For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

International Daughters day 2023: డాటర్స్ డే ఎప్పుడొస్తుంది? ఈరోజు ప్రత్యేకతలేంటి?

|

Daughters Day 2023:ఆడపిల్ల ఇంట్లో ఉందంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉందనుకోవాలి. అంతేకాదు ఆ ఇంట్లో అనునిత్యం వెలుగు పంచేది కూడా ఆడపిల్లే. ఆమె భారమని భావిస్తే ఈ ప్రపంచమే ఉండదని మనం గుర్తించాలి. కానీ ఒకప్పుడు అమ్మాయిలు అంటే కేవలం మగపిల్లలకు కనే యంత్రాల్లాగా భావించేవారు.

Daughters Day When and Why We Celebrated

ఇది అమ్మాయిల్లో ఆత్మన్యూనతను పెరిగేలా చేస్తుంది. అంతేకాదు మగాళ్లు చేసే పనులను వారు చేయలేరని.. వారిని చిన్నచూపు చూసేలా చేస్తుంది. అంతేకాదు.. అమ్మాయిల జనాభాను తగ్గించడంతో పాటు లింగ వివక్షకూ, భ్రూణ హత్యలకు కారణమైంది.

Daughters Day When and Why We Celebrated

అయితే ఈ సమస్య కేవలం ఒక్క భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోని అనేక దేశాల్లో కూడా ఉండేది. అందుకే ఆడపిల్లల్లో ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు.. అమ్మాయిలు అబ్బాయిల కంటే ఏ మాత్రం తక్కువ కాదని తెలిపేందుకు.. కూతుళ్లు కూడా కుమారుల కంటే ఏ మాత్రం తక్కువ కాదని తెలిపేందుకు.. మగవారితో సమానమని అందరూ గుర్తించేలా చేయాలని చెబుతూ కొన్ని దేశాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

Daughters Day When and Why We Celebrated

ఏది ఏమైనప్పటికీ... మీ జీవితంలోకి అడుగుపెట్టిన మీ చిట్టి తల్లిని.. మీరు ఓ వరంలా భావిస్తే.. మీరు కూడా డాటర్స్ డేని సెలబ్రేట్ చేసుకోవచ్చు. సాధారణంగా ఆడపిల్లల కోసం.. ఓ రోజంటూ ఏర్పాటు చేసుకుని దాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతిరోజూ ఆడపిల్లలదే. వాళ్లతోనే ఆనందం.. వారి వల్లే ఇళ్లలో సంతోషం ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.

Daughters Day When and Why We Celebrated

అమ్మాయిల ప్రాధాన్యాన్ని వివరించే ఈరోజును సెలబ్రేట్ చేసుకోవడం.. వారి స్థాయిని మరింత పెంచడమే అవుతుంది. వారికి తగిన గౌరవాన్ని ఇవ్వడంతో పాటు వారికి అందించాల్సిన ప్రేమను అందిస్తామని ప్రమాణ చేస్తూ డాటర్స్ డే(సెప్టెంబర్ 26వ తేదీన) సెలబ్రేషన్స్ ను ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మీ చిన్నారి తల్లిని ఆనందపడేలా శుభాకాంక్షలు చెప్పేయండి.

Daughters Day When and Why We Celebrated

ఆడపిల్ల గురించి ప్రపంచానికి చాటి చెప్పే ప్రత్యేకమైన రోజు కూతుళ్ల దినోత్సవం (Daughters Day). ఒక కొడుకు తల్లిలాగా.. ఓ సోదరిలాగా.. తండ్రికి నీడలా.. తల్లికి తోడుగా.. అన్నదమ్ములకు అండగా ఉండే చిన్నారి తల్లికి ప్రేమను పంచడంతో పాటు.. పురిట్లోనే ఆ పిల్లను చిదిమేసే కొందరికి.. ఆమె లేకుంటే లోకమే లేదని చెప్పడమే ఈరోజు యొక్క ప్రత్యేకం. ఇలాంటి గొప్పదనం ఉన్న రోజును ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నాలుగో ఆదివారం నాడు 'డాటర్స్ డే'గా జరుపుకుంటున్నారు.

ఈ సందర్భంగా బోల్డ్ స్కై తెలుగు తరపున ఆడపిల్లలందరికీ 'డాటర్స్ డే శుభాకాంక్షలు'...

English summary

Daughters Day 2023: When and Why We Celebrated

Here we talking about daughters day 2020 when and why we celebrated. Read on
Desktop Bottom Promotion