For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శనివారం మీ రాశిఫలాలు (21-09-2019)

|

జ్యోతిష్యం, సెప్టెంబర్ 21వ తేదీ

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, భాద్రపదమాసం, ద్వాదశి బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి..

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈరోజు మీ స్వభావం మీకు ఇబ్బంది కలిగించేలా చేస్తుంది. కాబట్టి ఎక్కువ సమస్యలను తట్టుకోవాలి. వాదనలో భాగం కావడం మానుకోండి. ముఖ్యంగా పనిలో పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. మీ మొరటు ప్రవర్తనను మీ కుటుంబం అంగీకరించదు. కార్పొరేట్ లో ఉన్నవారికి ఇది సవాలుగా ఉండే రోజు అవుతుంది. టీమ్ సహకారం లేని కారణంగా మీరు విసుగు చెందొచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం పెద్ద ఆందోళన కలిగిస్తుంది. మీ ప్రియమైన వారు చిన్న సమస్యలకే కోపం తెచ్చుకోవచ్చు. పరిస్థితులను సాధారణం చేసేందుకు మీరు పెద్ద ప్రయత్నం చేయాలి. ఫైనాన్షియల్ విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. ఎందుకంటే అధిక వ్యయం మీ బడ్జెట్ కు భంగం కలిగిస్తుంది. నిద్రలేమి లేదా ఆందోళనతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఉదయాన్నే ఓ శుభవార్త మీకు ఆశ్చర్యం కలిగించడంతో మీరు రిఫ్రెష్ అవుతారు. కుటుంబంలో చాలా అనుకూలమైన వాతావరణం మిమ్మల్ని బలంగా మరియు సానుకూలంగా ఉంచుతుంది. మీరు ఆర్థిక పరంగా దగ్గరి బంధువుకు సహాయం చేస్తారని భావిస్తున్నారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడటం మీకు హాయిగా అనిపిస్తుంది. కొన్ని ప్రశాంతమైన ప్రదేశాలకు మీరు చిన్న యాత్ర చేయడం అవసరం. వ్యాపారవేత్తలు వారికి ఆసక్తిని కలిగించే కొత్త ప్రాజెక్టును చూస్తారు. పైనాన్షియల్ పరంగా మీకు అనుకూలమైన రోజు. పాత అప్పుల నుండి బయటపడటానికి సహాయపడుతుంది. కుటుంబంలో అందరితోనూ పరస్పరం చర్చించడం ప్రయోజకరంగా ఉంటుంది. మంచి ఫలితాల కోసం మీ రోజును యోగాతో ప్రారంభించేలా చూసుకోండి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 44

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

మీరు కష్టపడి పనిచేసే స్వభావం చాలా కాలం తర్వాత ఆర్థిక సమస్యలను వదిలించుకోవడానికి సహాయం చేస్తుంది. ఒక ముఖ్యమైన పని ప్రారంభానికి ముందు మీ తల్లిదండ్రులు సలహా తీసుకోండి. చట్టపరమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సుదీర్ఘ పోరాటం తర్వాత చివరకు ఉపశమనం పొందుతారు. ఆరోగ్యంగా ఉండటానికి మీరు మరింత కష్టపడాలి. ఎందుకంటే ఇది చాలా ప్రాధాన్యత కలది. ప్రశాంతంగా మరియు ఓపికగా ఉండండి. కుటుంబంలో పెండింగులో ఉన్న పని మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీ జీవిత భాగస్వామి కలత చెందుతారు. మీరు తప్పనిసరిగా అవసరానికి అనుగుణంగా విషయాలు నిర్వహించాలి.రిలేషన్ షిప్ లో ఉన్నవారు అపార్థాలను అధిగమించి కొన్ని ప్రత్యేక క్షణాలను గడుపుతారు.

లక్కీ కలర్ : బాటిల్ గ్రీన్

లక్కీ నంబర్ : 29

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 10:30 వరకు

కర్కాటక రాశి : జూన్ 21-జులై22

కర్కాటక రాశి : జూన్ 21-జులై22

విద్యార్థులకు అదృష్టం కలిసి రావడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీలో కొందరు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని అనుకోవచ్చు. కుటుంబంతో విలువైన సమయాన్ని గడపడం వారికి చాలా అవసరం. మీ భాగస్వామి అంతులేని మద్దతు కారణంగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కొతగా పెళ్లి చేసుకున్నవారికి పరిస్థితులు భిన్నంగా కనిపిస్తాయి. కాని సమయంతో సర్దుబాటు చేస్తారు. మీరు పనిలో వివాదాస్పదంగా ఉంటారు. ఎందుకంటే మీ తెలివైన వైఖరి ప్రజలను ఆకట్టుకుంటుంది. మీ తోబుట్టువుతో మీ సంబంధాన్ని మెరుగుపరచడం వల్ల కుటుంబంలో అదృష్టాన్ని తెస్తుంది. పెద్దవారికి చాలా రిలాక్స్ గా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 1

