For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Holi 2021: కరోనా గురించి సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మకండి...

|

కరోనా వైరస్.. ప్రస్తుతం ఈ భూతం ప్రపంచాన్ని అంతా వణికిస్తోంది. చైనా నుండి మొదలైన ఈ కరోనా భూతం ఇప్పటికే అనేక దేశాలను కమ్మేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 90 వేలకు పైగా కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ కరోనా వైరస్ భారతదేశంలోనూ కొంతమందికి సోకినట్లు ఇటీవలే వార్తలొచ్చాయి.

అయితే వారికి కేరళలో చికిత్స జరిగిందని.. వారు త్వరగా కోలుకుంటున్నారని.. అందరూ ఊపిరిపీల్చుకునేలోపే.. కరోనా వైరస్ గురించి అసత్య ప్రచారాలు.. పుకార్లు వాట్సాప్, ఫేస్ బుక్, టిక్ టాక్ వంటి సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నాయి. దీంతో దేశంలోని ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు.

అయితే మీరు ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇంటర్నెట్ లో మీరు చూసేవన్నీ నిజం కాదని గ్రహించాలి. ఎందుకంటే అలాంటి వాటిలో కరోనా వైరస్ నివారణ కోసం చాలా వరకు బూటకపు నివారణలు ఉన్నాయి. ఈ కరోనా వైరస్ గురించి ఇప్పటివరకు యునిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, మన ప్రభుత్వాలు కొన్ని రకాల సందేశాలను ఇప్పటికే అందజేశాయి. అలాగే అందరికీ ఈ కరోనా వైరస్ పై అవగాహన కూడా కల్పిస్తున్నారు.

కరోనా వైరస్ మీపై దాడి చేయకూడదనుకుంటే ? ఈ ఆహారాలు తినండి...

గాలి ద్వారా వ్యాపించిందని..

గాలి ద్వారా వ్యాపించిందని..

ప్రస్తుతం కరోనా వైరస్ ఎలా వ్యాపించిందంటే ఒక్కొక్కరు ఒక్కోలా సమాధానమిస్తున్నారు. మన దేశంలోనూ దీని ప్రచారం వేగంగా వ్యాపిస్తోంది. ఇది గాలి ద్వారా వ్యాపించిందన్న విషయం వైరల్ అయిపోయింది. దీనిని చాలా నమ్మేశారు. కానీ ఇది కచ్చితంగా తప్పు అని అందరూ గ్రహించాలి. ఈ వైరస్ నీటి తుంపర్ల నుండి వేగంగా వ్యాపించబడుతుందని ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి.

చికెన్ నుండి వస్తోందని..

చికెన్ నుండి వస్తోందని..

ఇంకా కొంతమంది అయితే కరోనా వైరస్ కోళ్ల ద్వారా వస్తోందని... చికెన్ తింటే కూడా కరోనా వైరస్ వస్తుందని అసత్య ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది కూడా అసత్యమని తేల్చారు నిపుణులు. అసలు కోళ్లకు.. కరోనా వైరస్ కు ఏ మాత్రం సంబంధం లేదట.. కాబట్టి మాంసప్రియులు ఎలాంటి భయాందోళన చెందకుండా మాంసాహారాన్ని తీసుకోండి.

మద్యంలోనూ...

మద్యంలోనూ...

మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మద్యంలోనూ కరోనా వైరస్ కలిసిందని.. ఆల్కహాల్ తాగితే కూడా కరోనా బారిన పడతామని సోషల్ మీడియాలో కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారట. ఇలాంటి వాటిని కూడా అస్సలు నమ్మకండి.

కరోనావైరస్ - గర్భవతిగా ఉన్నప్పుడు జాగ్రత్తలు.., పిల్లలు కూడా...

ఏపీలోనూ కరోనా?

ఏపీలోనూ కరోనా?

