For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమావాస్య సూర్యగ్రహణం వల్ల ఏ రాశులకు అదృష్టం, ఏ రాశులకు నష్టమో తెలుసా ?

|

డిసెంబర్ 26 న గ్రహణం అరుదైన సూర్య గ్రహణం,అసాధారణ సూర్యగ్రహణం. ఇది మార్గశిర అమావాస్య గురువారం వచ్చింది. ఈ సారి సంపూర్ణ సూర్యగ్రహణం భారతదేశ దక్షణ భాగంలో కనిపిస్తుంది. ఈ గ్రహణం, స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ వికారి నామ సంవత్సరం మార్గశిర బహుళ అమావాస్య నాడు, మూలా నక్షత్రంలో ధనస్సు రాశియందు తీపాధాధిక కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణంగా సంభవించనుంది. గ్రహణ సమయం విషయానికి వస్తే, ఉదయం 8.07కు ప్రారంభమవుతుందని, 9.31 గంటలకు మధకాలమని, 11.20కి ముగుస్తుందని, మొత్తం 3.09 గంటల పాటు గ్రహణం ఉంటుందని అంటున్నారు.

మూల నక్షత్రం మకర, కుంభ లగ్నాలలో ధనుస్సు రాశిలో త్రిపాదాధిక కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం భార‌తదేశం, శ్రీలంక‌, కొన్ని గ‌ల్ఫ్ దేశాలు, సుమ‌త్రా, మ‌లేషియా, సింగ‌పూర్‌ల‌లో కనిపించనుంది. కాగా 16ఏళ్లకు ఒకసారి మాత్రమే ఇలాంటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇక ఈ గ్రహణం కొన్ని రాశుల వారిపై ఎఫెక్ట్ చూపనుంది. ధనస్సు రాశిలో ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఆ రాశి వారు దీనిని చూడకపోవడమే మంచిది. అలాగే అష్టమ స్థానంలోనూ, అర్ధాష్టమ స్థానంలో ఈ గ్రహణం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి.. వృషభ రాశి, కన్యా రాశి వారు దీనిని చూడకపోవడమే మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

ఈ గ్రహణంపై పంచాంగకర్తలు వివరణ ఇస్తూ, ఏ రాశివారికి మేలు కలుగుతుంది, ఏ రాశి వారికి ఎటువంటి ప్రభావం ఉంటుందన్న అంశంపై వివరణ ఇస్తున్నారు.

ఇక ఈ గ్రహణం వృషభం, కన్య, తుల, కుంభ రాశులవారికి శుభ ఫలితాలను అందిస్తుందని చెబుతున్నారు. ఇదే సమయంలో మేషరాశి వారికి చింత, మిధున రాశి వారికి స్త్రీ కష్టం, కర్కాటక రాశి వారికి అతి కష్టం, సింహ రాశి వారికి అశాంతి, వృశ్చిక రాశి వారికి ధన వ్యయం, ధనస్సు రాశి వారికి ప్రాణహాని, మకర రాశి వారికి ఆరోగ్య హాని, మీన రాశి వారికి మనోవ్యధను కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు. గ్రహణ సమయంలో దైవారాధనతో చెడు ఫలితాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.

గమనిక: డిసెంబరు నెలలో పై గ్రహ ప్రభావం వలన సూర్య గ్రహ ప్రభావం వలన ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాం. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. ప్రతి వారికి జరుగుతున్న దశ అంతర్దశ నక్షత్ర ప్రభావమును బట్టి ఫలితాలు నిజానికి నిర్ణయం అవుతాయి. మన భావాలను సానుకూల దృక్పథంతో నడిపించడానికి ఈ గోచార ఫలితాలను పరిశీలించవలసి ఉంటుంది. కానీ వీటిపైనే పూర్తిగా ఆధారపడి ఉండకూడదు.

మేష రాశి

మేష రాశి

మేష రాశి వారికి కి అష్టమాధిపతి స్వ రాశిలో ఉండటం వలన సానుకూల ఫలితాలు తప్పకుండా వస్తాయి. మానసిక పరమైన ఆలోచనలో మార్పు గోచరిస్తుంది. జనవరి నుండి మీ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వెలుగులోకి తీసుకు వచ్చి కొత్త సంవత్సరం ప్రారంభాన్ని అభివృద్ధి ప్రయాణం లాగా ఆనందంగా గడపండి.

వృషభ రాశి

వృషభ రాశి

వృషభ రాశి వారి అష్టమ భావములలో ఏర్పడుతున్న గ్రహముల కూటమి ప్రభావం వలన జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. సప్తమాధిపతి కుజుడు తన రాశిలో ఉండటం వలన కుటుంబ సభ్యుల సహకారాన్ని అందిపుచ్చుకుని సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి.

మిధున రాశి :

మిధున రాశి :

మిధున రాశి వారు ఆవేశం అదుపులో పెట్టుకుని మృదువైన మాట తీరుతో కాలం గడపండి. తొందరపడి బాంధవ్యాలను తెంచుకోకండి.

ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. త్వరలో మీరు స్థిరమైన బంధాలను ఏర్పరచుకోవడానికి చక్కని అవకాశం ఉంది. వచ్చే సంవత్సరంలో మీ మాట బలం వలన మంచి ఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి :

కర్కాటక రాశి :

కర్కాటక రాశి వారు ఏ విధంగా ఆలోచనలు వెళ్తాయో ఫలితాలు కూడా అదే విధంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కనుక సానుకూల దృక్పథంతో అన్ని అనుకూలమైన ఆలోచనలతో ముందుకు సాగండి. అదృష్ట కాలాన్ని అనవసరమైన అనుమానాలతో పాడు చేసుకోకండి. మానసికమైన ఆందోళనలు దరిచేరకుండా ధ్యాన మార్గం అవలంబించండి.

సింహరాశి

సింహరాశి

సింహరాశి వారు ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగాలు మొదలగు విషయాలలో జాగ్రత్త వహించండి. జనవరి నుండి మీకు , మీ సంతానానికి తప్పకుండా లక్ష్యం సాధించడానికి 100% అవకాశం ఉంటుంది.. తాత్కాలికంగా ఇప్పుడు వచ్చే అనిశ్చితమైన పరిస్థితిని మనోధైర్యంతో నిబ్బరంగా ఎదుర్కోవడం మీ మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఒత్తిడిని సానుకూలంగా మార్చుకుని విజయం సాధించడం మీ చేతుల్లోనే ఉంది.

కన్యా రాశి:

కన్యా రాశి:

కన్యా రాశి వారు అర్ధాష్టమ శని తొలగిపోయే రోజులు. ఈ ఒత్తిడిని తట్టుకుని అనుకూలంగా మార్చుకోగలిగితే విజయం మీదే.

తులారాశి:

తులారాశి:

తులారాశి రాశి ద్వితీయ అధిపతి కుజుడు అద్వితీయము లోనే ఉండటం వలన సుఖమైన కాలం. అభివృద్ధి దాయకం. శాంతి సౌఖ్యం. ప్రస్తుత పరిణామాలను గమనిస్తూ భవిష్యత్తుకు బాటలు వేసుకోండి .

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి రాజ్యాధిపతి కుజుడు సొంత రాశిలో ఉండటం వలన, ద్వితీయ అధిపతి గురుడు ద్వితీయంలో ఉండటం వలన రాబోయే సంవత్సరం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది అనేది వీరి చేతుల్లోనే ఉంటుంది. అదృష్ట సమయం అని చెప్పాలి.

ధను రాశి:

ధను రాశి:

ధను రాశి వారికి అత్యంత ఒత్తిడికి , ఆందోళనకు, అనిశ్చిత త్వం ఈ రాశి వారి లో గమనిస్తాం.

వీరికి ఇది నిజంగా పరీక్షా కాలమే. జరుగుతున్న పరిణామాలను మనసుకు పట్టించుకోకుండా డా ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తే మీరు తప్పకుండా వచ్చే సంవత్సరం నుండి ప్రశాంతంగా ఉంటారు.

మకర రాశి

మకర రాశి

మకర రాశివారికి గుర్తింపులు పొంద లేరు , అత్యధిక వ్యయం. నిరాశ చెందకుండా జనవరి మాసం వరకు కాలం గడపడం వలన మంచి ఫలితాలు ఏర్పడతాయి. మీ ఓరిమే మీకు శ్రీరామరక్ష.

కుంభరాశి:

కుంభరాశి:

కుంభరాశి ఈ రాశి వారికి అత్యంత అదృష్టం అయినా కాలం గా చెప్పుకోవచ్చును. అన్ని గ్రహాలు కలసివచ్చిన కుంభ, మీనరాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువ ఈ సంవత్సరం అంతా అత్యంత శుభదాయకం

మీనరాశి

మీనరాశి

ఈరాశి వారికి వృత్తి ఉద్యోగాలలో మంచి అవకాశం ఉంటుంది. శాంతితో ఓపకితో కాలం గడపండి. జనవరి వరకు కొన్ని విషయాలను వాయిదా వేయండి. మీ సృజనాత్మకతను, నిర్ణయాలను వచ్చే సంవత్సరం ఉపయోగించుకోండి.

ఈ సంవత్సరం ఈ సూర్య గ్రహణం వల్ల 12 రాశుల వారు సూర్యుడికి జపం చేయించుకోవాలి ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉండటం వలన 12 రాశుల వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది సూర్యుడికి రాహుకేతువుల కి జప తర్పణ హోమాలు దానాలు చేయడం చాలా మంచిది వీలైతే శివుడికి రుద్రాభిషేకం చేయించడం మంచిది

English summary

26 December 2019 Solar Eclipse Effect On Zodiac Sign

If you believe in astrology here are December 26 solar eclipse effect on zodiac sign have a look.
Story first published: Thursday, December 26, 2019, 7:32 [IST]