For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుక్రవారం మీ రాశిఫలాలు (18-09-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, అశ్వీయుజమాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope September 18, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

'బతుకమ్మ'ఈ ఏడాది ఎందుకని ఆలస్యమైంది? ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా...'బతుకమ్మ'ఈ ఏడాది ఎందుకని ఆలస్యమైంది? ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు చాలా బద్ధకంగా ఉంటారు. ఉద్యోగులు ఈరోజు చాలా విషయాల్లో నిరాశ చెందుతారు. కార్యాలయంలో తమ సహోద్యోగులతో మంచి సంబంధాలు పెట్టుకోవాలి. వ్యాపారులు వ్యాపారులకు ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు ఏదైనా కొత్త పని చేయాలనుకుంటే, మీరు మంచి ప్రయోజనం పొందొచ్చు. ఈ సమయంలో మీరు ఆర్థిక విషయాలలో ఎలాంటి రిస్క్ తీసుకోకపోతే మంచిది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా బయటి ఆహారం తీసుకోకుండా ఉండాలి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 37

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. మీ సానుకూల ఆలోచనల వల్ల ప్రజలు బాగా ప్రభావితమవుతారు. మీ గౌరవం కూడా పెరుగుతుంది. మరోవైపు ఈరోజు ఆర్థిక పరంగా ఈ రోజు అప్రమత్తంగా ఉండాలి. తొందరపడి పెట్టుబడులు పెట్టడం మానుకోండి. వ్యాపారులు ఈరోజు మీ ఫీల్డ్‌కు సంబంధించిన కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను మీరు కలవవచ్చు. ఈ సమావేశంతో మీ కెరీర్ కొత్త మలుపు తీసుకుంటుంది. వ్యాపారులకు ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఈరోజు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు పెండింగులో ఉన్న ఆదాయం లభిస్తుంది. ఈ రోజు మీరు సోదరుడి నుండి కూడా ప్రయోజనం పొందవచ్చు. ఈరోజు మీకు పనిభారం ఎక్కువగా ఉంటుంది. మీరు ఇలాంటి సమయంలో మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపాలి. రియల్ ఎస్టేట్కు సంబంధించిన ఏదైనా విషయంలో మీరు విజయం సాధించే అవకాశం ఉంది. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కష్టంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ వివాహం మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. మీరు మీ ప్రియమైనవారిని ప్రేమతో చూసుకోవాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

2020లో అధిక మాసం ఎప్పుడొచ్చింది.. ఈ మాసంలో శుభకార్యాలు చేయొచ్చా? చేయకూడదా?2020లో అధిక మాసం ఎప్పుడొచ్చింది.. ఈ మాసంలో శుభకార్యాలు చేయొచ్చా? చేయకూడదా?

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు మానసికంగా కొంత గందరగోళంగా ఉంటుంది. అయితే మీరు సానుకూలంగా ఉంటారు. మీరు మీ పనిని శ్రద్ధగా చేయడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగులు ఆఫీసులో కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీరు ఉన్నత స్థానం పొందవచ్చు లేదా మీకు కావలసిన బదిలీ లభిస్తుంది. ఈ రోజు వ్యాపారులకు చాలా ముఖ్యమైనది. మీరు ఏదైనా చట్టపరమైన విషయంలో విజయం సాధించవచ్చు. మీరు కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈరోజు మీ వివాహ జీవితానికి సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు చాలా సందర్భాలలో సానుకూల ఫలితాలను పొందుతారు. ఈరోజు మీ ఇంటి వాతావరణం మెరుగ్గా ఉంటుంది. ఈరోజు పని విషయంలో చాలా బిజీగా గడుపుతారు. ఆఫీసులో మీకు పనిభారం ఎక్కువగా ఉంటుంది. అయితే, మీకు ఏ పనిలోనూ అడ్డంకులు ఉండవు. మీరు మీ పనిని సులభంగా పూర్తి చేయగలరు. వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు భాగస్వామ్యంతో పనిచేస్తే, మార్పు సంకేతాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీరు ఈరోజు చాలా చురుగ్గా ఉంటారు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారిలో నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగం గురించి ఓ శుభవార్త వినిపిస్తుంది. రాబోయే రోజుల్లో మీరు ఆశించిన విధంగా ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీరు సౌందర్య సాధనాలు, బట్టలు లేదా ఆహార పదార్థాలలో వ్యాపారం చేస్తే ఈ రోజు మీరు పెద్ద ఆర్థిక ప్రయోజనాన్ని పొందవచ్చు. మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ప్రేమపూర్వక రోజు గడుపుతారు. పిల్లలకు సంబంధించిన ఆందోళన నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. మీరు వారికి మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు చాలా శక్తివంతంగా మరియు సానుకూలంగా ఉంటారు.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 7 గంటల వరకు

