతుంది. ముఖ్యంగా గుండె రోగులను ఇది కలవరపెడుతుంది. క్రీడా ప్రేమికులు అద్భుతమైన పనితీరును చూపిస్తారు. దీంతో వారి తల్లిదండ్రులకు గర్వంగా అనిపిస్తుంది. మీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. మీరు పాత ఆస్తిని అద్దెకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నందున ఇది ఆర్థిక రంగంలో లాభదాయకమైన రోజు అవుతుంది. వ్యాపార వేత్తలకు అద్భుతమైన రోజు అవుతుంది. మీ ప్రియమైన వారు మీకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తారు. మీ తోబుట్టువు ముఖ్యమైన ఆర్థిక విషయాలకు సంబంధించి మీ సలహాను తీసుకుంటారు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నెంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 6:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు

Read more about: astrology horoscope zodiac signs
English summary

daily-Horoscope September 14, 2019

Which signs are better if they postpone things? Do job efforts result? Can students excel in education? Is it convenient to express love? Travels & Travels Overseas Is it better to postpone? Investing in Business or Not? Read the full details of today's Bold Sky offerings in order to get a detailed look at the legal, court proceedings, property disputes, fortune teller, fortune teller, fate.
Desktop Bottom Promotion