లక్కీ టైమ్ : ఉదయం 10:05 నుండి సాయంత్రం 4 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

మీరు పనిలో చురుకుగా ఉంటారు. మీ సానుకూల ప్రవర్తన కారణంగా ప్రశంసలు అందుకుంటారు. మీరు ఇంతకుముందు పెట్టిన పెట్టుబడి మంచి ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక రంగంలో లాభదాయకమైన రోజు అవుతుంది. మీరు పబ్లిక్ ఫోరమ్ లో మాట్లాడే ముందు రెండుసార్లు ఆలోచించండి. సమస్యలను పరిష్కరించేందుకు మీ యజమానితో దూరంగా ఉండాలని. మీ భాగస్వామికి ప్రత్యేకమైన అనుభూతిని కలిగించడానికి మీరు ఒక ప్లాన్ చేస్తారు. మీ బెస్ట్ ఫ్రెండ్ తో సమయం గడపడం మీకు ఉత్తమ చికిత్సలాగా అనిపిస్తుంది. మీరు షాపింగ్ కు వెళ్లొచ్చు. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. రిలేషన్ షిప్ లో ఉన్నవారికి జీవితం ట్రాక్ లో ఉంటుంది. కాసేపు అలసిపోయిన తర్వాత మీకు మంచి అనుభూతి కలుగుతుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 4:40 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

కన్యా రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్యా రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

మీరు అసహనంతో ఉన్నందున రిలేషన్ షిప్ నిర్వహించే విషయంలో కష్టంగా ఉంటుంది. నూతన వధూవరులు ఒకరితో ఒకరు నాణ్యమైన సమయాన్ని గడపడం ద్వారా తమ బంధాన్ని బలోపేతం చేసుకోవాలి. ఒక చిన్న యాత్ర ప్లాన్ చేసుకుంటే మంచిది. పెద్దల కోసం మత యాత్రను ప్లాన్ చేయడం వారికి దైవిక అనుభూతిని కలిగిస్తుంది. ప్రజల నుండి ఏదో ఆశించడం మానేయండి. ఎందుకంటే ఇది మీకు బాధ కలిగిస్తుంది. పనిలో అలసిపోయే రోజు. కార్పొరేట్ రంగంలో ఉన్న వారు ఓవర్ టైం పని చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి బదిలీ అవకాశం ఉంది. మీ తోబుట్టువుతో పాత సమస్యను పరిష్కరించడం మీకు రిలాక్స్ గా అనిపిస్తుంది. మీ భాగస్వామి గృహ వస్తువుగా ఖరీదైన దాన్ని డిమాండ్ చేస్తారు.

లక్కీ కలర్ : వైలెట్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : సాయంత్రం 4 :30 నుండి రాత్రి 8 గంటల వరకు

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

మీలో కొంతమంది కుటుంబ పరంగా అసౌకర్యానికి గురవుతారు. మీరు ఊహించిన విధంగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ భాగస్వామి మద్దతుతో పాటు మీరు పరిస్థితిని తెలివిగా నిర్వహించాలి. బయటి వ్యక్తి మీ వ్యక్తిగత డొమైన్ లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అది ఎవరైనా అంగీకరించరు. ఫైనాన్షియల్ గా ఒక కఠినమైన రోజు కాబట్టి అందుకు అనుగుణంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. చుట్టుపక్కల వ్యక్తుల నుండి ఏదైనా ఆశించడం మానుకోండి. పనిలో విషయాలు సవాలుగా ఉంటాయి. మీ యజమాని చిన్న విషయాలపై కోపం తెచ్చుకుంటారు. ఉద్యోగ మార్పు మీ మనసులో ఉంది. యాత్రలతో స్నేహితులతో వెళ్లాలని విద్యార్థులు పట్టుబట్టవచ్చు. ఆరోగ్యం మెరుగుపడటం వల్ల మీకు రిలాక్స్ గా అనిపిస్తుంది. ప్రజలకు మార్గనిర్దేశం చేసే అదృష్టం మీకు ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వ్యాపార పరంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీరు ఈ దశలో ఆనందంగా పనిని పూర్తి చేస్తారు. ఆర్థికంగా పరిస్థితులు మెరుగుపడతాయి. మిమ్మల్ని అప్పుల నుండి విముక్తి పొందేలా చేస్తాయి. మీ భాగస్వామితో భవిష్యత్తు గురించి ఆలోచించడం సంపన్నంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టడానికి రెండుసార్లు ఆలోచించండి. ఎందుకంటే ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆలోచించడం ముఖ్యం. మీ ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా ఉండటం వల్ల అసౌకర్యంగా ఉంటారు.

