Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Chanakya Niti: పిల్లల ముందు ఈ తప్పులు అస్సలే చేయొద్దు, తర్వాతా చాలా బాధపడతారు
తల్లిదండ్రులు, ఇంట్లోని ఇతర కుటుంబసభ్యులు పిల్లల ముందు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. నోట్లో నుండి వచ్చే ప్రతి మాటలపై శ్రద్ధ వహించాలని చెప్పాడు. మనం మాట్లాడే ప్రతి పదం పిల్లలపై ప్రభావం చూపిస్తుందన్నాడ
చాణక్యుడు గొప్ప తత్వవేత్త, జ్ఞాని, రాజకీయ వ్యూహకర్త. ఆయన వ్యూహాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఆయన అర్థశాస్త్రం, చాణక్యనీతి లాంటి గ్రంథాలు రచించాడు. ఒక వ్యక్తి విజయవంతమైన జీవితాన్ని గడపడానికి ఎన్నో సూచనలు అందులో ఉంటాయి. జీవితం సాఫీగా సాగడానికి, అనుకున్న పనులు నెరవేరడానికి, దాంపత్య బంధం, కుటుంబంలో కలహాలు లేకుండా సంతోషంగా ఉండటానికి చాణక్యుడు ఎన్నో సూచనలు చేశాడు.

పిల్లల గురించి కొన్ని విషయాలు ప్రత్యేకంగా చెప్పాడు చాణక్యుడు. తల్లిదండ్రులు, ఇంట్లోని ఇతర కుటుంబసభ్యులు పిల్లల ముందు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. నోట్లో నుండి వచ్చే ప్రతి మాటలపై శ్రద్ధ వహించాలని చెప్పాడు. మనం మాట్లాడే ప్రతి పదం పిల్లలపై ప్రభావం చూపిస్తుందన్నాడు. పిల్లల ముందు ఎలా మాట్లాడాలో చాణక్యుడు ఏంచెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం.

తప్పుడు పదాలు వాడొద్దు:
పిల్లల ముందు చెడు మాటలు మాట్లాడకూడదని చెప్పాడు ఆచార్య చాణక్యుడు. ఇంట్లో పెద్దలు వాడే భాషపై శ్రద్ధ వహించాలని చెప్పాడు. పిల్లలు ఏం వింటారో అలాగే నేర్చుకుంటారు. పిల్లలు పెద్దలను చూసి నేర్చుకుంటారు. మనం ఏం చేస్తే అది చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి వారి ముందు తప్పుడు పదాలు వాడొద్దని సూచించాడు చాణక్యుడు. దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుందన్నాడు.

జీవితాన్ని క్రమశిక్షణగా ఉంచుకోవాలి:
పెద్దలు ఏం చేస్తే పిల్లలు అది చేస్తారు. తల్లిదండ్రులు, ఇంట్లోని కుటుంబసభ్యుల నడవడిక పిల్లలపై ప్రభావం చూపిస్తుంది. పిల్లలు మనం చెప్పినదాని కంటే వాళ్లు కళ్లతో చూసింది చూసినట్లుగా, చెవులతో విన్నది విన్నట్లుగా చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకే తల్లిదండ్రులు క్రమశిక్షణతో జీవించాలని చాణక్యుడు సూచించాడు.

అవమానించొద్దు:
చాణక్యుడి ప్రకారం భార్యాభర్తలు పిల్లల ముందు ఒకరినొకరు ఎప్పుడు అవమానించకోకూడదు. అవమానకరంగా మాట్లాడటం ఆపేయ్యాలి. ఇలా చేయడం వల్ల పిల్లల పట్ల వారు గౌరవాన్ని కోల్పోతారు. వారికి పిల్లలు ఏమాత్రం విలువ ఇవ్వరు. అందుకే పిల్లల ముందు ఒకరిని ఎట్టిపరిస్థితుల్లోనూ అవమానించకూడదు.

కఠినంగా ఉండటం:
పిల్లల చాలా మృదు స్వభావులు. వారితో కఠినంగా ఉండటం వల్ల వారిపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. అందుకే ఎంతవరకు గారాభం చేయాలో అంత వరకు చేయాలి, ఎంత వరకు కంట్రోల్ లో ఉంచాలో అంత వరకు మాత్రమే ఉంచాలి. మీరు చెప్పిన పనిని చెప్పిన విధానంగానే చేయాలనడం, చేయకపోతే దండించడం, మార్కులు మీరు అనుకున్నన్ని రాకపోతే కొట్టడం లాంటివి చేయొద్దని చాణక్యుడు సూచించాడు.



Click it and Unblock the Notifications