For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Earth Hour Day 2022: ఎర్త్ హవర్ డే ఎప్పుడు? ఈరోజున లైట్లన్నీ ఎందుకు ఆపాలంటే..?

ఎర్త్ హవర్ డే 2022 సందర్భంగా, ఈ దినోత్సవ చరిత్ర, థీమ్, ప్రాముఖ్యత, ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

వాతావరణంలో జరిగే మార్పులు, ఎనర్జీ(శక్తి) పరిరక్షణ గురించి అందరిలోనూ అవగాహన కల్పిచేందుకు ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా 'ఎర్త్ హవర్ డే'(Earth Hour Day) జరుపుకుంటారు.

Earth Hour Day 2022: Date, theme, history, significance and interesting Facts in Telugu

ఈరోజున ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈరోజంతా ఒక వేడుకలా జరుపుకుంటారు. ఎర్త్ హవర్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ దాదాపు ఒక గంట సేపు విద్యుత్ కాంతులు అనేవి లేకుండా లైట్లన్నింటినీ ఆఫ్ చేస్తారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఈ ఎర్త్ హవర్ డే ను నిర్వహిస్తోంది. ఎర్త్ హవర్ సందర్భంగా ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్లలోని లైట్లను ఆఫ్ చేయడాన్ని ఒక ఉద్యమంలా చేస్తారు.

Earth Hour Day 2022: Date, theme, history, significance and interesting Facts in Telugu

'ఎర్త్ హవర్ డే' 2022 థీమ్ ఏంటంటే..

ఈ సంవత్సరం 'ఎర్త్ హవర్ డే' థీమ్ ఏంటంటే.. మన అందమైన భవిష్యత్తును రూపుదిద్దుకుందాం(Shape Our Future). ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అంటే ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ఇతర ప్లాట్ ఫామ్స్ లో #ShapeOurFuture హ్యాష్ ట్యాగ్ ద్వారా ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలి. సహజంగా లభించే ప్రక్రుతి వనరులు దుర్వినియోగం కాకుండా మనం కాపాడుకుంటేనే, మన భవిష్యత్తు తరాలకు అందించగలుగుతాం. లేకపోతే అవి ఇప్పుడే నాశనం అవుతాయి. వీటి గురించి తెలియజేయడానికే 'ఎర్త్ హవర్ డే' పేరిట లైట్లన్నింటినీ ఆఫ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఒక గంట సమయం విద్యుత్ తయారీకి వినియోగించే వనరులు ఆదా అవుతాయి. కేవలం మనం ఒక గంట మాత్రమే ఆదా చేస్తామనుకుంటే పొరబడినట్టే.. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఒక గంట పాటు ఇలా చేయడం వల్ల ఎంత ఫలితముంటుందో మీరే ఊహించండి.

ఎందుకని చేస్తారంటే..

'ఎర్త్ హవర్ డే'ను ప్రతి సంవత్సరం మార్చి మాసంలో చివరి శనివారం రోజున నిర్వహిస్తారు. 2022లో మార్చి 26వ తేదీన 'ఎర్త్ హవర్ డే' వచ్చింది. ఈ సందర్భంగా రాత్రి వేళలో సరిగ్గా 8:30 గంటలకు 'ఎర్త్ హవర్' ప్రారంభమవుతుంది. సుమారు గంటపాటు కొనసాగిన తర్వాత 9:30 గంటలకు ఇది పూర్తవుతుంది. ఈ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోని స్విచ్చులన్నీ ఆఫ్ చేయాలి. సరిగ్గా 9:30 గంటలకు ఆన్ చేయాలి.

'ఎర్త్ హవర్ డే' చరిత్ర..

WWF(World Wide Fund For Nature) అనే సంస్థ 2007లో సిడ్నీలో, దాని మిత్ర దేశాలు నిర్వహించిన 'సింబాలిక్ లైట్స్-అవుట్ ఈవెంట్'కు ఊహించని విధంగా ప్రచారం లభించింది. దీంతో ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీంతో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా దీన్ని అతి పెద్ద ఈవెంట్ గా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం మార్చి చివరి శనివారం రోజున 180కి పైగా దేశాల్లో మిలియన్ల సంఖ్యలో ప్రజలు భూమిపై తమకు ఉన్న గౌరవాన్ని తెలిపేందుకు, తమ ఇంట్లోని లైట్లన్నీ ఆఫ్ చేస్తున్నారు. మన చుట్టూ ఉన్న పచ్చని వనాన్ని కాపాడుకోవడానికి కాలుష్య రహిత, రోగాలు లేని లైఫ్ స్టైల్ కోసం దీన్ని నిర్వహిస్తారు. ఈరోజు రాత్రి 8:30 గంటలకు లైట్లు ఆఫ్ చేసి సంఘీభావం తెలిపేందుకు మీరు కూడా రెడీనే కదా?

FAQ's

English summary

Earth Hour Day 2022: Date, theme, history, significance and interesting Facts in Telugu

Here we are talking about the Earth Hour Day 2022: Date, theme, history, significance and interesting facts in Telugu. Read on
Story first published:Saturday, March 26, 2022, 17:23 [IST]
Desktop Bottom Promotion