For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Vastu Tips:నిద్రించే వేళ ఇవి అస్సలు దగ్గర ఉంచుకోవద్దు...! ఎందుకంటే చెడు ఫలితాలొస్తాయట...!

|

మన దేశంలో పూర్వకాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు ఎన్నో సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను ఆచరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రానికి అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఏదైనా ముఖ్యమైన పని చేసేటప్పుడు కచ్చితంగా వాస్తు శాస్త్రంలోని నియమాలను కచ్చితంగా పాటిస్తారు.

ఉదాహరణకు ఇంటి నిర్మాణం సమయంలో, భూమిని కొనుగోలు చేసేటప్పుడు.. పడక గదిలో మంచం ఏ దిశలో ఉండాలనే వాటిపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ప్రతిదీ పక్కాగా ఉంటే తమకు కచ్చితంగా శుభ ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు.

ఇదిలా ఉండగా నిద్రించే సమయంలో మనం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సరైన నిద్ర లేకపోతే ప్రతి ఒక్కరి జీవితంపైనా కచ్చితంగా తీవ్ర ప్రభావమే పడుతుంది. తగినంత నిద్ర పోతేనే మనకు విశ్రాంతి లభిస్తుంది. అంతేకాదు మనకు అలసట అనేది తగ్గిపోయి మనం చేయాల్సిన పనులపై పూర్తి ఫోకస్ పెట్టగలం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, మనం రోజూ నిద్రించే సమయంలో కొన్ని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో దగ్గరగా ఉంచుకోకూడదట. ఆ వస్తువులను పొరపాటు మీరు నిద్రించే చోట ఉంచుకుంటే, మీకు ఆర్థిక, మానసిక సమస్యలు ఎదురవుతాయట. ఈ నేపథ్యంలో నిద్రకు ముందు ఏయే వస్తువులు మన దగ్గర ఉండకూడదు.. వేటిని దూరంగా ఉంచాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Shani Jayanti 2022:శని దేవుని అనుగ్రహం కోసం ఈ పరిహారాలు పాటించండి...

వాలెట్ వద్దు..

వాలెట్ వద్దు..

మనలో చాలా మందికి వాలెట్ వాడే అలవాటు ఉంటుంది. కాబట్టి మీరు నిద్రించే సమయంలో మీ వాలెట్ ను దగ్గర ఉంచుకోవద్దు. ఇది దగ్గరుంటే మీపై ఒత్తిడి పెరిగి రాత్రి నిద్ర పట్టకుండా చేస్తుంది. మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ పర్సును అల్మారాలో లేదా ఇతర సురక్షిత ప్రదేశంలో జాగ్రత్తగా ఉంచాలి.

ఎలక్ట్రానిక్ పరికరాలు..

ఎలక్ట్రానిక్ పరికరాలు..

నిద్రించే వేళ మీ దగ్గర్లో ఫోన్ పెట్టుకోవడం వల్ల ఆరోగ్య పరంగా కూడా ప్రమాదమే. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు కూడా హెచ్చరించారు. ఎందుకంటే ఇందులోని రేడియేషన్ మీకు ఆరోగ్య సమస్యలను కలిగిస్తోంది. అయితే వాస్తు ప్రకారం, ఫోన్ తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను మీ దగ్గర్లో ఉంచుకోవద్దు.

ఫోన్ ను దూరంగా పెట్టండి..

ఫోన్ ను దూరంగా పెట్టండి..

వాస్తు ప్రకారం, ఇలాంటి వాటిని ఉంచడం వల్ల మీలో రాహువు యొక్క చెడు ప్రభావాలను చూపుతుంది. ఎందుకంటే రేడియేషన్ రాహువుకు సంబంధించినదని నమ్ముతారు. ఇది మీ పనిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మీరు పనిపై తగినంత దృష్టి పెట్టలేకపోవచ్చు. అందువల్ల, పనిలో మరిన్ని సంక్షోభాలు ఎదుర్కొంటారు. ఒకవేళ మీరు ఫోన్ దగ్గరగా ఉంచుకుంటే, మీరు మానసిక క్షోభకు గురవుతారు. ఎందుకంటే మీరు నిద్రిస్తున్నప్పుడు, మీ మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసే కొన్ని రకాల ప్రతికూల వార్తలు లేదా సందేశాలను చూస్తారు.

