Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Chanakya Niti: ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా విజయం సాధించాలంటే వీటిని ఆచరించాలి
అర్థశాస్త్రం గ్రంథం రాసిన చాణక్యుడు డబ్బు సంపాదన, వ్యాపార నిర్వహణ గురించి ఎన్నో విషయాలు ప్రస్తావించాడు. వాటిని తెలుసుకుని ఆచరించడం ద్వారా వ్యాపారంలో లాభాలు వస్తాయి, వృత్తి జీవితం సాఫీగా సాగుతుంది. చాణక్యుడు చెప్పిన ఆ విష
చాణక్యుడు గొప్ప తత్వవేత్త, వ్యూహకర్త, జ్ఞాని, మేధావి, మార్గదర్శకుడు, రాజనీతిజ్ఞుడు.. ఇలా ఎన్నో రంగాల్లో ఆరితేరిన వ్యక్తి ఆచార్య చాణక్యుడు. ఆయన రాసిన చాణక్య నీతి గ్రంథం ఒక మనిషి ఎలా జీవించాలన్న దాని గురించి చెబుతుంది. జీవితంలో విజయం సాధించాలన్నా, పనులు సక్రమంగా సాగాలన్నా, కుటుంబంలో ఎలాంటి అపార్థాలు లేకుండా ఆనందమయం కావాలన్నా చాణక్యుడు చెప్పిన సూక్తులు పాటించాలి.

అర్థశాస్త్రం గ్రంథం రాసిన చాణక్యుడు డబ్బు సంపాదన, వ్యాపార నిర్వహణ గురించి ఎన్నో విషయాలు ప్రస్తావించాడు. వాటిని తెలుసుకుని ఆచరించడం ద్వారా వ్యాపారంలో లాభాలు వస్తాయి, వృత్తి జీవితం సాఫీగా సాగుతుంది. చాణక్యుడు చెప్పిన ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పని చేయాలి:
దేవుడు ప్రతి మనిషిని పని చేసేందుకు తాహతును, ఆ గుణాన్ని ఇచ్చాడు. మనిషి శ్రమించకపోతే కడుపు నిండదు. కడుపు నిండటానికి, కుటుంబ పోషణకు కష్టపడి పని చేయడం చాలా చాలా ముఖ్యమని చాణక్యుడు చెప్పాడు. చేసే పనిలో చిన్నది, పెద్దది అనే తేడాలు ఉండవన్నాడు ఆచార్యుడు.
చేసే ఏ పని అయినా పూర్తి శ్రద్ధతో, అంకితభావంతో చేస్తే ఆ పనిలో మీకు నైపుణ్యం వస్తుందని చెప్పాడు. అది ఇతరుల నుండి మిమ్మల్ని భిన్నంగా ఉంచుతుందని చెప్పాడు చాణక్యుడు.
అయిష్టంగా చేసే పని వల్ల విజయవకాశాలు తగ్గిపోతాయని చాణక్యుడు హెచ్చరించాడు. అందుకే పనిలో అలసత్వం తీసుకురావొద్దని మరీ మరీ చెప్పాడు. నిర్ణీత గడువులోగా పని పూర్తి చేయాల్సి ఉంటే.. దానిని ముందే పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని అంటా చాణక్యుడు.

గుడ్డిగా నమ్మొద్దు:
వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా మీ ప్రణాళికలను, మీ వ్యూహాలను ఎవరితోనూ పంచుకోవద్దని చెప్పాడు చాణక్యుడు. మీ పైవారినైనా, మీ కంటే తక్కువ స్థాయి వారినైనా, ప్రత్యేకమైన వ్యక్తులనైనా గుడ్డిగా నమ్మొద్దని చాణక్యుడు సూచించాడు. గుడ్డిగా నమ్మడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.
ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా సహోద్యోగులు, సహచరులను నమ్మాలి. అది చాలా ముఖ్యం. అయితే గుడ్డిగా నమ్మోద్దని చెప్పాడు చాణక్యుడు. గుడ్డినా నమ్మడం వల్ల మీ అంచనాలు తలకిందులు కావొచ్చని, వారు మిమ్మల్ని మోసం చేయడానికి పూర్తిగా అవకాశం ఇచ్చినట్లు అవుతుందని హెచ్చరించాడు చాణక్యుడు.

చిన్న తప్పు - పెద్ద నష్టం:
ఏ విషయంలోనైనా జాగ్రత్త చాలా అవసరం. అప్రమత్తంగా లేకపోతే అనర్థాలు జరుగుతాయి. ఒక్కోసారి మనం చేసే చిన్న తప్పు వల్ల ఎంతో కోల్పోవాల్సి వస్తుంది. అందుకే వృత్తిలోనైనా, వ్యాపారంలోనైనా ఏ పని చేసినా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆచితూచి వ్యవహరించాలని చెబుతాడు చాణక్యుడు.



Click it and Unblock the Notifications