Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
Chanakya Niti: ఉదయం లేవగానే ఈ పనులు అస్సలే చేయొద్దు, ఎందుకంటే..
చాణక్యుడు మనిషి జీవితం గురించి చెబుతూ.. ఉదయం లేవగానే కొన్ని పనులు చేయకూడదని, మరికొన్నింటిని తప్పకుండా చేయాలని చెప్పాడు. వాటి వల్ల ప్రతికూలత తొలగిపోయి జీవితం సాఫీగా సాగుతుందని వివరించాడు. చాణక్యుడు చెప్పిన ఆ విషయాలేమిటో ఇ
చాణక్యుడు గొప్ప తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు, వ్యూహకర్త, ఆర్థికవేతేత. మౌర్య సామ్రాజ్య రాజ సలహాదారు. చంద్రగుప్తుడిని రాజును చేయడంలో కీలక పాత్ర పోషించాడు చాణక్యుడు. చాణక్యుడు అర్థశాస్త్రం, చాణక్య నీతి అనే గ్రంథాలను రచించాడు. అందులో ధర్మబద్ధమైన, విజయవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఎన్నో సూచనలు చేశాడు. చాణక్యుడు చెప్పిన సూచనలు నేటి కాలంలో కూడా ఆచరించడానికి అనువైనవి.

చాణక్యుడు మనిషి జీవితం గురించి చెబుతూ.. ఉదయం లేవగానే కొన్ని పనులు చేయకూడదని, మరికొన్నింటిని తప్పకుండా చేయాలని చెప్పాడు. వాటి వల్ల ప్రతికూలత తొలగిపోయి జీవితం సాఫీగా సాగుతుందని వివరించాడు. చాణక్యుడు చెప్పిన ఆ విషయాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్రలేవగానే అద్దం చూడొద్దు:
చాలా మంది ఇంట్లో బెడ్రూములో డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. రోజూ ఉదయం నిద్రలేవగానే ఆ డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో తమను తాము చూసుకుంటారు. అయితే ఇలా చేయడం చెడ్డ అలవాటు అని చాణక్యుడు చెప్పాడు. ఉదయం నిద్రలేవగానే ఇలా చూడటం వల్ల నెగెటివ్ ఫీలింగ్స్ వస్తాయని ఆచార్య చాణక్యుడు వెల్లడించాడు. ఈ నెగెటివ్ ఆలోచనలు రోజంతా వదలకుండా తరుముతాయని చెప్పాడు. నిద్రలేచిన వెంటనే ఎవరికి ముఖం వారికి నచ్చదని, అలా చూస్తే మనస్సులో ప్రతికూల శక్తి ప్రవేశిస్తుందని సూచించాడు కౌటిల్యుడు.

ఇతరుల ముఖం చూడొద్దు:
ఉదయం నిద్రలేవగానే ఇతరుల ముఖం చూడటం కూడా చెడ్డ అలవాటుగా చాణక్యుడు చెప్పాడు. ఉదయం నిద్ర లేవగానే మొదట భగవంతుడిని చూడాలి. అంతకుముందు ఏ వ్యక్తినీ చూడొద్దని చాణక్యుడు చెప్పాడు. నిద్రలేచి కళ్లు తెరవగానే దేవుడిని చూసి రోజంతా చక్కగా గడిచిపోవాలని వేడుకోవాలని చాణక్యుడు సూచించాడు.

జంతువుల కొట్లాట, హింసాత్మక వీడియోలు:
ఈ మధ్యకాలంలో చాలా మంది నిద్రలేవగానే మొదటి చేసే పని ఫోన్ చూడటం. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. లేవగానే మొదటి సోషల్ మీడియాను స్క్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియాలు కనిపిస్తుంటాయి.
ఇందులో జంతువులు కొట్లాడుకునే వీడియోలు, హింసను చూపించే వీడియోలూ ఉంటాయి. ఉదయం నిద్ర లేవగానే అలాంటివి చూడటం వల్ల రోజు ప్రతికూలంగా మొదలవుతుందని చాణక్యుడు చెప్పాడు.
ఇంటి పరిసర ప్రాంతాల్లో జరిగే హింసాత్మక సంఘటనలను కూడా ఉదయం నిద్రలేవగానే చూడొద్దని చెప్పాడు చాణక్యుడు. రోజూ ఉదయం భగవంతుడిని చూసి, స్మరించుకున్న తర్వాతే రోజు ప్రారంభించాలన్నాడు.

సానుకూల ఆలోచనలతో రోజును ప్రారంభించాలి:
ప్రారంభం బాగుంటే సగం కార్యం పూర్తయినట్లేనని చాలా మంది భావిస్తారు. అందుకే రోజులో ఉదయం నిద్రలేవగానే ప్రతికూల ఆలోచనలు దరికి చేరకుండా సానుకూల ఆలోచనలతో రోజును ప్రారంభించాలని చాణక్యుడు చెప్పాడు.
దురాశ, దుఃఖం, కష్టం, నష్టం గురించి ఆలోచించకుండా, రోజంతా బాగా గడిచిపోతుందని జీవితంలో సుఖం వెల్లివిరుస్తుందని అనుకుంటూ రోజును ప్రారంభించాలని చెబుతాడు చాణక్యుడు.

ధ్యానం, యోగా:
ధ్యానం, యోగా అనేది రోజును స్పష్టమైన, ప్రశాంతమైన మనస్సుతో ప్రారంభించడానికి తప్పక చేయాల్సిన కార్యాలు అని చాణక్యుడు చెప్పాడు. ధ్యానం మనస్సును శాంతపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. యోగా ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వీటిని క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శ్రేయస్సు సిద్ధిస్తుంది.



Click it and Unblock the Notifications