Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
బల్లి మీ బాడీలోని ఆ పార్ట్ పై పడితే అదృష్టమా... దురదృష్టమా? ఇప్పుడే తెలుసుకోండి...
బల్లి మానవ శరీరంలో ముఖ్యంగా అక్కడపడితే జరిగే పరిణామాల గురించి తెలుసుకోండి.
భారతదేశంలోని ప్రజలు జ్యోతిష్యాన్ని నమ్ముతారో లేదో తెలియదు గాని.. బల్లి శకునాలను మాత్రం బాగా నమ్ముతారు. అయితే ఇది ఇప్పటిది కాదు. పూర్వకాలం నుండి ఈ సంప్రదాయం నమ్మకం అలాగే కొనసాగుతూ వస్తోంది.

అందుకే బల్లి శాస్త్రం గురించి గౌలి పంచాంగంలో బల్లి శరీరంలోని ఏ భాగంలో పడితే ఎలాంటి శకునాలు ఎదురవుతాయనే విషయాలను జ్యోతిష్య నిపుణులు పూర్తి వివరాలను వివరించారు.

అప్పుడప్పు మన శరీరంలోని పలు భాగాలపై బల్లి పడుతూ ఉంటుంది. అయితే దీనికి చాలా మంది భయపడుతూ ఉంటారు. అయితే బల్లి పడింది అనే దాని కంటే అది ఏ సమయంలో పడింది... ఎక్కడ పడింది అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే బల్లి మన శరీరంపై పడితే అపశకునాలే కాదు శుభఫలితాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వివరించారు. అయితే బల్లి శరీరంలోని ఏ భాగంపై పడితే ఏమి జరుగుతుంది. అది ఎంతలా ప్రభావితం చేస్తుంది. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

తల వెనుక భాగంలో..
- బల్లి తల వెనుక భాగంలో ఎవరితో అయినా వివాదం ఉండొచ్చు.
- తల మధ్య భాగంలో తల్లి, సోదరుడు లేదా గురువు మరణాన్ని సూచిస్తుంది.
- నుదుటిపై బల్లి పడితే, అది మీ సంపదకు మార్గంగా చెబుతారు.
- నుదుటి మధ్యలో పడితే విలువైనవి మీ వద్దకు వస్తాయి.
- ఎడమ కన్ను మీద పడితే మీకు కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి.
- కుడి కన్ను మీద పడితే మాత్రం మీ ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి.
- కుడి చెంప మీద పడితే మీరు చెడు వార్తలు వింటారు.
- పై పదాలపై పడితే ఏవైనా తగాదాలు సంభవించవచ్చు. అయితే భూలాభం కూడా రావచ్చు.
- రెండు పెదాలపై పడితే తక్షణ ఆర్థిక లాభాలు గడిస్తారు.
- కింద పెదాలపై పడితే సుభోజనం దక్కుతుంది.
- బల్లి చేతి మణికట్టు మీద పడితే ఇల్లు మార్పు లేదా ఇంట్లో మెరుగైన పరిస్థితులు ఏర్పడతాయి.
- చేయి మీద పడితే ఆర్థిక నష్టం రావచ్చు.
- వేళ్ల మీద పడితే మీ పాత స్నేహితులను కలవొచ్చు.
- కుడి చేతి మీద పడితే కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
- ఎడమ చేతి మీద పడితే ఇబ్బందులను ఎదుర్కొంటారు.
- బల్లి మీసం మీద పడితే మీకు ముందు ముందు కష్టకాలం ఎదురవుతుంది.
- గడ్డం మీద పడితే అపమృత్యువుకు సంకేతం.
- ఆడవారికి తలమీద బల్లి పడితే మరణ భయం ఉంటుంది.
- ఎడమ కన్నుపై పడితే మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తాడు.
- కుడి కన్నుపై పడితే మీరు కొంత నిరాశను ఎదుర్కోవచ్చు.
- కుడి చెంపపై మీరు ఓ అబ్బాని పొందవచ్చు.
- బల్లి కుడి చెవిపైన పడినప్పుడు కొన్ని ఆర్థిక లాభాలు వస్తాయి.
- పెదాలపై పడితే కొన్ని వివాదాలను ఎదుర్కొంటారు.
- కింది పెదాలపై పడితే కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు.
- రెండు పెదాలపై కలిపి పడినప్పుడు ఎవరితో అయినా వివాదం రావచ్చు.
- ఆడవారి చేతి పంజా మీద పడినప్పుడు ఎవరితో అయినా తగాదాలు రావచ్చు.
- వారి చేతి మీద పడినప్పుడే ఆడవారికి కొంత ఒత్తిడి ఉంటుంది.
- అమ్మాయిల వేళ్లపై బల్లి పడితే కొన్ని కొత్త ఆభరణాలు లభిస్తాయి.
- కుడి చేతిపై ప్రేమక్షణాలు ముందుకు వస్తాయి.
- భుజాలపై పడితే నగలను పొందుతారు.
- తొడలపై పడితే ప్రేమ విషయంలో విజయం దక్కుతుంది.
- మోకాలిపై పడితే మీపై అందరికీ ఆప్యాయత పెరుగుతుంది.
- చీలమండంపై బల్లి పడితే కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
- కాలి మీద పడితే కొంతమంది సందర్శకులు ఇంటికి వస్తారు.
- కుడి పాదంపై పడితే కొన్ని వైఫల్యాలు ఎదురవుతాయి.
- ఎడమ పాదంపై పడితే మీరు కోరుకున్న వారిని పొందుతారు.

ఇక్కడ పడితే..

పెదాలపై పడితే..

మణికట్టు మీద పడితే..

మీసం మీద పడితే

ఆడవారి శరీరంపై పడినప్పుడు..

కుడి చెవిపై పడితే..

ఆడవారి చేతుల మీద..

వేళ్లపై పడితే..




Click it and Unblock the Notifications
