For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Happy Daughters’ Day 2021 : మీ చిట్టితల్లికి విషెస్ చెప్పండి... వారిని సర్ ప్రైజ్ చేయండి...!

|

మన దేశంలో ఆడపిల్లలను ధనలక్ష్మీగా భావిస్తారు. కూతురు(Daughter) పుట్టిందంటే చాలు సాక్షాత్తూ లక్ష్మీ దేవి తమ ఇంట అడుగుపెట్టిందని ఆనందంగా ఫీలవుతుంటారు. అంతేకాదు వారి ఇంటికి ఎంతో వెలుగొచ్చినట్టు చాలా మంది భావిస్తారు. ఎవరైనా పొరపాటున ఆమె భారమని భావిస్తే మాత్రం ఈ ప్రపంచమే ఉండదు. 'వినాస్త్రీయ జననం నాస్తి, వినాస్త్రీయ గమనం నాస్తి, వినాస్త్రీయ జీవం నాస్తి, వినాస్త్రీయ సృష్టి ఏవన్నాస్తి' అంటే స్త్రీ లేకపోతే జననం లేదు.. స్త్రీ లేకపోతే గమనం లేదు.. స్త్రీ లేకపోతే జీవం లేదు.. స్త్రీ లేకపోతే అసలు ఈ సృష్టే లేదు. అలాంటి ఈ సృష్టికి మూలం స్త్రీ.

ఏ ఇంట్లో అయినా కూతురంటే తల్లికి ప్రతిరూపం. ప్రతి ఒక్క తల్లి మనల్ని కంటికి రెప్పలా ఎలా కాపాడుతుందో.. కూతుర్ని కూడా అంతే ప్రేమతో చూసుకోవాలి. మన ఇళ్లలో ఎంత మంది మగపిల్లలు ఉన్నప్పటికీ.. ఒక్క కూతురు ఉంటే చాలు.. ఆ కళే వేరుగా ఉంటుంది. సాధారణంగా అమ్మాయిల కోసం.. ప్రత్యేకంగా ఓ రోజంటూ ఏర్పాటు చేసుకుని, దాన్ని వేడుకగా జరుపుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ప్రతిరోజూ ఆడవారిదే.. వారితో ఆనందం... ఇంటిల్లిపాది సంతోషం.

అయితే అమ్మాయిల ప్రాధాన్యాన్ని వివరించే ఈ రోజును సెలబ్రేట్ చేసుకోవడం.. వారి స్థాయిని మరింత పెంచడమే అవుతుంది. కాబట్టి వారికి తగిన గౌరవాన్ని అందించడంతో పాటు తనకు అందించాల్సిన ప్రేమను అందిస్తామని ప్రమాణం చేస్తూ ఈ డాటర్స్ డేను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ డాటర్స్ డే సెప్టెంబర్ 26వ తేదీన జరుపుకుంటారు. ఈ సందర్భంగా మీ చిన్నారితల్లిని ఆనందపరిచే విషెస్ ఎలా చెప్పాలో మేము ఓ జాబితా తయారు చేశాం... వాటిలో మీకు నచ్చిన మెసెజెస్.. ఫొటోలను.. కోట్స్ ను సెలెక్ట్ చేసుకోండి... మీ బంధుమిత్రులు, మీ గారాలపట్టితో షేర్ చేసుకోండి...

లవ్ యు రా..

లవ్ యు రా..

బాధల్లో ఉన్నప్పుడు సంతోషాన్నిచ్చావు...

ఆపద వచ్చినప్పుడు అండగా నిలిచావు..

నా ఆనందాన్ని రెట్టింపు చేశావు..

అద్భుతమైన కూతురిగా నడుచుకున్నావు..

నీకు ధన్యవాదాలు. లవ్ యు రా..

హ్యాపీ డాటర్స్ డే...

నా బంగారు తల్లి..

నా బంగారు తల్లి..

నేను నిన్ను రోజురోజుకీ ఎక్కువగా ప్రేమిస్తున్నా..

నువ్వు నా కూతురువి మాత్రమే కాదు..

మంచి బుద్ధులు, ప్రవర్తనతో నడుచుకుంటూ..

నేనేప్పుడూ గర్వించేలా చేయి నా బంగారు తల్లి.

హ్యాపీ డాటర్స్ డే.

నీ మీద ప్రేమ పెరుగుతోంది..

నీ మీద ప్రేమ పెరుగుతోంది..

ఎన్ని రోజులు గడిచినా.. నెలలు, సంవత్సరాలు మారినా..

నీ మీద ప్రేమ పెరుగుతోంది తప్ప తగ్గదు.

మన మధ్య ఎప్పటికీ విడదీయలేని బంధం ఉంది.

దీని గురించి కేవలం తల్లీకూతుళ్లకే అర్థమవుతుంది.

హ్యాపీ డాటర్స్ డే..

ఆనందంతో ఉప్పొంగిపోతోంది..

ఆనందంతో ఉప్పొంగిపోతోంది..

నువ్వు రోజురోజుకీ ఎంతో ఎత్తుకు ఎదగడం చూసి..

నా మనసు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోతోంది..

నాలో మరింత కష్టపడాలనే కోరిక కూడా పెరుగుతోంది..

నువ్వు నా కూతురిగా పుట్టడం నా అదృష్టం..

ఎంత ప్రేమిస్తారో తెలియాలంటే..

ఎంత ప్రేమిస్తారో తెలియాలంటే..

ఒక తల్లి లేదా తండ్రి తన బిడ్డను ఎంత ప్రేమిస్తారో తెలియాలంటే..

నువ్వు ఓ తల్లి కావాల్సిందే.. లవ్ యూ సో మచ్ స్విటీ. హ్యాపీ డాటర్స్ డే..

నీ ప్రతిరూపం..

నీ ప్రతిరూపం..

నా మదిలో శాశ్వతంగా ఉంటుంది నీ ప్రతిరూపం..

ప్రతిరోజూ గుర్తు చేసుకోవడమే నా కర్తవ్యం..

హ్యాపీ డాటర్స్ డే

మరపురాని ఓ జ్ణాపకం..

మరపురాని ఓ జ్ణాపకం..

కూతురు పుట్టిన క్షణం..

మరచిపోలేని మధురమైన అనుభవం..

అంతులేని అనురాగం.. మరపురాని ఓ జ్ణాపకం..

హ్యాపీ డాటర్స్ డే...

నిండు నూరేళ్లు..

నిండు నూరేళ్లు..

నా గారాల పట్టి.. నా చిట్టి తల్లి

నువ్వు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో..

హాయిగా ఆనందంగా జీవితం గడపాలని కోరుకుంటూ...

మీ అమ్మానాన్న..

హ్యాపీ డాటర్స్ డే.

నా చిట్టి తల్లి చిరునవ్వులో..

నా చిట్టి తల్లి చిరునవ్వులో..

కూతురంటే కష్టం కాదని..

కూతురంటే వజ్రం కన్నా ఎక్కువని..

నా చిట్టి తల్లి చిరునవ్వులో స్వర్గం కూడా కనబడుతుందిరా..!

మా చిట్టి తల్లి నవ్వు..

మా చిట్టి తల్లి నవ్వు..

ఈ లోకంలో అందమైనది పువ్వు..

కానీ నాకు మాత్రం అందమైనది మా చిట్టి తల్లి నవ్వు..

హ్యాపీ డాటర్స్ డే..

English summary

Daughters Day 2021: Wishes, messages, Images, quotes, facebook and whatsapp status in telugu

Here are the daughters day 2020 : wishes, messages, images, quotes, facebook and whatsapp status. Take a look