Latest Updates
-
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి.. -
అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..? -
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు -
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే?
వైరల్ : కన్న కూతురి కాపురాన్ని కూల్చి... అల్లుడితో ఆ సంబంధం కొనసాగించి.. ఓ బిడ్డకు జన్మనిచ్చి..
లారెన్ వాల్ కు చిన్నప్పటి నుండి అందరిలాగే తాను కూడా ఘనంగా పెళ్లి చేసుకోవాలని కలలు కంటూ ఉండేది.
ఈ ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నెన్నో వింతలు విశేషాలు వింటూ ఉంటాం. లేదా చూస్తూ ఉంటాం. అయితే ఇలాంటి వింత సంఘటనను మాత్రం మీరెప్పుడూ చూసి ఉండరు. అందరి తల్లులు లాగానే ఆ తల్లి కూడా తన బిడ్డలకు ఘనంగా పెళ్లి చేయాలనుకుంది.
కూతురు, అల్లుడితో స్నేహపూర్వకంగా ఉంటూనే.. కన్న కూతురి కాపురంలోనే కలహాలు తెచ్చి పెట్టింది ఓ కన్నతల్లి. అంతేకాదు ఆ కూతురి భర్తతోనే ఏకంగా కొత్త కాపురం పెట్టేసింది. అంతేకాదు ఏకంగా అతనితో ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చేసింది. ఈ సంఘటన చాలా సంవత్సరాల క్రితమే జరిగింది. అయితే ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అదీ కూడా స్వయంగా తన కూతురే స్వయంగా సోషల్ మీడియాలో ఈ సంఘటన గురించి షేర్ చేసుకోవడంతో ఒక్కసారిగా ఇది వైరల్ అయిపోయింది. ఇందుకు సంబంధిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ స్టోరీని పూర్తిగా చూడండి...

లారెన్ వాల్ కల..
లారెన్ వాల్ కు చిన్నప్పటి నుండి అందరిలాగే తాను కూడా ఘనంగా పెళ్లి చేసుకోవాలని కలలు కంటూ ఉండేది. ఇదే విషయాన్ని తన తల్లితో చెప్పగా.. ఆమె తల్లి తన కూతురి కలను నిజం చేసింది.

2004లో వివాహం..
2004 సంవత్సరంలో దాదాపు 14 లక్షల రూపాయలను ఖర్చు పెట్టి వివాహం జరిపించింది. దీంతో లారెన్ తెగ సంబరపడి పోయింది. జీవితాంతం తన తల్లిని తాను అస్సలు కష్టపెట్టకూడదని నిర్ణయించుకుంది. తనని ఎంతో ప్రేమగా చూసుకోవాలని భావించింది.

హనీమూన్ కు ఆమెను కూడా...
అయితే అమ్మ మీద ప్రేమతో.. ఆమెను ఒంటరిగా వదిలి వెళ్లడం ఇష్టం లేక.. తన భర్తతో పాటు తల్లిని హనీమూన్ కు తీసుకెళ్లింది. అయితే అప్పటి నుండి అసలు కథ మొదలైంది. అప్పుడు ఆమె పెద్ద తప్పు చేస్తున్నట్లు గ్రహించలేకపోయింది.

కూతురికి తెలియకుండానే..
కొత్తగా పెళ్లి చేసుకుని హానీమూనులో హాయిగా ఎంజాయ్ చేస్తున్న ఆ జంట మధ్య తన తల్లే విలన్ గా మారిపోయింది. తన కూతురికి తెలియకుండా అల్లుడిని ఎప్పుడు బుట్టలో వేసుకుందో తెలిదు.

అకస్మాత్తుగా గర్భం..
అంతవరకు తన భర్తతో స్నేహపూర్వకంగా మాత్రమే ఉందనుకున్న లారెన్ కు ఒక్కసారిగా షాక్ కొట్టినంత పని అయ్యింది. తన తల్లి గర్భం దాల్చిందనే విషయం తెలియగానే తాను తట్టుకోలేకపోయింది.

తల్లిని నిలదీసింది..
అంతవరకు వారి మధ్య ఉన్న వివాహేతర సంబంధాన్ని గుర్తించలేకపోయిన లారెన్ తన తల్లిని నిలదీసింది. అయితే తొలుత తన తల్లి జూలీ నిజం ఒప్పుకోలేదు. అల్లుడికి తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ వచ్చింది.

అసలు విషయం తెలిశాక..
అయితే నిజం నిప్పు లాంటిది కదా. ఎంత దాచినా దాగదు. అలాగే కొన్నిరోజుల తర్వాత అల్లుడితో తన అమ్మ వివాహేతర సంబంధం గురించి అసలు విషయం తెలుసుకుంది.

ఎప్పటికీ క్షమించను..
ఈ విషయం తెలుసుకున్నప్పటీ ఆ కూతురు చాలా బాధపడింది. ‘‘మనం ఎవరి మీద అయితే ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటామో.. అక్కడే మోసం జరుగుతుందని గ్రహించింది. తన తల్లిని ఎప్పటికీ క్షమించలేను‘‘ అని పేర్కొంది.

తొలి ఏడాదిలోనే..
2004లో లారెన్ కు పెళ్లి అవ్వగా.. 2005లో ఆమె తల్లి జూలీ ఒక బిడ్డకు జన్మను ఇచ్చింది. ఈ విషయం తెలుసుకుని లారెన్ తట్టుకోలేకపోయింది. తన గుండె కంపించినంత పని అయిపోయింది. ఆ తర్వాత లారెన్ భర్తతో విడాకులు తీసుకుని విడిపోయింది.

ఆ తల్లి మళ్లీ పెళ్లి...
అయితే 2009లో లారెన్ తల్లి జూలీ లారెన్ భర్త పౌలీని వివాహం చేసుకుంది. ఇక్కడ విశేషం ఏంటంటే తన తల్లి పెళ్లికి లారెన్ కూడా హాజరైంది. అలా వారిద్దరూ ఐదేళ్ల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్నారు.

10 ఏళ్ల పాటు తనలోనే..
తాను ఎవరిని అయితే వివాహం చేసుకున్నానో అతడినే తన తల్లి మళ్లీ పెళ్లి చేసుకోవడాన్ని లారెన్ తనలోనే దాచుకుంది. ఎవ్వరికీ చెప్పుకోలేదు.

తాజాగా సోషల్ మీడియాలో...
అయితే ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అయిపోయింది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.



Click it and Unblock the Notifications

