Latest Updates
-
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు!
2022 కొత్త ఏడాదిలో ఏ రాశి వారు ఏ పనులు చేయాలి.. ఏ పనులు చేయకూడదో తెలుసా...!
2022 సంవత్సరంలో 12 రాశి చక్రాల వారు ఏ పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మరికొద్ది గంటల్లో మనం 2021 సంవత్సరానికి వీడ్కోలు చెప్పబోతున్నాం.. అదే సమయంలో కొంగొత్త ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం పలకనున్నాం. న్యూ ఇయర్ వస్తోందంటే చాలు మనలో ఏదో తెలియని కొత్త ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే కొత్త ఏడాదిలో కొన్ని రిజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటాం. విద్యార్థులు ఉన్నత విద్య గురించి.. ఉద్యోగులు తమ కెరీర్ గురించి.. వ్యాపారులు తమ వ్యాపార విస్తరణ గురించి.. మిగిలన వారంతా తమ రంగాలను బట్టి కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంటారు.

ఇదిలా ఉండగా.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2022 కొత్త సంవత్సరంలో ఏ రాశి వారు ఏ పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.. ఏ పనులు చేస్తే ప్రతికూల ఫలితాలొస్తాయనే విషయాలను తెలుసుకోవచ్చట.. ఈ ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడే చూసెయ్యండి...

మేష రాశి..
ఈ రాశి వారు 2022 సంవత్సరంలో కొత్త విషయాలను నేర్చుకునేందుకు ప్రయత్నించాలి. పాత విషయాల గురించి పెద్దగా ఆలోచించకూడదు. మీరు దేనిలో నైపుణ్యం సాధిస్తారో.. అదే రంగంలో ముందుకెళితే.. మీరు తప్పకుండా విజయం సాధిస్తారు.

వృషభ రాశి..
ఈ రాశి వారు 2022 సంవత్సరంలో విజయం సాధించాలంటే.. ముందుగా కంగారు పడటం మానుకోవాలి. కొత్త ఏడాదిలో సరికొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. మీరు చేస్తున్న పనుల వరకే పరిమితం కాకుండా.. మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నించాలి.

మిధున రాశి..
ఈ రాశి వారికి 2022 సంవత్సరంలో ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ వహించాలి. మెరుగైన ఆరోగ్యం కోసం మీ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయడం వంటివి చేయాలి.

కర్కాటక రాశి..
ఈ రాశి వారికి 2022 సంవత్సరంలో ఎన్నో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు వీటిలో ఏది మంచి.. ఏది చెడు అనే విషయాల గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీకు ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకూడదు.

సింహ రాశి..
ఈ రాశి వారు 2022 సంవత్సరంలో చాలా సహనంతో ఉండాలి. ఏ పనిలోనూ ఫలితాన్ని వెంటనే కావాలని కోరుకోవద్దు. మీరు ఎంత ఓపికగా ఉంటే అంత మంచి ఫలితం ఉంటుంది.

కన్య రాశి..
ఈ రాశి వారు 2022 సంవత్సరంలో మీ గురించి మీకు ఎక్కువ టైమ్ కేటాయించుకోండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరితో ఫ్రెండ్లీగా ఉండండి. అయితే మీరంటే కేరింగ్ తీసుకోని వారి నుండి వీలైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీరంటే ఇష్టమున్న వారి కోసం కొంత టైమ్ కేటాయించండి.

తుల రాశి..
ఈ రాశి వారు 2022 సంవత్సరంలో ఏ పనులు చేయాలి.. ఏమి చేయకూడదనే రిజల్యూషన్ ను ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. అనవసరమైన విషయాల గురించి టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈ సంవత్సరంలో మీకు అనేక విషయాలు కలిసొస్తాయి.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు 2022 సంవత్సరంలో అందరినీ గుడ్డిగా నమ్మకూడదు. ముఖ్యంగా మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండాలి. అది మీ ఫ్రెండ్స్ అయినా.. ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే. అలాగే ఆదాయం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు చేయకూడదు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు 2022 సంవత్సరంలో ఆర్థిక పరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరి కోసమో అనవసరమైన ఖర్చులు చేయకండి. మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ వహించాలి.

మకర రాశి..
ఈ రాశి వారు 2022 సంవత్సరంలో చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అనవసరమైన విషయాల గురించి ఆలోచించి టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. అదే సమయంలో విద్యార్థులు విద్యపై ఎక్కువ శ్రద్ధ వహించాలి.

కుంభ రాశి..
ఈ రాశి వారు 2022 సంవత్సరంలో కేవలం పని గురించి ఆలోచించొద్దు. వివాహితులు కుటుంబం గురించి చింతను పక్కనబెట్టి.. అప్పుడప్పుడు బయటకు వెళ్లండి. వీలైతే లాంగ్ డ్రైవ్, విహార యాత్రలను ప్లాన్ చేయండి. వీలైనన్ని కొత్త ప్రదేశాలను చుట్టేయండి. కొత్త ఆలోచనలతో కొత్త ఏడాదిలో దూసుకెళ్లండి.

మీన రాశి..
ఈ రాశి వారు 2022 సంవత్సరంలో సరదాగా గడిపేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా మీ ప్రియమైన వారితో.. సన్నిహితులతో గడిపేందుకు వచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు.



Click it and Unblock the Notifications