ఇటీవల తెలంగాణలో కరోనా వైరస్ ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సోకినట్లు వైద్యులు ధ్రువీకరించగానే.. ఆంధ్రప్రదేశ్ లోని ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మరొకరికి ఈ వ్యాధి సోకినట్లు పుకార్లు ఊపందుకున్నాయి. అయితే ఆ వ్యక్తి కేవలం అనుమానితుడే అని.. అతడిని పరీక్షించిన వైద్యులు అతనికి కరోనా వైరస్ వ్యాధి నెగిటివ్ వచ్చింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

పది సెకన్ల పాటు..

పది సెకన్ల పాటు..

మీకు కరోనా వైరస్ ఉందో లేదో తెలుసుకోవడానికి పది సెకన్ల పాటు మీ శ్వాసను పట్టుకుంటే.. మీకు తెలిసిపోతుందని.. మీరు పది సెకన్ల వరకు దగ్గు లేకుండా ఉంటే, మీరు ఆ వ్యాధి నుండి సురక్షితంగా ఉంటారని కొందరు మెసేజ్ లు ఫార్వర్డ్ చేస్తున్నారట. ఇది కూడా శుద్ధ తప్పు అని నిపుణులు చెబుతున్నారు.

వెల్లుల్లి నీరు..

వెల్లుల్లి నీరు..

కరోనా వైరస్ సోకిన రోగితో సంబంధం ఉన్న వారిపై దాడి చేస్తుంది. అదే విధంగా, వైరస్ యొక్క ప్రవేశాన్ని ఆపేందుకు ఎవ్వరికీ సాధ్యం కాదు. అయితే కొంతమంది మాత్రం వెల్లుల్లి నీటిని తాగితే ఈ వైరస్ ను నివారించవచ్చు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారట.

తెలంగాణలో కరోనావైరస్ కలకలం: కోవిడ్-19 అంటే ఏమిటి- చికిత్స, నివారణ మరియు ప్రమాద కారకాలు...

వర్క్ ఫ్రమ్ హోమ్...

వర్క్ ఫ్రమ్ హోమ్...

కరోనా వైరస్ దెబ్బకు హైటెక్ సిటీతో పాటు పలు ప్రాంతాల్లో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని చెప్పినట్లు పుకార్లు వచ్చాయి. అయితే అప్పటివరకు ఒక్క కంపెనీ మాత్రం అలాంటి పని చేసిందని.. ఆ కంపెనీ ప్రతినిధులతో ప్రభుత్వ అధికారులు చర్చలు జరిపి అలాంటి వాటిని ప్రోత్సహించవద్దని చెప్పారట.

ధైర్యంగా ఉండండి...

ధైర్యంగా ఉండండి...

అయితే మీరు విన్న వాటిలో ఒకటి మాత్రం నిజం. కరోనా వైరస్ కొంతమందికి ప్రాణాంతకం కావచ్చు. అయితే ఈ వైరస్ వల్ల ప్రతి ఒక్కరూ చనిపోతారని అర్థం కాదు. ఎందుకంటే ప్రారంభంలోనే ఈ వైరస్ ను గుర్తిస్తే ఈ వ్యాధి వ్యాప్తి చేయకుండా కోలుకునేందుకు అవకాశం ఉందని, కేరళ రాష్ట్రంలో ఇదే జరిగిందని వైద్యులు చెబుతున్నారు. అయితే వీటి కంటే ముందు మీరు మంచి పరిశుభ్రతను పాటించడం, పారిశుధ్యం మరియు తప్పుడు ప్రచారాన్ని వ్యాపింపచేయకపోతే చాలు. అదే మీ ప్రియమైన వారిని కరోనా వైరస్ వ్యాప్తి నుండి రక్షించడానికి ఉత్తమ మార్గం.

English summary

Don't Believe these corona virus whatsapp, messages and forwards!

Here we talking about don't believe these coronavirus whatsapp, messages and forwards!. Read on