లక్కీ కలర్ : మస్టర్డ్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి ఉదయం 11:25 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ప్రయాణానికి ఈరోజు అనుకూలమైన రోజు. పరిస్థితి అనుకూలంగా ఉన్నందున అధికంగా ఖర్చు చేయడం మంచిది కాదు. ఫైనాన్షియల్ పరిస్థితులు నిర్వహించడం కష్టం. అనుభవదారుల సలహా తీసుకోవడం మంచిది. ఇది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. మీ వ్యక్తిగత సమస్యలు మీ వృత్తి జీవితానికి ముడి పెట్టొద్దు. ఆర్థరైటిస్ తో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. పనిలో ఒక సాధారణ రోజు అవుతుంది. మీరు సాధించాల్సిన ప్రధాన లక్ష్యాలు చాలా ఉంటాయి. జ్యువెలరీ వ్యాపారంతో సంబంధం ఉన్నవారు భారీ లాభం పొందుతారు. మీరు ఈరోజు తెలియని వ్యక్తికి సహాయం చేస్తారు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మీరు మీ వర్తమానంపై దృష్టి పెట్టడం మంచిది. మీ రేపటి గురించి ఆలోచించడం కూడా చాలా ముఖ్యం. మీరు పనిని నిర్వహించడం కష్టమనిపించవచ్చు. మీరు తెలివిగా మరియు ఓపికగా వ్యవహరించాలి. మీ భాగస్వామితో విషయాలను చర్చించడం మీకు చాలా సౌకర్యంగా ఉంటుంది. కుటుంబంలో ఈరోజు శాంతంగా ముగుస్తుంది. వ్యాపారవేత్తలకు భారీ లాభం ఉంటుంది. మీ తోబుట్టువుల మానసిక స్థితి మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. కార్పొరేట్ సంస్థలో ఉండే వారికి ఓ సమస్య చుట్టుముడుతుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారు బదిలీని ఆశించవచ్చు. పాత సలహాలోని ఓ భాగం మీకు ఇలాంటి సమయంలో బాగా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

లక్కీ కలర్ : రెడ్ బ్లడ్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి ఉదయం 11:15 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

మీ తల్లిదండ్రులు మార్గదర్శక కారకంగా ఉంటారు. ఒక ప్రధాన సమస్యను పరిష్కరించడంలో మీకు సహాయం చేస్తారు. పనిలో కొన్ని సానుకూల విషయాలు మీకు కలిసివస్తాయి. మిమ్మల్ని మీ బాస్ అభినందిస్తారు. కార్పొరేట్ రంగంలో ఉన్నవారు ప్రయాణంలో బిజీగా ఉంటారు. విద్యార్థులు ఒత్తిడి నుండి బయటకు వస్తారు. చాలా కాలం తర్వాత కొంత శాంతిని పొందుతారు. మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే వాటిపై అప్రమత్తంగా ఉండండి. రక్తపోటు(బిపి)తో బాధపడేవారు ఒత్తిడి మరియు గొడవలలో భాగం కాకుండా ఉండాలి. మీ జీవిత భాగస్వామి సహాయంగా ఉంటుంది. ఇదికి మీకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. మొత్తానికి పరిస్థితులు సాధారణంగా మారతాయి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి ఉదయం 11 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

కుటుంబంతో విలువైన సమయాన్ని గడపడం వంటి ప్రాముఖ్యతను మీరు గ్రహిస్తారు. మీ ప్రియమైన వారితో విలువైన సమయాన్ని గడపడంతో ఈరోజు సంతోషకరమైన రోజు అవుతుంది. మీ తోబుట్టువుతో అపార్థానికి మీరు దూరంగా ఉంటారు. ఇది ప్రతి ఒక్కరికీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆర్థిక రంగంలో పరిస్థితులు సజావుగా ఉంటాయి. మీరు పాత అప్పుల నుండి ఉపశమనం పొందుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యంలో మెరుగుదల చూడటం మీకు ప్రత్యేకమైనది. వ్యాపారవేత్తలకు సాయంత్రానికి లాభదాయకంగా ఉంటుంది. భవిష్యత్తుకు ఉపయోగపడే పఠన కళను అభివృద్ధి చేయండి. కొత్త క్రీడను ఎంచుకోవడం లేదా మీ రోజును నడకతో ప్రారంభించడం చాలా బాగుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు

English summary

Daily Horoscope September 21, 2019

Which signs are better if they postpone things? Do job efforts result? Can students excel in education? Is it convenient to express love? Travels & Travels Overseas Is it better to postpone? Investing in Business or Not? Read the full details of today's Bold Sky offerings in order to get a detailed look at the legal, court proceedings, property disputes, fortune teller, fortune teller, fate.
Story first published: Saturday, September 21, 2019, 6:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more