For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Father's Day 2021: నాన్నను అందరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా...

ఫాదర్స్ డే గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

|

ఈ లోకంలో మదర్స్ డే జరుపుకున్నంత ఘనంగా ఫాదర్స్ డే జరుపుకోరు. ఎందుకంటే తల్లితో సమానమైన ప్రేమను తండ్రి మనకు అందివ్వాలనే భావన చాలా మందిలో ఉంది.

Fathers Day 2021 : Interesting facts about fathers in Telugu

కానీ తనలో ఉన్న భావోద్వేగాలను అంత సులభంగా బయట పెట్టుకోలేక.. బయటకు చాలా గంభీరంగా కనిపిస్తూ.. ఆ స్పందనను తన ఫేసులో కనబడకుండా చేసే వ్యక్తే తండ్రి. అనే నానుడి మన సమాజంలో బాగా నాటుకుపోయింది. అయితే తల్లి ప్రేమ భావోద్వేగాలతో ముడిపడి ఉంటే.. తండ్రి ప్రేమ బాధ్యతతో ముడిపడి ఉంటుంది.

Fathers Day 2021 : Interesting facts about fathers in Telugu

అందుకే మనలో నీకు ఎవరంటే ఇష్టమని అడిగితే.. ఏ మాత్రం ఆలోచించకుండా 'అమ్మ' అని చెబుతారు. ఇంకా ఎవరంటే ఇష్టం అని అడిగితే 'నాన్న' అని చెబుతారు. ఎందుకంటే అమ్మ మనల్ని తన కడుపులో నవ మాసాలు మోసి మనకు జన్మనిస్తుంది. నాన్న రేసులో కాస్త వెనుకబడ్డాడు కదా.. అందుకే తండ్రికి తర్వాతి స్థానం దక్కింది.

Fathers Day 2021 : Interesting facts about fathers in Telugu

అయితే మనం పుట్టినప్పటి నుండి ఎదిగేంత వరకు.. మనకు నడక నేర్పడం వంటివి.. తప్పటడుగులు వేసినప్పుడు సరిచేస్తూ మనల్ని సరైన దారిలో నడిపించే వాడు నాన్న. అలాంటి తండ్రులను ప్రతి ఏటా స్మరించుకోవడాని ఓ రోజు అంటూ ఉంది. అదే జూన్ 21వ తేదీ. ఈ సందర్భంగా తండ్రుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

Fathers' Day 2021 : ఫాదర్స్ డే విషెస్, కోట్స్, మెసెజ్ లను షేర్ చేసుకోండి...Fathers' Day 2021 : ఫాదర్స్ డే విషెస్, కోట్స్, మెసెజ్ లను షేర్ చేసుకోండి...

తొలి హిరో నాన్న..

తొలి హిరో నాన్న..

చిన్నప్పుడు లాలించావు.. నాకు ఎన్నో ఆటలను నేర్పించావు.. ఎక్కడ నెగ్గాలో కాకుండా.. ఎక్కడ తగ్గాలో చూపించావు.. నా భవిష్యత్తుకై ప్రమిదలా కరిగిపోయావు.. కొంత భయపెట్టినా నన్ను ఉన్నత స్థానానికి చేర్చావు.. నా ప్రగతి కోసం ప్రతి క్షణం పరితపించావు.. అందుకే నా జీవితంలో తొలి హీరోవి అయ్యావు.. నాన్నకు ప్రేమతో ఓ కూతురు..

తండ్రికి తక్కువ ప్రాధాన్యత..

తండ్రికి తక్కువ ప్రాధాన్యత..

పిల్లల్ని కనిపెంచటం...వారికి విద్యాబుద్ధులు నేర్పించటం... వారి బంగారు భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దటంలో తల్లిదండ్రుల పాత్ర సమానంగా ఉన్నా తల్లికి లభించే గుర్తింపే ఎక్కువ. అంటే తల్లి ప్రేమ సెంటిమెంట్‌గా వ్రాసే కథలు, కవితలు, తీసే సినిమాలు... వీటన్నింటిని చూస్తే తండ్రి పాత్రకు అంతగా ప్రాధాన్యత లభించడం లేదని చెప్పుకోవచ్చు.

నాన్న తాపత్రయం..

నాన్న తాపత్రయం..

బిడ్డ కోసం అమ్మ చేసే త్యాగం, ఎంత ముఖ్యమైనదో... నాన్న పడే తాపత్రయం, శ్రమ అంతే ముఖ్యమైనవి. కానీ తండ్రి శ్రమ, అభిమానం, తాపత్రయం.. అన్నీ పరోక్షమైనవి. తండ్రి పిల్లలకు అవసమైన సదుపాయాలను సమకూరుస్తూ వారికి ఏ లోటు రాకుండా చూస్తాడు. పిల్లల దగ్గర ఎప్పుడూ తల్లి ఉండేటట్టు చూసి వారిని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు.

Father's day 2021 : నాన్నే నా హీరో అని కూతుళ్లెందుకుంటారో తెలుసా...Father's day 2021 : నాన్నే నా హీరో అని కూతుళ్లెందుకుంటారో తెలుసా...

విలక్షణమైన పాత్ర..

విలక్షణమైన పాత్ర..

ఏదైమైనా మన జీవితాల్లో ఓ విలక్షణమైన పాత్రను పోషించే.. గొప్ప వ్యక్తి తండ్రి. ఎవరు ఔనన్నా.. కాదన్నా ఇదే వాస్తవం. మనం గెలిచినప్పుడు పదిమందికి చెప్పుకుని ఆనందపడతారు. కానీ మనం ఓడినప్పుడు మాత్రం మన భుజం తట్టి మళ్లీ అవకాశం వస్తుంది.. అప్పుడు గెలుస్తావులే అని దగ్గరని తీసుకుని ధైర్యం చెప్పే వ్యక్తే నాన్న.

అసలైన వారసులు..

అసలైన వారసులు..

’నా పిల్లలుగా పుట్టినంత మాత్రాన మీరు నా వారసులు అవ్వరు. ఎవరైతే నా మంచి భావాలను, లక్షణాలను కొనసాగిస్తారో వారే నాకు అసలైన వారసులు' అని ఓ సినీ కవి అన్నారు. కాబట్టి మనం నాన్నకు ఇచ్చే నిజమైన కానుక ఏంటంటే.. ఆయన ఈ జన్మని, పేరుని చెడగొట్టకుండా చివరి వరకు ఉండటమే.

English summary

Father's Day 2021 : Interesting facts about fathers in Telugu

Here we are talking about the father's day 2021 : Interesting facts about fathers in Telugu. Read on
Desktop Bottom Promotion