Latest Updates
-
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్..
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఇలాంటి స్త్రీలను అస్సలే పెళ్లి చేసుకోవద్దు
కొన్ని రకాల స్వభావం కలిగిన స్త్రీలను ఎట్టిపరిస్థితుల్లో పెళ్లి చేసుకోవద్దని, వారి వల్ల మనశ్శాంతి దూరమవడంతో పాటు ఆ బంధం ఎక్కువ కాలం నిలబడదని చాణక్యుడు చెప్పాడు. ఆ స్వభావాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వివాహం బంధం ఎంతో పవిత్రమైనది. ఈ మధురమైన బంధాన్ని ఆస్వాదించడం అంత సులభం మాత్రం కాదు. ఇద్దరు వేర్వేరు వ్యక్తిత్వాలు ఉన్న వ్యక్తులు జీవితాంతం కలిసి మెలిసి ఉండటం ఎలా సాఫీగా ఉంటుంది. ఒడిదొడుకులు ఉంటాయి. ఇద్దరి మధ్య కలహాలూ జరుగుతుంటాయి. అభిప్రాయభేదాలు, అపార్థాలు, గొడవలు వస్తూనే ఉంటాయి. అయితే వాటన్నింటిని తట్టుకునే నిలబడి, వివాహం బంధంలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలి. దాంపత్యబంధం సాఫీగా సాగాలన్నా, ఇద్దరు భాగస్వాములు ఆనందంగా, సాన్నిహిత్యంగా ఉండాలన్నా ఇద్దరు పార్ట్‌నర్‌ల మధ్య మంచి అవగాహన ఉండాలి. ప్రేమ, నమ్మకం, విశ్వాసం ఉండాలి.

వివాహబంధం ఎలా ఉండాలి, ఇద్దరు భాగస్వాములు ఎలాంటి ధోరణి, వ్యక్తితంలో మెలగాలో చాణక్యుడు వివరంగా తన చాణక్య నీతిలో చెప్పాడు. అలాగే కొన్ని రకాల స్వభావం కలిగిన స్త్రీలను ఎట్టిపరిస్థితుల్లో పెళ్లి చేసుకోవద్దని, వారి వల్ల మనశ్శాంతి దూరమవడంతో పాటు ఆ బంధం ఎక్కువ కాలం నిలబడదని చాణక్యుడు చెప్పాడు. ఆ స్వభావాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలివిని చూడండి అందాన్ని కాదు:
జీవిత భాగస్వామి అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందమైన స్త్రీని వివాహం చేసుకోవాలని చాలా మంది పురుషులు కలలుకంటారు. అయితే అందం కంటే వ్యక్తిత్వానికి, తెలివికి ప్రాధాన్యత ఇవ్వాలని చాణక్యుడు చెప్పాడు. అందంగా ఉండి బుద్ధి లేని స్త్రీలను పెళ్లి చేసుకుంటే తర్వాత బాధపడాల్సి వస్తుందని చాణక్యుడు హెచ్చరించాడు. మంచి వ్యక్తిత్వం ఉన్న మహిళను పెళ్లి చేసుకుంటే ఆ బంధం ఆనందంగా ఉంటుందని వివరించాడు.

చెడు కుటుంబ నేపథ్యం ఉన్న స్త్రీల జోలికి వెళ్లొద్దు:
పెళ్లి చేసుకోవాలంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు చెబుతుంటారు. తరాలు చూసేంత సీన్ ఈ మధ్యకాలంలో లేదు. కనీసం ఎలాంటి కుటుంబం, వారి నేపథ్యం ఏమిటి, ఎలా ప్రవర్తిస్తారు లాంటి కొన్ని విషయాలైనా తెలుసుకోవాలి. చెడు కుటుంబ నేపథ్యం ఉన్న ఇళ్ల నుండి వచ్చే స్త్రీల ప్రవర్తన చెడుగానే ఉంటుంది. అది మీకు, మీ బంధానికి, మీ కుటుంబానికి మంచిది కాదు.

మొరటుగా ఉండే వారిని చేసుకోవద్దు:
స్త్రీలు మొరటుగా, అసహ్యంగా ఉంటే వారిని పెళ్లి చేసుకోకపోవడమే మంచిది. మొరటుగా వ్యవహరించే స్త్రీలతో బంధం సాఫీగా సాగదు. చాలా అంశాల్లో రాజీ పడాల్సి వస్తుంది. ఇష్టాలను దూరం చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి స్త్రీలు భర్త సంతోషం కంటే తమ ఆనందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మేము, మనం అనే ధోరణి కాకుండా నేను, నాది, నాకు అనే ధోరణితో ఉంటారు.

చెడు స్వభావమున్న స్త్రీలను పెళ్లి చేసుకోవద్దు:
ప్రతి మనిషికి స్వభావం చాలా ముఖ్యం. స్వభావమే తాను మంచివారో కాదో చెబుతుంది. చెడు స్వభావం కలిగిన వ్యక్తులు సంబంధంలో ఎక్కువ కాలం ఉండలేరు. వారితో సంబంధంలో సంతోషం ఉండదు. కాబట్టి అలాంటి స్త్రీలను పెళ్లి చేసుకోవద్దని చాణక్యుడు చెప్పాడు.

అబద్ధాలకోరులను దూరంగా ఉండాలి:
అబద్ధాలు ప్రతి ఒక్కరూ చెబుతారు. చాలా సందర్భాల్లో అబద్ధాలాడుతుంటారు. అయితే వాటికంటూ ఒక పరిమితి ఉంటుంది. కొన్ని సీరియస్ పరిస్థితుల్లో అబద్ధాలాడటం వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయి. చీటికి మాటికి అబద్ధాలు చెప్పే వారితో బంధం ఏమాత్రం సంతోషంగా ఉండదు. తరచూ అబద్ధాలు చెప్పే వారిని నమ్మలేం. సంబంధానికి నమ్మకం, విశ్వాసం చాలా కీలకం. అవే లేకుంటే ఆ సంబంధం ఎక్కువ రోజులు నిలవదు. అలాంటి స్త్రీలకు దూరంగా ఉండటం మంచిది.

ఇంటి పనుల గురించి తెలియని స్త్రీల జోలికి వెళ్లొద్దు:
చాణక్యుడు చెప్పిన ప్రకారం ఇంటి పనుల గురించి పెద్దగా తెలియని స్త్రీలను పెళ్లి చేసుకోవద్దు. నేటికాలంలో చాలా మంది అమ్మాయిలకు ఎలాంటి ఇంటి పనులు తెలియవు. అలాగని వారిని చేసుకోకుండా ఉండటం అనేది కరెక్టు కాదని కొందరి అభిప్రాయం. చాణక్యుడు చెప్పిన ఈ విషయాన్ని ఇప్పటికీ విశ్వసించే వారు ఉన్నారు.



Click it and Unblock the Notifications
