Latest Updates
-
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.! -
ఉప్మా తినడం ఇష్టం లేని వారికి రవ్వతో ఇలా చేసి పెట్టండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.! -
జన్మాష్టమి రోజు ద్వాపర యుగం నాటి అరుదైన సంఘటన.. ఈ ఐదు రాశుల వారిపై కృష్ణయ్య కటాక్షం.! -
వంట చేసే ఓపిక లేదా? కేవలం 10 నిమిషాల్లో ఈ పచ్చిమిర్చి నువ్వుల రైస్ చేసి చూడండి, టేస్ట్ అదుర్స్! -
కుజ-గురు కలయికతో ద్విద్వాదశ యోగం..ఈ 4 రాశులకు అడుగడుగునా అదృష్టమే! -
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏదో తెలుసా?.. 90% మంది తప్పుగానే చెప్తారు!
మీ రాశిని బట్టి గంగా దసరా రోజున ఈ వస్తువులను దానం చేస్తే శుభ ఫలితాలొస్తాయట...!
గంగ దసరా సందర్భంగా మీ రాశి ప్రకారం, ఈ వస్తువులను దానం చేయండి.
హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలోని పదో రోజున గంగా దసరా జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం, జ్యేష్ఠ శుక్లదశమి నాడు గంగాదేవి భూమి మీదకు అడుగు పెట్టింది. మహారాజ భగీరథుడు తన పూర్వీకులను రక్షించడానికి మరియు మోక్షాన్ని సాధించడానికి తన కఠోర తపస్సు ద్వారా గంగను భూమిపైకి తీసుకొచ్చాడని పురాణాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది గంగా దసరా ఉత్సవాలు జూన్ 09వ తేదీన అంటే గురువారం నాడు జరగనున్నాయి. ఈ పవిత్రమైన రోజున గంగా నదిలో స్నానం చేయడం చాలా పవిత్రమైనది. ఈరోజు గంగా స్నానం చేయడం వల్ల పది రకాల పాపాల నుండి మోక్షం లభిస్తుందని పురాణాలు కూడా చెబుతున్నాయి.

మరో కథనం మేరకు.. ఇదే రోజున రామేశ్వరంలో రాముడు శివలింగాన్ని ప్రతిష్టించాడని ప్రతీతి. అందుకే ఈ రోజున గంగా దేవిని పూజించడం వల్ల పాప విముక్తి మరియు మరణానంతరం మోక్షం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఇదిలా ఉండగా.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గంగ దసరా రోజున ద్వాదశ రాశుల వారు ఈ వస్తువులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఏయే రాశి వారు ఏయే వస్తువులను దానం చేయాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ రాశి వారు గంగా దసరా రోజున ఎరుపు లేదా తెలుగు రంగులోని దుస్తులను దానం చేయాలి.

వృషభ రాశి..
ఈ రాశి వారు గంగా దసరా రోజున అన్నదానం చేయాలి. అంతేకాదు, అవసరమైన వారికి ఆహారం కూడా తినిపించొచ్చు.

మిధున రాశి..
ఈ రాశి వారు గంగా దసరా రోజున ఇంట్లో, ఏదైనా బహిరంగ ప్రదేశంలో లేదా గుడిలో నీటి కుండలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా పుణ్యాన్ని పొందొచ్చు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు గంగా దసరా రోజున పండ్లు లేదా మిఠాయిలను అవసరమైన వారికి దానం చేయడం వల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు.

సింహ రాశి..
ఈ రాశి వారు గంగా దసరా రోజున దాన్యాలు లేదా రాగి లోహంతో ఏదైనా పాత్రలు దానం చేయాలి.

కన్య రాశి..
ఈ రాశి వారు గంగా దసరా రోజున బ్రహ్మాణుడికి లేదా పూజారికి పండ్లు మరియు వస్త్రాలను దానం చేయాలి.

తుల రాశి..
ఈ రాశి వారు గంగా దసరా రోజున తమ శక్తి మేరకు ఆలయ నిర్మాణంలో సహకరిస్తామని ప్రతిజ్ణ చేయొచ్చు.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు గంగా దసరా రోజున అన్నదానం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు గంగా దసరా రోజున పేదలకు పండ్లను దానం చేయాలి.

మకర రాశి..
ఈ రాశి వారు గంగా దసరా రోజున ఆవాల నూనె లేదా నల్ల నువ్వులను దానం చేయొచ్చు.

కుంభ రాశి..
ఈ రాశి వారు గంగా దసరా రోజున ఆలయంలో మీ సామర్థ్యం మేరకు ధనం విరాళంగా ఇస్తే శుభ ఫలితాలొస్తాయి.

మీన రాశి..
ఈ రాశి వారు గంగా దసరా రోజున అవసరమైన వారికి వస్త్రదానం చేయొచ్చు.



Click it and Unblock the Notifications