30 ఏళ్ల తర్వాత అరుదైన కలయిక... ఒకేరోజున మూడు పండుగలు.. ఈరోజున దేవుడిని ఆరాధిస్తే దోషాలన్నీ తొలగిపోతాయట...!

పుస్తకాలు పెట్టుకోవద్దు..

పుస్తకాలు పెట్టుకోవద్దు..

మనలో కొందరు రాత్రి పూట పుస్తకాలను చదువుతూ అలానే నిద్రలోకి జారుకుంటారు. వాటినే దిండులా కూడా వాడుతుంటారు. అయితే పుస్తకాలను, వార్తా పత్రికలను, స్టడీ మెటీరియల్స్ ను తల కింద అస్సలు పెట్టుకోకూడదు. ఇలా చేస్తే మీరు మీ జ్ఞానాన్ని అవమానించినట్లే. చదువులో రాణించలేరన్నది కూడా నిజం. విద్యారంగంలో పురోగతి సాధించలేరని గుర్తుంచుకోవాలి.

బూట్లను దగ్గర ఉంచొద్దు..

బూట్లను దగ్గర ఉంచొద్దు..

మీ పడకగదిలో ఎప్పుడూ బూట్లు ఉంచొద్దు. ముఖ్యంగా మంచం తలపై షూ ఎప్పుడూ ఉంచొద్దు. ఇది మీలో ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని చెబుతారు. కాబట్టి ఇలాంటి వాటిని తేలిగ్గా తీసుకోకూడదు. మీకు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దానికి కారణం కొన్నిసార్లు ఇలాంటివే. ఇలా వాస్తు నియమాలను పాటిస్తే, కచ్చితంగా మీకు మంచి ఫలితాలొస్తాయి.

ఇవి మరువకండి..

ఇవి మరువకండి..

మీరు నిద్రించే సమయంలో మీరు పడుకునే బెడ్ క్లీన్ గా ఉండేలా చూసుకోవాలి. మంచంపై చిందరవందరగా వస్తువులుంటే అక్కడ రాహువు ప్రభావం కచ్చితంగా ఉంటుందని పండితులు చెబతారు. కాబట్టి పడుకునే ముందు బెడ్ మొత్తం శుభ్రం చేసుకోవాలి. మీరు ఇలా చేయకపోతే, జీవితంలో రాహువు ప్రభావం పెరుగుతుంది మరియు ఇది మీ వృత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అలాగే చీపురును ఎప్పుడూ పడకగదిలో ఉంచకూడదు. ఎందుకంటే ఇది మీ మానసిక మరియు శారీరక సమస్యలకు దారితీస్తుంది.

అవి ఉంచొద్దు..

అవి ఉంచొద్దు..

మీరు నిద్రించే మంచంలో బంగారం లేదా నీరు ఉంచొద్దు. ఎందుకంటే దానిని చాలా పవిత్రంగా ఉంచాలి. ఎందుకంటే ఇవి గురు గ్రహానికి సంబంధించినవి. అందువల్ల, వాటిని మంచం మీద లేదా దిండు కింద ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల అశుభ ఫలితాలు కలుగుతాయి. దీని వల్ల తరచుగా మీరు పనిలో ఎక్కువగా కోపంగా లేదా బలహీనంగా మారడానికి కారణమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

English summary

Do Not These Things Around You While Sleeping According to Vastu in Telugu

Here we are talking about the do not keep these things around you while sleeping because of some inauspicious effects in telugu. Take a look
Story first published: Tuesday, May 24, 2022, 18:14 [IST]
Desktop Bottom Promotion