Latest Updates
-
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు!
రాత్రి పుడితే మంచిదా? పగలు పుడితే మంచిదా? తెలుసుకోండి
పిల్లలు ఏ సమయంలో పుడితే ఎలా ఉంటుంది, పగలు పుడితే మంచిదా, రాత్రి పుడితే మంచిదా, ఎప్పుడు జన్మిస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లలు పుట్టిన తేదీ, సమయంపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. గ్రహాల స్థానాలు మనుషులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అందుకే పిల్లలు ఏ సమయంలో జన్మించారు, ఏ తేదీ, అనే విషయాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. ఉదయం, పగలు, రాత్రి వేళ పుట్టే వారి భవిష్యత్తు వివిధ రకాలుగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది.

పిల్లలు ఏ సమయంలో పుడితే ఎలా ఉంటుంది, పగలు పుడితే మంచిదా, రాత్రి పుడితే మంచిదా, ఎప్పుడు జన్మిస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
12 అర్ధరాత్రి నుండి 2.00 వరకు:
అర్ధరాత్రి నుండి 2 గంటల మధ్యలో పుట్టిన వారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కొత్త విషయాలను తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. వీరు మీడియా, టీవీ, సినిమా రంగంలో రాణించే అవకాశాలు ఉన్నాయి.
రాత్రి 2.00 గంటల నుండి 4.00 వరకు:
ఈ సమయంలో పుట్టిన వారు అద్భుతమైన కమ్యూనికేటర్లుగా ఉంటారు. వీరు విలాసవంతమైన పరిసరాల మధ్య జీవిస్తారు. వ్యాపారంలో విజయం సాధిస్తారు. సొంత సంపదను సంపాదిస్తారు. 24-27 సంవత్సరాల మధ్య అదృష్టకాలాన్ని పరిగణిస్తారు.
ఉదయం 4.00 నుండి 6.00 వరకు:
వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అధికారం కోసం తహతహలాడుతుంటారు. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. డిఫెన్స్, పోలీస్ సర్వీసెస్‌లో రాణిస్తారు. వీరికి శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయి.
ఉదయం 6.00 నుండి 8.00 వరకు:
ఈ సమయంలో పుట్టిన వారు కళాత్మ రంగంలో రాణిస్తారు. నాయకత్వ లక్షణాలు సహజంగా వస్తాయి. రహస్యాలు ఎవరితోనూ షేర్ చేసుకోరు. సంకల్పంతో అసాధ్యమైన లక్ష్యాలను కూడా సాధిస్తారు. ఆకస్మిక మలుపులు, జీవితంలో ఎదురయ్యే సమస్యలు వీరిని బలమైన వ్యక్తిగా మారుస్తాయి. వీరు ప్రతి విషయాన్ని సానుకూలంగా చూడటం నేర్చుకుంటే భవిష్యత్తు బాగుంటుంది.
ఉదయం 8.00 నుండి 10.00 వరకు:
ఈ సమయంలో పుట్టిన వారు నిశ్శబ్దాన్ని ఇష్టపడతారు. స్నేహశీలురై ఉంటారు. రాజకీయ నాయకులు, పబ్లిక్ స్పీకర్, మీడియా లాంటి రంగాల్లో రాణిస్తారు. వీరు మాతృభూమికి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఉదయం 10.00 నుండి 12.00 వరకు:
వీరు మంచి టీం ప్లేయర్స్. అంటే బృందంతో కలిసి ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తారు. వీరికి సానుకూల దృక్పథం ఎక్కువగా ఉంటుంది. సున్నితంగా ఉంటారు. లక్ష్యాలను సాధించడానికి ఎంతైనా కష్టపడతారు. వీరి ప్రయత్నాలు ప్రతిఫలం లభిస్తుంది. ఈ సమయంలో పుట్టిన వారు ఉన్నతస్థాయిలో ఉంటారు. సంపద సృష్టిస్తారు. కళాత్మక రంగంలో రాణిస్తారు.
మధ్యాహ్నం 12.00 నుండి 2.00 వరకు:
వీరిలో బోధనా నైపుణ్యాలు ఉంటాయి. వీరు బాధ్యతగా ఉంటారు. సృజనాత్మకత, ఆశయం, ప్రయత్నాలతో పాటు విజయం వరిస్తుంది. జన్మ స్థలానికి దూరంగా ఉన్న ప్రదేశంలో అభివృద్ధి చెందుతారు. విజయవంతమైన వ్యాపార వేత్త అవుతారు. వీరు కోచ్, గైడ్, కౌన్సెలర్ లాగా రాణించవచ్చు. 30 ఏళ్లు దాటిన తర్వాత అదృష్టం వరిస్తుంది.
మధ్యాహ్నం 2.00 గంటల నుండి 4.00 వరకు:
ఎలాంటి విషయాలకైనా మానసికంగా సిద్ధంగా ఉంటారు. ఎదురుదెబ్బలను ఇష్టపడరు. జీవితంలో హెచ్చు తగ్గులు చూస్తారు. ఫైనాన్స్, ఫండ్స్, అకౌంటింగ్, బ్యాంకింగ్ మొదలైన వాటిలో బాగా రాణిస్తారు. వీరు వెళ్లే దారిలో ఏదైనా అడ్డంకి ఉంటే దానిని అధిగమించి విజయం సాధించగలిగేంత ఆశాజనకంగా ఉంటారు.
4.00 గంటల నుండి 6.00 వరకు:
వీరు సానుకూల దృక్పథంతో ఉంటారు. మృదు స్వభావం కలిగి ఉంటారు. ప్రేమను బలంగా విశ్వసిస్తారు. చిన్న వయస్సులోనే జీవితంలో కఠిన పాఠాలు నేర్చుకుంటారు. సంబంధాలపై మంచి అవగాహన కలిగి ఉంటారు. కౌన్సెలింగ్, బోధన వీరికి సహజంగా వచ్చేస్తాయి.
సాయంత్రం 6.00 నుండి 8.00 వరకు:
వీరు సానుభూతిపరులు. జీవితాన్ని అంగీకరిస్తారు. చాలా లైట్ తీసుకుంటారు. ఇలాంటి వారికి ప్రజలు ఆకర్షితులవుతారు. సమస్యలను అద్భుతంగా పరిష్కరిస్తారు. సహకార వ్యాపారాలతో పని చేయడం వల్ల లాభాలు వస్తాయి.
రాత్రి 8.00 నుండి 10.00 వరకు:
ఇతరులకు సహాయం చేయడంలో ఆనందాన్ని పొందుతారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. కష్టపడి పని చేస్తారు. విజయం, కీర్తి, ఆనందాన్ని సాధించడంలో ముందుంటారు.
రాత్రి 10.00 నుండి అర్ధరాత్రి 12 వరకు:
సృజనాత్మకంగా ఆలోచిస్తారు. లక్ష్యాలను సాధించడంలో పరిమితులను అధిగమిస్తారు. భవిష్యత్తుపై ఎంతో విశ్వాసంతో ఉంటారు. ప్రశాంతంగా ఉంటూ పనులు చక్కబెట్టుకుంటారు. వీరు ఎలా రంగంలో ఉన్నా బాగా రాణిస్తారు.



Click it and Unblock the Notifications