Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Chanakya Niti: పరిస్థితులు బాలేకపోయినా వీటిని మాత్రం అస్సలే వదిలిపెట్టొద్దు
బాధలో ఉన్నప్పుడు, మనసు లఘ్నం చేయలేనప్పుడు తొందరపాటులో అహేతుక నిర్ణయాలు తీసుకోవడం వల్ల కష్టాలు మరింత పెరగవచ్చు. అయితే ఎంతటి దుర్బర పరిస్థితిలో ఉన్నప్పటికీ కొన్నింటిని వదిలిపెట్టకూడదని చాణక్యుడు చెప్పాడు. అవేంటో ఇప్పుడు తె
చాణక్యుడు గొప్ప తత్వవేత్త, రాజ సలహాదారు, గొప్ప జ్ఞాని, విశేష మార్గదర్శకుడు. ఆయన బోధనల ద్వారా చరిత్ర గతినే మార్చాడు. చంద్రగుప్తుడు రాజ్యాన్ని స్థాపించడంలో ఆచార్య చాణక్యుడు కీలక పాత్ర పోషించాడు. ఆయన అర్థశాస్త్రం, చాణక్య నీతి అనే గ్రంథాలు రచించాడు.

ఆచార్య చాణక్యుడు ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎంతో రాణించాడు. అలాగే అన్ని రంగాలలో ప్రావీణ్యం సంపాదించాడు. మానవ జీవితం సజావుగా, సాఫీగా సాగేందుకు ఎన్నో నీతి సూక్తులు చెప్పాడు. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో కష్టాలు ఎదుర్కొంటారు. బాధలో ఉన్నప్పుడు, మనసు లఘ్నం చేయలేనప్పుడు తొందరపాటులో అహేతుక నిర్ణయాలు తీసుకోవడం వల్ల కష్టాలు మరింత పెరగవచ్చు. అయితే ఎంతటి దుర్బర పరిస్థితిలో ఉన్నప్పటికీ కొన్నింటిని వదిలిపెట్టకూడదని చాణక్యుడు చెప్పాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సానుకూలత:
చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి ఆలోచన సానుకూలంగా ఉంటే, అతను ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకుంటాడు. కష్ట సమయంలో కూడా అవకాశాలు వెతుకుతాడు. ఒత్తిడి, ఆందోళన సమయంలో కూడా సానుకూల వైఖరితో వాటి నుండి బయటపడతాడు. కష్టాలు చుట్టిముట్టినప్పుడు తనను తాను రక్షించుకుంటాడు. కొత్త అవకాశాలను సృష్టించుకోవడం ద్వారా పురోగతి సాధిస్తాడు.

లక్ష్యంపై దృష్టి పెట్టాలి:
అన్ని సమయాలు మనకు అనుకూలంగా ఉండవు. కొన్ని సార్లు సమయం కలిసి వస్తే మరికొన్ని సార్లు అనుకూలించకపోవచ్చు. సమయం మంచిదైనా, చెడ్డదైనా లక్ష్యాల పట్ల నిర్లక్ష్యం చేయకూడదని చాణక్యుడు చెప్పాడు. లక్ష్యంపై దృష్టి పెట్టడం కూడా మిమ్మల్ని సానుకూలంగా ఉంచుతుంది. ముందుకు సాగడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. అటువంటి పరిస్థితిలో వ్యక్తి చెడు సమయాల్లో కూడా త్వరగా, సులభంగా బయటపడతాడు.

కష్టపడటం:
మంచి లేదా చెడు సమయం ఎప్పుడూ ఎక్కువ కాలం ఉండదు. జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదు. అనుకోని ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడి ముందుకు సాగడమే జీవితం. ఒక్కోసారి పరిస్థితులు కష్టంగా మారొచ్చు. అలాంటి సమయంలో కూడా శ్రమించడం మర్చిపోవద్దు. కష్టాన్ని నమ్ముకున్న వారు ఎప్పటికైనా విజయం సాధిస్తారు. అలాంటి వ్యక్తులే జీవితంలో గెలుపు తీరాలకు చేరుకుంటారు.

నిరంతర ప్రయత్నం:
విజయం ఎప్పుడూ సులువుగా రాదు. ఎంతో కష్టపడాలి, ఎంతో శ్రమించాలి, ఎన్నో వదులుకోవాలి. అప్పుడే విజయం దరిచేరుతుంది. ఎంత కష్టపడ్డా ఒక్కోసారి విజయం దక్కకపోవచ్చు. అలాంటి సమయంలో నిరాశ నిస్పృహలతో బాధపడకూడదు. ప్రయత్నం ఆపకుండా ముందుకు సాగుతూనే ఉండాలి. ప్రయత్నించడంలో 100 శాతం కష్టపడాలి. కష్టపడుతూనే ఉంటే విజయం దాసోహం అంటుంది.

ఎప్పుడూ సన్నద్ధంగా ఉండాలి:
జీవితంలో అంటే ఆటుపోట్లు ఉంటాయి. రోజులో పగలు రాత్రి ఉన్నట్లుగానే, సూర్యోదయం, సూర్యాస్తమయం ఉన్నట్లుగానే జీవితంలో కష్టాలు, సుఖాలు రెండూ ఉంటాయి. వాటికి ఎప్పుడూ సన్నద్ధంగా ఉండాలని సూచిస్తాడు చాణక్యుడు. జీవితం సాఫీగా సాగుతున్నప్పుడు అనుకోని ఆపద వచ్చినప్పుడు ఎలా నిలదొక్కుకోవాలో నేర్చుకోవాలని అంటాడు చాణక్యుడు. సుఖంగా ఉన్నప్పుడు కష్టం గురించి ఆలోచించి సంసిద్ధం కావాలని సూచించాడు. ఎలాంటి పరిస్థితికైనా ముందే సిద్ధపడి ఉండే వాటిని ఎదుర్కోవడం, తట్టుకుని నిలబడం సులువు అవుతుందని చెప్పాడు ఆచార్య చాణక్యుడు.



Click it and Unblock the Notifications