Latest Updates
-
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే..
Dhanu Rasi Ugadi Rasi Phalalu 2022: ‘శుభకృత’ ఏడాదిలో ధనస్సు రాశి వారి జాతకం ఎలా ఉంటుందంటే...!
2022లో ఉగాది పండుగ సందర్భంగా ధనస్సు రాశి వారి జాతకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మరి కొద్ది రోజుల్లో మనం తెలుగు సంవత్సరంలో చివరి మాసానికి మరికొన్ని రోజుల్లో వీడ్కోలు పలకబోతున్నాం. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 2వ తేదీన అంటే శనివారం నాడు మనం తెలుగు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం.

'ఫ్లవ' నామ సంవత్సరానికి ముగింపు పలికి 'శుభకృతు' నామ సంవత్సరానికి స్వాగతం పలుకనున్నాం. ఇది మన 60 సంవత్సరాల్లో 36వ సంవత్సరంగా పండితులు చెబుతున్నారు.

శాస్త్రాల ప్రకారం, 'శుభకృత' నామ సంవత్సరంలో శుభ ఫలితాలు వస్తాయి. దుఃఖాలు తొలగిపోతాయి. కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసి అన్ని పంటలు మనకు లభిస్తాయట. ఆహార పంటలతో పాటు ఇతర పంటల ఉత్పత్తులు కూడా బాగా దొరుకుతాయట.

ఇదిలా ఉండగా.. ఈ ఏడాదిలో కొన్ని అశుభ ఫలితాలు కూడా రానున్నాయట. ఈ ఏడాదిలో కొన్ని ఆటంకాలు, దొంగల భయం ఉంటుందని, ముఖ్యంగా సైబర్ నేరాలు ఎక్కువగా పెరుగుతాయని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. 2022 తెలుగు నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతకం ఎలా ఉంటుంది.. ముఖ్యంగా ధనస్సు రాశి వారికి ఈ ఏడాది ఎలాంటి ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆదాయం-02, వ్యయం-08
ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో ఆదాయం కంటే ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఏడాదిలో ఆర్థిక పరంగా అనేక ఇబ్బందులు వస్తాయి. ఈ రాశి వారికి మూల నక్షత్రం 1,2,3,4 నాలుగు పాదాలు, పుర్వాషాడ నక్షత్రం 1, 2,3,4 నాలుగు పాదాలు, ఉత్తరాషాడ నక్షత్రం ఒకటో పాదంలో మొత్తం 9 నక్షత్ర పాదాలుంటాయి.

రాజపూజ్యం-06, అవమానం-01
ఈ ‘శుభకృత' నామ సంవత్సరంలో ఈ రాశి వారికి గురు గ్రహ ప్రభావం వల్ల 2022 ఏప్రిల్ మాసం నుండి 2023 సంవత్సరంలో మార్చి వరకు శుభ ఫలితాలొస్తాయి. విద్యార్థులకు విద్యా రంగంలో మంచి ఫలితాలొస్తాయి. స్త్రీల పేరిట కొత్త ఆస్తులను, సంపదలను పెంచుకుంటారు. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూలంగా ఉంటుంది. కొత్తగా భూములు విక్రయించేందుకు ఈ ఏడాది సమయం అనుకూలంగా ఉంటుంది.

శని ప్రభావం వల్ల..
తెలుగు నూతన సంవత్సరంలో ధనస్సు రాశి వారికి శని గ్రహం ప్రభావం వల్ల ఏప్రిల్ 2022 నుండి 2023 జనవరి 17వ తేదీ వరకు ప్రతికూల ఫలితాలు ఏర్పడొచ్చు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆటంకాలు ఏర్పడతాయి. అయితే 18 జనవరి 2023 నుండి ఈ రాశి వారికి ఏలినాటి శని దశ పూర్తవుతుంది. ఈ కాలంలో కొత్త ఆదాయ మార్గాలకు అవకాశాలు దక్కుతాయి. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.

రాహు ప్రభావం..
తెలుగు నూతన సంవత్సరంలో రాహూ ప్రభావం వల్ల ఆర్థిక పరంగా ప్రతికూల ఫలితాలు రావొచ్చు. మీరు సంతానం విషయంలో కొన్ని ప్రతికూల వార్తలను వినొచ్చు. మరోవైపు విద్యార్థులు విద్యపై ఆసక్తి చూపుతారు. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. మీకు ప్రైవేట్ ఉద్యోగం లభించొచ్చు.

కేతు ప్రభావం..
ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో కేతువు ప్రభావం వల్ల, సులభంగా ఆదాయాన్ని పొందుతారు. మీకు ఆర్థిక పరమైన విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. డబ్బు ఆదా చేయడంలో నైపుణ్యాలను పెంచుకుంటారు. మీ మాటకు ఇతరులు విలువ ఇస్తారు. మీ సలహాలు, సూచనలకు తప్పకుండా విలువ ఇస్తారు.

పరిహారాలివే..
ఈ సంవత్సరంలో మీరు ప్రతికూల ప్రభావాలను అధిగమించేందుకు పంచమ రాహువు నుండి బయటపడటానికి మంగళవారం, శనివారం రోజున దుర్గాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారికి నిమ్మకాయల మాలను లేదా ఎర్రని పువ్వులతో అంటే గులాబీ లేదా మందార పువ్వులను సమర్పించడం వల్ల మీకు దోషం నుండి విముక్తి లభిస్తుంది. గురు గ్రహం యొక్క అనుగ్రహం పొందడానికి షిరిడి సాయిబాబాను ఆరాధించాలి. అక్కడ శనగలతో తయారు చేసిన నైవేద్యాన్ని తీసుకెళ్లి అక్కడికొచ్చిన భక్తులందరికీ పంచాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి.



Click it and Unblock the Notifications