ఈ రాశుల వారు వారి తప్పులను అంగీకరించరు లేదా ఎప్పటికీ సరిదిద్దుకోరు ...!ఈ రాశుల వారు వారి తప్పులను అంగీకరించరు లేదా ఎప్పటికీ సరిదిద్దుకోరు ...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు అకస్మాత్తుగా ప్రతికూలతలను ఎదుర్కొంటారు. ఇలాంటి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీకు తెలియకుండానే ఒకరి మనోభావాలను దెబ్బతీయవచ్చు. అయితే పని విషయంలో మీరు ఈరోజు ఉత్తమమైనదాన్ని ఇవ్వగలుగుతారు. మీకు సీనియర్ అధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ రోజు వ్యాపారులకు కొంత టెన్షన్ ఉంటుంది. మీరు నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : లైట్ రోజ్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 10 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పనిభారం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు చాలా బిజీగా ఉంటారు. అయితే, మీరు మీ తరపున కష్టపడి పనిచేస్తారు. మీకు కార్యాలయంలోని ప్రతి ఒక్కరితో మంచి సంబంధాలు ఉంటాయి. అవసరమైతే, మీరు సహోద్యోగులతో పాటు ఉన్నతాధికారుల మద్దతు కూడా పొందుతారు. వ్యాపారులకు ఈ రోజు కూడా శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీరు ఆర్థిక ప్రయోజనం పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. సహనంతో వ్యవహరిస్తే, మీరు ఈ విషయాన్ని సులభంగా పరిష్కరించవచ్చు. మీ జీవిత భాగస్వామితో అనవసరంగా వాదించడం మానుకోండి. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీరు మీ జీవిత భాగస్వామితో అసభ్యంగా ప్రవర్తించకుండా ఉండాలి. మీరు ఈ పరిస్థితిని సకాలంలో నిర్వహించకపోతే, భవిష్యత్తులో మీరు విచారం మాత్రమే అనుభవిస్తారు. వ్యాపారులు ఈరోజు ఎలాంటి ప్రత్యేక లాభాలను పొందలేరు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఈరోజు మీరు పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయగలరు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 10 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇలాంటి సమయాల్లో మీరు సానుకూలంగా ఉండాలి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, లేకపోతే మీ దూకుడు స్వభావం మిమ్మల్ని ఈ రోజు పెద్ద ఇబ్బందుల్లో పడేస్తుంది. సహచరులు మరియు ఉన్నతాధికారులతో గొడవ పడకుండా ఉండండి. మీ పనిపై దృష్టి పెట్టాలి. వ్యాపారులు ఈరోజు ఆర్థికంగా లాభం పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో సమస్య ఉండొచ్చు. మీ నిర్ణయాలతో కుటుంబం ఏకీభవించకపోవచ్చు. ముఖ్యంగా మీకు తల్లిదండ్రుల మద్దతు లభించదు. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీ కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తెలుసుకోవడం మంచిది. ఆఫీసులో ఉద్యోగులకు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, వ్యాపారం చేసిన వ్యక్తులు సరైన ఆలోచనతో సరైన దిశలో ముందుకు సాగాలి. మీరు ఖచ్చితంగా విజయం పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. అయితే మీరు పొదుపుపై కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యం విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు ఆహ్లాదకరమైన ఫలితాన్ని పొందుతారు. మీ ఆరోగ్యం ఈరోజు బాగుంటుంది. మీరు ఈ రోజును పూర్తిగా ఆనందిస్తారు. మీరు కుటుంబంతో చాలా ఆనందిస్తారు. ఈ రోజు మీరు మీ పనులన్నీ వేగంగా పూర్తి చేస్తారు. మీ కృషి ఆఫీసులో ప్రశంసించబడుతుంది. వ్యాపారులు ఆర్థికంగా లాభపడతారు. మీరు కళలతో లేదా విద్యతో సంబంధం కలిగి ఉంటే, ఈ రోజు మీకు చాలా ముఖ్యమైనది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఈ రోజు పెద్దగా ఖర్చులు ఉండవు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 7 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope September 18, 2020

Reading your daily horoscope is the easiest way to get all the important information related to your life. Let's see what's in your fate. The position of planets and stars will have an impact on your life and therefore, there will be success and well as challenges. Know what lies in your fate today!
Story first published:Thursday, September 17, 2020, 22:03 [IST]
Desktop Bottom Promotion