Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Vastu Tips for Wallet:మీ పర్సులో ఇవి ఉంటే వెంటనే పడేయండి... ఎందుకంటే డబ్బు సమస్యలు పెరుగుతాయట..
మీకు డబ్బు సమస్యలు రాకూడదంటే మీ పర్సులో ఈ వస్తువులను పెట్టుకోవద్దు.
ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం పైసలతోనే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే 'ధనం మూలం ఇదం జగత్' అన్నారు.

మనం ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా జీవించాలంటే అందుకు డబ్బులు చాలా ముఖ్యం. అందుకే ఈ లోకంలోని ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించేందుకు అష్టకష్టాలు పడుతుంటారు. కానీ కొందరు వ్యక్తులు మాత్రం డబ్బును చాలా సులభంగా సంపాదిస్తారు.

ఇదిలా ఉండగా.. మనలో చాలా మంది డబ్బులను వాలెట్, పర్స్ వంటి వాటిలో ఉంచుకుంటాం. వీటిని ఖాళీగా ఉంచుకునేందుకు ఎవ్వరూ అంతగా ఇష్టపడరు. మనలో చాలా మంది వారి వారి అవసరాలకు తగ్గట్టు వాలెట్ లేదా పర్సును వాడుతూ ఉంటారు.

ఇక పర్సులో చాలా మంది డబ్బుతో పాటు క్రెడిట్, డెబిట్ కార్డులు, ఇతర వస్తువులతో వాటితో కలిపి ఉంచుకుంటారు. ఇంకా కొందరైతే తమకిష్టమైన వారి ఫొటోలను లేదా దేవుడి ఫొటోలను కూడా దాచుకుంటూ ఉంటారు. అయితే వాస్తు ప్రకారం మీ పర్సులో కొన్ని వస్తువులను అస్సలు ఉంచకూడదట. అవి ఉంటే మీరు ఎంత కష్టపడి సంపాదించిన సొమ్ము అయినా నీళ్లలా ఖర్చవుతుందట. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయట. మీరు ఎంత ప్రయత్నించినా డబ్బు అనేది మీ వద్ద నిలవదు. అంతేకాదు అనునిత్యం ఆర్థిక సమస్యలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా వాస్తు శాస్త్రం ప్రకారం, పర్సులో ఏయే వస్తువులు ఉంచకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పాత బిల్లులు..
మనలో చాలా మంది వ్యక్తులు దుకాణంలోని బిల్లులు లేదా ఇతర బిల్లులను తమ పర్సులో ఉంచుకుంటారు. వాటిని చూసినప్పుడల్లా నిర్ణీత గడువులోపు వాటిని కట్టేయాలని పర్సులో పెట్టుకుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, పాత బిల్లులను పర్సులో భద్రంగా ఉంచుకోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా పరిగణించబడుతుంది. ఎవరైనా పాత బిల్లులను ఎక్కువ రోజులు తమ పర్సులో ఉంచుకుంటే, అది ఆర్థిక సమస్యలకు దారి తీస్తుంది.

దేవుని ఫొటోలు..
మనలో చాలా మంది ఆధ్యాత్మిక భావాన్ని కలిగి ఉంటారు. అందుకే తమకు ఇష్టమైన దేవుడి ఫొటోను తమతో ఉంచుకుంటే శుభ ఫలితాలొస్తాయని భావిస్తారు. అయితే ఇలా చేయడం పెద్ద పొరపాటు అని నిపుణులు చెబుతున్నారు. మీ పర్సులో ఎట్టి పరిస్థితుల్లో దేవుడి ఫొటోను పెట్టుకోకూడదు. ఇలా చేస్తే అప్పులు పెరిగే ప్రమాదముందని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు.

చనిపోయిన వారి ఫొటోలు..
మనలో చాలా మంది చనిపోయిన వారితో తమకున్న గాఢమైన అనుబంధం వల్ల ఎప్పుడూ తమతోనే ఉండాలని చాలామంది పర్సులో పెట్టుకుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, చనిపోయిన వారి ఫోటోలు ఎప్పుడూ పర్సులో పెట్టుకోకూడదు. ఎందుకంటే వాస్తు రీత్యా పర్సు లక్ష్మీదేవి నివాసంగా పరిగణించబడుతుంది. కాబట్టి చనిపోయిన వారి ఫొటోలను అక్కడ ఉంచడం వల్ల వాస్తు దోషం మరియు డబ్బు సమస్యలు పెరుగుతాయి.

కీ..
మనలో చాలా మంది వ్యక్తులు తమ ఇంటి లేదా కారు, బైక్ కీలను తమ పర్సులో ఉంచుకుంటారు. అలా చేయడం వల్ల చెడు ఫలితాలొస్తాయి. వాస్తు ప్రకారం పర్సులో లోహపు వస్తువులు ఏవీ పెట్టకూడదు. ఇవి ప్రతికూల శక్తిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. దీంతో ధన నష్టం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వస్తువులను పర్సులో ఎప్పటికీ పెట్టుకోవద్దు.

చిరిగిన నోట్లు
చిరిగిన నోట్లను లేదా మురికి పేపర్లను ఎల్లప్పుడూ పర్సులో ఉంచుకోవద్దు. ముఖ్యంగా మీ పర్సును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే అది లక్ష్మీదేవి నివాసం. మీరు మీ పర్సులో ఎక్కువ డబ్బు జోడించాలనుకుంటే, మీరు మీ పర్సులో శ్రీ యంత్రాన్ని ఉంచుకోవచ్చు. ఇది లక్ష్మీదేవి స్వరూపం. ఇది మరింత డబ్బును ఆకర్షిస్తుంది మరియు శ్రేయస్సు మరియు అదృష్టం తెస్తుంది.



Click it and Unblock the Notifications